పుట్టపర్తి శ్రీనివాసాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పుట్టపర్తి శ్రీనివాసాచారి యమ్.ఎ., పి.హెచ్ డి (లండన్)

పరిచయం[మార్చు]

డా శ్రీనివాసాచారిగారు 1909 లో అనంతపూరులో జన్మించారు. 1958 లో వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో డైరెక్టరు ఆఫ్ ఆర్కియాలజీగా పనిచేస్తూనే ప్రభత్వమువారి సాహిత్య విభాగములో అదనపు బాధ్యతలు వహించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య చరిత్రలో వీరికి ప్రముఖ స్థానము ఉంది. అయ్యదేవర కాళేశ్వరరావు గారి నేత్రుత్వములో నియమించబడ్డ " ఆంధ్ర అకాడమీ ఆఫ్ హిస్టరీ అండ్ సైన్సు" అను సాహిత్యకమిటీ నొకటి నెలకొలుపబడెను. దానికి వీరు కార్యదర్శిగా చేశారు. తరువాత వారు అమెరికాలోని మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ (అధ్యాపకులుగా) పనిచేస్తున్నరోజులలో నవంబరు 1963 లో అకస్మాత్తుగా మరణించారు.[1]

ఉద్యోగ పదవీ బాధ్యతలు[మార్చు]

శ్రీనివాసాచారి గారు లండన్ యూనివర్సిటీలో పురాతత్వ శాస్త్రములో పరిసోధన చేసి పి.హెచ్ డి (డాక్టరేట్) పట్టాపుచ్చుకున్నారు. విజయవాడలోని యస్ అర్ అర్ సి వి. ఆర్ కళాశాలలో కొన్నాళ్లు చరిత్ర అద్యాపకులు గాచేశారు. అప్పటి ప్రిన్సిపాల్ గారు, శ్రీ యన్ స్వామినాధ అయ్యర్ గారి తదనంతరం శ్రీనివాసాచారి గారు పదవోన్నతిపై ప్రధానోధ్యాపకునిగా చేశారు. వారు అక్కడ ప్రినిస్పాల్ గాచేస్తున్నరోజులలో 1947-1948 లో ఒకసారి వారు కాలేజీ విద్యార్థులను నాగార్జునకొండకు (సాగర్ డామ్ రాకముందు) ఎక్సర్షన్ కు తీసుకునివెళ్లారు. అనంతపురం, శ్రీకాళహస్తి కాలేజీలలో ప్రిన్సిపాల్ గాచేసి రిటైరైన రసాయనశాస్త్ర ప్రొఫెసర్ శ్రీ ఈశ్వరప్రగడ శేషావతారం గారు 1948 లో ఆ యస్ అర్ అర్ సి వి. ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా చదువుతున్నప్పడు డా.శ్రీనివాసాచారిగారి ఆధర్యములో ఎక్సకర్షన్ కు వెళ్ళిన విద్యార్థి బృందములో ఒకరు. డా శ్రీనివాసాచారి గారి పురాతత్వశాస్త్ర పరిశోధనా నైపుణ్యమును కనులారా చూసిన వారిలో ఒకరు. నాగార్జున కొండ వద్ద నున్న అనేక చారిత్రాత్మక పురాతన శిలాశాసనములలో ప్రముఖమైన వీరపురుషదత్తు - శ్రీ శాంతిమూల దంపతుల అశ్వమేధయాగము చేసిన విశేషములు వెల్లడించే శిలా శాసనములు ప్రాక్రితిలో వ్రాయబడిన శాసనములను డా. శ్రీనివాసాచారి గారు అతి సునాయాసముగా గుర్తుపట్టి చదివి విద్యార్థులకు వాటి చారిత్రాత్మకవృత్తాంతము చెప్పినారని శేషావతారంగారు చెప్పారు. డా శ్రీనివాసాచారిగారు ప్రన్సిపాల్ గానున్నప్పు డు యస్ అర్ అర్ సి వి. ఆర్ కళాశాల విజయవాడలో వారితోటి సమకాలీకులై ఉపాధ్యాయులుగా నుండిన వారిలో ప్రముఖులువిశ్వనాధ సత్యనారాయణ గారు, జొన్నలగడ్డ సత్యనారాయణ గారు, జటావల్లభుల పురుషోత్తము గారు మొదలగు వారు. డా శ్రీనివాసాచారిగారు అటుతరువాత బర్మా (ఇప్పటి మైనమార్) లోని రంగూన్ యునివర్సిటీ వారి ఆహ్వానముపై రంగూన్ యూనివర్రిసిటీ చరిత్ర పీఠమునకు అధ్యక్షుడుగా కొన్నాళ్లు పనిచేశారు. ఆ రోజులలో అచ్చట రాజకీయకల్లోలములుండెను. భారతీయులకు ప్రాణాపాయముండెనుకూడా అయినా డా శ్రీనివాసాచారిగారు ధర్యముగా వారి అభియాన కాలంము సఫలముగా వినియోగించి వచ్చిరి. అచ్చటినుండి వచ్చినపిదప హైదరాబాదులోని పురాతత్వశాఖకి డైరెక్టరు పదవిలో కొన్నాళ్లు పనిచేసిరి. అటుతరువాత ఉస్మానియా యూనివర్సిటీలో చరిత్రశాశకు అధ్యక్షులు గానున్న మారేమండ రామారావు గారు తరువాత శ్రీనివాసాచారి గారిని నియమించిరి. అచ్చట పనిచేయుచున్నరోజులలోనే 1962లో వారికి అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ గా ఆహ్వానంపై అమెరికా నెళ్ళారు. నవంబరు 1963 లో అచ్చటనే అకస్మాత్తుగా వారి 54 వ ఎటనే పరమదించటం జరిగింది.

సాహిత్య కృషి[మార్చు]

డా శ్రీనివాసాచారిగారికి తెలుగుతో పాటు సంస్కృతము, కన్నడములో గూడా అసాధారణ పాండిత్యము గలదు. వారు తమిళంగూడా సునాయాసముగా మాట్లడగలిగేవారు. వారి విజ్ఞానపరిశోధనకు మూలాధారమైన పురాతత్వ శాస్త్రము, (ఆర్కియాలజీ) లోవారు ప్రతిభావంతులు. శిలాశాసనములు విశదీకరించటంలో వారు దిట్ట. ఆంధ్ర ప్రదేశ్ లోనిఅమరావతి, నాగార్డున సాగర్ ప్రాంతములదు బయల్పడిన అనేక అమూల్య శిలా శాసనములపై కృషి చేశారు. విజయవాడ యస్ ఆర్ ఆర్ కాలేజీలో అధ్యాపకులుగా చేసే రోజలలోనే (1940 దశాబ్ధ మొదట్లో) వారు చారిత్రక వ్యాసములు ప్రచురించారు. వారి వ్యాసములు భారతి లోను ఇతరపత్రికలలోనూ ప్రచురించబడినవి.[2] సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం లోను, 1941 లో మాగంటి బాపినీడు గారు ప్రచురించిన ఆంధ్ర సర్వస్వం లోను ప్రచురించబడినవి. డా శ్రీనివాసాచారి గారు హైదరాబాదులో ఆంధ్రప్రదేశ ప్రభుత్వమువారి ఆర్కియాలజీ శాఖకు డైరక్టురు గానుండినప్పటి నుండి వారు అయ్యదేవర కాళేశ్వరరావు గారి ప్రోత్సాహముపై ప్రభుత్వమువారి సాహిత్య కమిటీలలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. 1958 లో నెలకొల్పబడ్డ "ఆంధ్ర అకాడమీ ఆఫ్ హిస్టరీ అండ్ సైన్సు" అను కమిటీ అయ్యదేవర వారి అధ్యక్షతన మాడపాటి హనుమంతరావు గారు ఉపాధ్యక్షులుగాను, డా శ్రీనివాసచారి గారు కార్యదర్సిగాను మారేమండ రామారావు గారు సహాయకార్యదర్శిగాను నియమింపబడిరి. ఆ కమిటీ ఆవిష్కరణ 1959 లో ప్రప్రథమ భారత రాష్ట్రపతి డాబాబు రాజేంద్ర ప్రసాద్ గారి చే జయప్రథముగా జరిపించుటకు డా శ్రీనివాసాచారి గారి కృషి ఎంతోయున్నది. పిమ్మట ఆ కమిటీని రెండు భాగములుగా చేసి చరిత్ర మరియూ విజ్ఞానశాస్త్రము వేరు వేరుగా ప్రత్యేక దృష్టి కలుగచేసి కొన్ని అమూల్య ప్రచురణలు చేశారు. ఆ చరిత్రకు సంబంధించిన కమిటీకి డా శ్రీనివాసాచారి గారు కార్యదర్సిగా యుండి అనేక అమూల్య ప్రచురణలు చేశారు. 1962 లో అయ్యదేవర కాళేశ్వరరావుగారు పరమదించటంతో డా శ్రీనివాసాచారి గారు తమ పదవీ విరమణ చేశారు. డా శ్రీనివాసాచారి గారి రచనలలో విశిష్టమైనది "విజయనగర చరిత్ర" ఇది ఆంగ్లములో రచించారు.

కుటుంబ సమాచారం[మార్చు]

డా శ్రీనివాసాచారి గారికి ఇద్దరు తమ్ములలో ఒకరు పుట్టపర్తి రామాచారి. రెండవ వారు పుట్టపర్తి శేషాచారి గారు బేతంచర్ల అసెంబ్లీ కాన్ స్టిట్యుయన్సీ నుంచి యమ్ ఎల్ ఎగా నుండేవారు. డా శ్రీనివాసా చారి గారికి ఒక కుమార్తె ఒక కుమారుడు యుండెను.

మూలాధారములు[మార్చు]

  1. "కీర్తిశేషులు శ్రీ పుట్టవర్తి శ్రీనివాసాచారి", దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్ర ప్రభ 01/12/1963
  2. డాక్టరు పట్టాభి సీతారామయ్య గారి కాంగ్రెస్ చరిత్రకు విమర్శ, డా పుట్టపర్తి శ్రీనివాసాచారి భారతి 1936 మార్చి