పీతాని సత్యనారాయణ
Jump to navigation
Jump to search
పీతాని సత్యనారాయణ ప్రముఖ కాంగ్రెస్ నేత. 1952 డిసెంబరు 9న జన్మించిన సత్యనారాయణ స్వగ్రామం పాలకొల్లు మండలం కొమ్ము చిక్కాల గ్రామం. ప్రధానంగా లేసు వ్యాపారిగా ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ తరువాత పెనుగొండ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైనారు.
బాల్యం,విధ్య[మార్చు]
పీతాని తండ్రి వెంకన్న కొమ్ముచిక్కాల గ్రామంలో ప్రముఖుడు. లేసు వ్యాపారాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వాడు వెంకన్న. సత్యనారాయణ ప్రాథమిక విద్య కొమ్ముచిక్కాల హైస్కూలులోనూ, ఉన్నతవిద్య పెనుగొండ లోనూ గడిచింది.
రాజకీయ ప్రవేశం[మార్చు]
- 2009 లో మొదటగా పెనుగొండ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశానికి చెందిన కర్రి రాధాకృష్ణారెడ్డిపై గెలుపొందారు.
పదవులు[మార్చు]
- ఛైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ పెడరేషన్
- ఆరోగ్యశ్రీ శాఖా మంత్రిగా పనిచేసారు
- ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు.