పి. లక్ష్మణ్‌రావ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పి. లక్ష్మణ్‌రావ్ లేదా పోతుబరి లక్ష్మణ్‌రావ్ ప్రసిద్ధ తెలుగు రచయిత. వీరు విజయనగరం జిల్లాలోని సాలూరు కు చెందినవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో సహాయ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. వీరి ముత్తాత పోతుబరి పెద నారాయణ గారు రాజవైద్యులు. వీరి తాతగారు పోతుబరి విష్ణుమూర్తి దీనజన సేవకులు, వీరి నాన్నగారు పోతుబరి అప్పల సూర్యనారాయణ ఆయుర్వేద చంటిపిల్లల నిపుణులు.

ముద్రిత రచనలు[మార్చు]

 1. ఏకాకిగోల (కవితా సంపుటి)
 2. నావి - నీవి (నానీలు)
 3. భావచిత్రాలు (హైకూలు)
 4. ఋతువిహంగం (హైకూలు)
 5. అగ్నివృక్షం (దీర్ఘ కవిత)
 6. తీరని దాహం (నానీలు)
 7. మెరుపు శబ్దం (మినీ కవితలు)
 8. కొంచెం నిప్పు - కొంచెం నీరు (సాహిత్య వ్యాసాలు)
 9. దగా దగా - ధగ ధగ (సామాజిక వ్యాసాలు)
 10. ప్రవర్తన - పరివర్తన (చింతన వ్యాసాలు)
 11. గాజుముక్క (వచన కవిత్వం)
 12. నీటిబొట్టు (నానీలపై సమీక్షా వ్యాసాలు)

పురస్కారాలు[మార్చు]

 • రంజని-కుందుర్తి - 2005
 • ఆంధ్రప్రదేశ్ స్వర్ణోత్సవ జిల్లా పురస్కారం - 2006
 • యువకవి ప్రతిభా పురస్కారం - 2008
 • ఉడా, విశాఖ ఉగాది పురస్కారం - 2007, 2008
 • అధికార భాషా సంఘం, హైదరాబాద్ వారిచే భాషా సత్కార పత్రం - 2008
 • భారతీ తీర్థ వారిచే జిల్లా కలక్టర్ వారి ద్వారా సన్మానం - 2009
 • ఆంధ్ర సారస్వత సమితి, మచిలీపట్నం వారి ఉగాది పురస్కారం - 2010
 • మానాన్న రాష్ట్రస్థాయి కవితల పోటీలో తృతీయ బహుమతి - 2010
 • ఇండియన్ హైకూ క్లబ్, అనకాపల్లి వారి ఉత్తమ వ్యాసరచన అవార్డు - 2010
 • చైతన్యభారతి, గజపతినగరం వారి ఉగాది పురస్కారం - 2011

మూలాలు[మార్చు]