పురుషాయితము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A depiction of a couple engaged in the cowgirl position

రతి క్రియలో పురుషాయితము అనగా స్త్రీ పురుషుని పాత్ర పోషించడము. సాథారణంగా స్త్రీ క్రింద పురుషుడు పైన ఉండేవిధంగా రతిక్రియ జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా పురుషాయితంలో పురుషుడు క్రింద స్త్రీ మీద ఉండి సంభోగం జరుగుతుంది.

ఈ భంగిమలో పురుషుడు పరుపు మీద వెల్లకిలా పడుకొని ఉండగా స్త్రీ అతని మీద గుర్రం మీద కూర్చున్నట్లు పైకెక్కి లేదా బోర్లా పడుకొని పురుషాంగాన్ని యోని లోనికి తీసుకుంటుంది. కుర్చీలో కూర్చున్న భంగిమలో కూడా ఇది చేయవచ్చును. దీనివలన స్త్రీకి రతిక్రియలో పూర్తి ఆధిపత్యం ఉంటుంది. స్త్రీపురుషులిద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నందువలన వారి మధ్య సామీప్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ రతి జరుపుతున్న సమయంలో పురుషుడు ఆమె వక్షోజాలు, ముఖభాగాలు, పిరుదులు మొదలైన కామకేంద్రాలైన భాగాలను ఉపరతిగా తాకుతూ ఆమెను ఉద్రేకపరచే వీలుంటుంది.

కొన్నిసార్లు దీనికి భిన్నంగా పడుకున్న పురుషుని పైన కూర్చున్న స్త్రీ వెనుకకు తిరిగి (వీపు పురుషుని వైపుంచి) పురుషాంగాన్ని చేతితో పట్టుకొని వెనుకనుండి తనలోనికి చొప్పించుకుంటుంది. ఈ భంగిమలో ఆమె పురుషాంగాన్ని కన్నులారా చూసే వీలుంటుంది. లింగాన్ని లోనికి పెట్టుకునేటప్పుడు యోనిశీర్షాన్ని, జి స్పాట్ లను తానే స్వంతంగా ప్రేరేపించుకొనే అవకాశం ఉంటుంది.

గుద రతి కోసం కూడా ఈ భంగిమను ఉపయోగించే వీలుంటుంది. ఇక్కడ స్త్రీ పురుషాంగాన్ని యోనిలో కాకుండా లూబ్రికేషన్ చేసిన మలద్వారములో దూర్చుకొని సంపర్కాన్ని జరుపుతుంది.

పురుషాధిక్యత ఉన్న సమాజాలలో కొంతమంది దీనికి ఇష్టపడరు. పురుష వేశ్యలతో సంభోగం జరిపే స్త్రీలు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారట. స్త్రీవాదం వలన పురుషాధిక్యతను వ్యతిరేకించేవారు ఈ విధంగా తమ అసంతృప్తిని తెలియజేస్తారు.