Jump to content

పులిన్ బిహారీ బాస్కే

వికీపీడియా నుండి
పులిన్ బిహారీ బాస్కే

పదవీ కాలం
2009 - 2014
ముందు రూప్‌చంద్ ముర్ము
తరువాత ఉమా సరెన్
నియోజకవర్గం ఝర్‌గ్రామ్[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-25) 1968 ఏప్రిల్ 25 (వయసు: 58)
దంతన్, జార్గ్రామ్, పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
తల్లిదండ్రులు కనైలాల్ బాస్కే, దులి బాస్కే
జీవిత భాగస్వామి రినా బాస్కే
నివాసం బర్ధమాన్ , న్యూఢిల్లీ[1]
పూర్వ విద్యార్థి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కోల్‌కతా
వృత్తి రాజకీయ నాయకుడు

డాక్టర్ పులిన్ బిహారీ బాస్కే భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పులిన్ బిహారీ బాస్కే భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998 నుండి 2002 వరకు మేదినీపూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, 2002 నుండి 2008 వరకు పశ్చిమ మేదినీపూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేసి 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అమృత్ హన్స్డాపై 2,92,345 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

పులిన్ బిహారీ బాస్కే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝర్‌గ్రామ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఏఐటిసి అభ్యర్థి ఉమా సరెన్ చేతిలో 3,47,883 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Member Profile". Lok Sabha website. Retrieved January 6, 2014.
  2. ↑ "Pulin Bihari Baske" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.
  3. ↑ "Lok Sabha 2019 constituency: Trinamool holds Jhargram, once a Left bastion". Hindustan Times. 26 March 2019. Archived from the original on 22 July 2025. Retrieved 22 July 2025.