పురుష సూక్తము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురుష సూక్తము హిందూ ధర్మానికి పట్టుకొమ్మ. వేద వాజ్మయంలోని మంత్ర భాగానికి చెందినవి సూక్తాలు. ఋగ్వేదంలోని దశమ మండలంలో ప్రస్తావించబడింది. 'సూక్తం' అనగా సమగ్రంగా స్వరూప నిరూపణ చెయ్యడం అని అర్థం. ఐహికంగా, ఆముష్మికంగా శాంతి, అభ్యుదయం అన్నవి ఈ సూక్తాల పరమ ప్రయోజనాలు. ఇవి ఈనాటి సమాజానికి ముఖ్యంగా కావలసినవి.

పురుష సూక్తంలో విరాట్ పురుషుని యొక్క స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి. వేద ప్రాతిపదితమైన హైందవధర్మానికి, చాతుర్వర్ణ వ్యవస్థకు, దాని సమగ్రాచరణకు, క్రమానికి ఇది ప్రాథమిక సూత్రం.

ఆస్తిక జనుల నిత్యార్చనా విధానాలలో షోడశోపచార పూజ విధానం ముఖ్యమైనది. అందులో అనేక సంప్రదాయా లున్నాయి. అయినా సర్వ దేవతలకూ సమానంగా పురుషసూక్త విధానాన్ని అనుసరించడం దేశవ్యాప్తంగా ఆచరణలో ఉన్నది.

ఎక్కిరాల కృష్ణమాచార్య గారు తిరుమల తిరుపతి దేవస్థానములు పక్షాన టీకా తాత్పర్యాలతో అనువదించారు.

పూర్తి పాఠం[మార్చు]

వికీసోర్సులో s:పురుష సూక్తము యొక్క పూర్తిపాఠం చూడండి.

బయటి లింకులు[మార్చు]