పున్నమినాగు (1980 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పున్నమినాగు
దర్శకత్వంయమ్.రాజశేఖర్
తారాగణంచిరంజీవి,
నరసింహ రాజు,
రతి అగ్నిహోత్రి
మేనక
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1980 జూన్ 13 (1980-06-13)
భాషతెలుగు

పున్నమినాగు ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

కథ[మార్చు]

నాగులు ఒక పాములు ఆడించుకునే వ్యక్తి. పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. మేనక పెంపుడు అన్న రాజు నాగులు చెల్లెలు వరసైన లక్ష్మిని ప్రేమిస్తుంటాడు. నాగులు తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం అతని తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతను ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతనికి కలిసిన అమ్మాయిలందరూ అతనిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒక సారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడా పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు నాగులు మీద అనుమానం మొదలవుతుంది. ఒక యువతి ఆ ఊరికి టీచర్ గా వచ్చి నాగులు చేతిలో మరణిస్తుంది. రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపొమ్మని అతనికి రాజు సలహా ఇస్తాడు. కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • అద్దిరబన్నా ముద్దుల గుమ్మా ముద్దుగా ఉన్నాది (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
  • గడుసు సిన్నది గంగానమ్మ గుడిసె సిన్నది అనుకోకమ్మా (ఎస్.పి.శైలజ)
  • జలకాలు ఆడేటి జాబిల్లి మొలక నీ సోకే కోకంటే నేకెందుకు (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
  • నీదేం పోయే నీ అమ్మ కొడుకా పొతే పోయే మాయెంట పడక (పి.సుశీల బృందం)
  • పున్నమి రాత్రి పువ్వుల రాత్రి వెల్లువ (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం కోరస్)

మూలాలు[మార్చు]