Jump to content

పులుసు

వికీపీడియా నుండి
పప్పు పులుసు
పెసరపప్పు పులుసు

పుల్లని రుచి గల చింతపండు, పులుసు నిమ్మ వంటి వాటితో తయారైన ద్రవ రూప కూరలను పులుసు అంటారు. కొన్ని రకాల పులుసులను తియ్యగా కూడా చేసుకుంటారు.

రకాలు

పచ్చిపులుసు

పచ్చి మిరపకాయలు మరియు చింతపండు ఉపయోగించి తయారు చేసిన పులుసును పచ్చిపులుసు అంటారు.

తోటకూర పులుసు

తోటకూర మరియు చింతపండు ఉపయోగించి తయారుచేసిన పులుసును తోటకూర పులుసు అంటారు.

పులిహోర పులుసు

పులిహోర తయారు చేయడానికి తయారు చేసుకున్న చింతపండు పులుసును పులిహోర పులుసు అంటారు.

చేపల పులుసు

మాంసాహారంగా చేపలనుపయోగించి చేసుకుంటే రుచికరమైన చేపల పులుసు అవుతుంది.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పులుసు&oldid=2320703" నుండి వెలికితీశారు