పీ.వీ. సంజయ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీ.వీ. సంజయ్ కుమార్

మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
14 ఫిబ్రవరి 2021 – ప్రస్తుతం
సూచించిన వారు శరద్ అరవింద్ బాబ్డే
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
14 అక్టోబర్ 2019 – 13 ఫిబ్రవరి 2021
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

పదవీ కాలం
8 ఆగష్టు 2008 – 13 అక్టోబర్ 2019
సూచించిన వారు కె.జి. బాలకృష్ణన్
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-08-14) 1963 ఆగస్టు 14 (వయసు 60)
తల్లిదండ్రులు పులిగోరు రామచంద్రారెడ్డి, పద్మావతమ్మ
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ

పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 ఫిబ్రవరి 14న మణిపూర్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి 2023 ఫిబ్రవరి 4న అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సుప్రీంకోర్టులో తెలుగు జడ్జిల సంఖ్య రెండుకు చేరుకుంది. ఇప్పటికే తెలుగు జడ్జి జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ఉన్నారు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

పీ.వీ. సంజయ్ కుమార్ 1963 ఆగస్టు 14న పులిగోరు రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి రామచంద్రారెడ్డి 1969 నుంచి 1982 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశాడు. సంజయ్‌కుమార్‌ నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి 1988లో ఢిల్లీ యూని వర్సిటీ నుంచి లా పూర్తి చేశాడు.

వృత్తి జీవితం[మార్చు]

పీ.వీ. సంజయ్ కుమార్ లా పూర్తి చేసిన తరువాత 1988లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని తన తండ్రి రామచంద్రా రెడ్డి వద్ద జూనియర్ గా చేరాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా 2000 నుండి 2003 వరకు పనిచేశాడు. సంజయ్ కుమార్ 2008 ఆగస్టు 8న అదనపు జడ్జిగా నియమితుడై, 2010 జనవరి 20న శాశ్వత జడ్జిగా నియమితుడయ్యాడు.[2] ఆయన 2019 జనవరి 2న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[3] పీ.వీ. సంజయ్‌ కుమార్‌ 2019 అక్టోబరు 14[4] నుండి 2021 ఫిబ్రవరి 13 వరకు పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, 2021 ఫిబ్రవరి 14 న మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "Justice PV Sanjay Kumar Made Judge Of Supreme Court - Sakshi". web.archive.org. 2023-02-05. Archived from the original on 2023-02-05. Retrieved 2023-02-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Sakshi (2 January 2019). "కొలువుదీరిన కొత్త హైకోర్టు". Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  3. The Times of India (2 January 2021). "13-judge strong Telangana HC will sit from Wednesday" (in ఇంగ్లీష్). Archived from the original on 19 October 2021. Retrieved 19 October 2021.
  4. The Times of India (14 October 2019). "Justice PV Sanjay Kumar sworn in as Punjab and Haryana HC judge | Chandigarh News - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
  5. Bar and Bench (12 February 2021). "Justice PV Sanjay Kumar appointed Chief Justice of Manipur High Court" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.