పులివెందుల పురపాలక సంఘం
పులివెందుల | |
![]() పులివెందుల పురపాలక సంఘం | |
స్థాపన | 2005 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
పులివెందుల పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోకసభ నియోజకవర్గం లోని,పులివెందుల శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర[మార్చు]
పులివెందుల పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప లోని మునిసిపాలిటీ.పులివెందుల పేరు పులిమందల అన్న పదం నుంచి వచ్చిందని చెప్తారు. పూర్వం ఈ ప్రాంతంలో పులుల మందలు ఎక్కువగా ఉండేవనీ, కాబట్టి పులిమందల అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్పే వ్యుత్పత్తి. అదే కాలక్రమేణా పులివెందుల అయిందంటారు.[1] 2005 లో మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 87.17.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.26 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు[మార్చు]
2001 లో 57444 ఉన్న పట్టణ జనాభా 2011 లో 65706 కు పెరిగింది.2011 భారత జనాభా లెక్కల ప్రకారం 65,706 జనాభా ఉండగా అందులో పురుషులు 32,758 ,మహిళలు 32,948 మంది ఉన్నారు. అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 72.81% ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 81.72% కాగా, స్త్రీ జనాభాలో 64.02% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7267 ఉన్నారు.[2]
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]
2014 ఎన్నికలలో చైర్‌పర్సన్‌గా ప్రమీల,వైస్ చైర్మన్‌గా జి. చిన్నప్ప ఎన్నికయ్యారు.[3]
మూలాలు[మార్చు]
- ↑ జనమంచి, శేషాద్రిశర్మ (1927). కడప మండల చరిత్రము (PDF). మద్రాసు. pp. 62, 63. Archived from the original (PDF) on 2016-04-05. Retrieved 2 July 2018.
- ↑ "Pulivendla Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-10.
- ↑ "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 2019-09-06. Retrieved 13 May 2016.