పి. శివశంకర్
పుంజల శివశంకర్ | |||
![]()
| |||
మాజీ ఎం.పి.
| |||
నియోజకవర్గము | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మామిడిపల్లి, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | 10 ఆగష్టు 1929||
మరణం | ఫిబ్రవరి 27, 2017 హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానము | వినయ్ పుంజాల | ||
నివాసము | హైదరాబాద్, తెలంగాణ |
పుంజల శివశంకర్ (ఆగష్టు 10, 1929 - ఫిబ్రవరి 27, 2017) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. 1978, 80, 85లలో భారత జాతీయ కాంగ్రెస్ ఎం.పి.గా పనిచేశాడు.
జననం[మార్చు]
శివశంకర్ 1929, ఆగష్టు 10న రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో జన్మించాడు.
విద్యాభ్యాసం - ఉద్యోగం[మార్చు]
అమృత్‌సర్ నుంచి బి.ఏ. పట్టాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టాను పొందాడు. 1974-75 మధ్యకాలంలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేశాడు.
కుటుంబ వివరాలు[మార్చు]
ఇతని కుమారుడు వినయ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యనిపుణులగా పనిచేస్తుండగా, కోడలు అలేఖ్య పుంజాల కూచిపూడి కళాకారిణిగా, నాట్య గరువుగా ఉన్నారు.[1]
రాజకీయ ప్రస్థానం[మార్చు]
1979 సంవత్సరంలో జరిగిన ఆరో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు.[2] 1980లో నిర్వహించిన రీ ఎలక్షన్‌లో తిరిగి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. 1985, 1993 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశాడు. 1987-88 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా పనిచేశాడు. 1994-95 సంవత్సరంలో సిక్కిం గవర్నర్‌గా, 1995-96 వరకు కేరళ గవర్నర్‌గా పనిచేశాడు. 1998లో తెనాలి లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి 2008లో చిరంజీవి ఏర్పాటుచేసిన ప్రజారాజ్యం పార్టీ పార్టీలో చేరి, కొంతకాలం పనిచేశాడు.[3][4] శివశంకర్ కుమారుడు, ప్రముఖ వైద్యులు పి. వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ముషీరాబాద్ ఇన్ ఛార్జ్ గా ఉన్నాడు.
మరణం[మార్చు]
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివశంకర్ 2017, ఫిబ్రవరి 27 ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 52లోని తన స్వగృహంలో తుడి శ్వాస విడిచాడు.[5]
మూలాలు[మార్చు]
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య - ఓపెన్ పేజి (1 January 2018). "అప్పుడు విద్యార్థిని.. ఇప్పుడు రిజిస్ట్రార్‌ని." వెంకటేశ్. Archived from the original on 14 May 2019. Retrieved 14 May 2019.
- ↑ భారత్ టుడే. "న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి…". /www.bhaarattoday.com. Retrieved 27 February 2017.[permanent dead link]
- ↑ తెలుగు వెబ్ దునియా. "పీఆర్పీ తీర్థం పుచ్చుకున్న శివశంకర్". telugu.webdunia.com. Retrieved 27 February 2017.
- ↑ తెలుగు వన్ ఇండియా. "15న చిడు పార్టీలో శివశంకర్". telugu.oneindia.com. Retrieved 27 February 2017.
- ↑ తెలంగాణ హెడ్ లైన్స్. "కాంగ్రెస్ సీనియర్ నేత పి.శివశంకర్ మృతి". telanganaheadlines.in. Archived from the original on 27 February 2017. Retrieved 27 February 2017.
ఇతర లంకెలు[మార్చు]
- నవతరం పూలే:పుంజాల శివశంకర్ మార్చి 1, 2017.
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- 1929 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- పార్లమెంటు సభ్యులు
- 2017 మరణాలు
- 6వ లోక్‌సభ సభ్యులు
- 7వ లోక్‌సభ సభ్యులు
- రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు
- హైదరాబాదు జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) కు చెందిన కేంద్ర మంత్రులు
- గుజరాత్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
- హైదరాబాదు జిల్లాకు చెందిన గవర్నర్లు