పుల్లెల ఫణికుమార్
పుల్లెల ఫణికుమార్ వైద్యశాస్త్రవేత్త. ఆయన ‘బయోటెక్ ప్రొడక్ట్, ప్రొసెస్ డెవల్‌పమెంట్ అండ్ కమర్షియలైజేషన్ అవార్డు-2017’ కు ఎంపికయ్యారు.[1] [2]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన రాజమండ్రి ల్ళోని ప్రభుత్వ కళాశాలలో బ్యాచిలర్స్ డిగ్రీని, 1999లో హైదరాబాదులోని హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తి చేసారు. ఆయన యు.ఎస్.ఎ లోని మిల్వాకీ నందలి మార్క్వెట్టె విశ్వవిద్యాలయంలో డా. డేనియల్ ఎస్.సెమ్ పర్యవేక్షణలో డాక్టరేట్ చేసారు. తరువాత ఆయన భారతదేశానికి వచ్చి బయోమెడికల్ పరిశ్రమలో 7 సంవత్సరాలపాటు పనిచేసారు. తరువాత బెంగళూరు లోని సి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన "సైన్స్ ఫర్ సొసైటీ" అనే ఆశయంలో పరిశోధనలు చేస్తున్నారు.[3] ఆయన అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు.[4]
ఆవిష్కరణలు
[మార్చు]వైర్‌సలు, ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే వ్యాధులను సులభంగా, అతి తక్కువ ఖర్చుతో గుర్తించగలిగే సాంకేతికతకు అయన రూపమిచ్చారు. బయోటెక్నాలజీలో ఆయన చేసిన వినూత్న ఆవిష్కరణకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. మ్యాట్రిక్స్ బేస్డ్ న్యూక్లియిక్ యాసిడ్ ఎక్స్‌ట్రాక్షన్ టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు గాను ‘బయోటెక్ ప్రొడక్ట్, ప్రొసెస్ డెవల్‌పమెంట్ అండ్ కమర్షియలైజేషన్ అవార్డు-2017’కు డాక్టర్ ఫణికుమార్ ఎంపికయ్యారు. 19వ జాతీయ టెక్నాలజీ డే సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 డెంగీ, గున్యాకు సులభ పరీక్ష[permanent dead link]
- ↑ National Awards for Excellence in technology presented[permanent dead link]
- ↑ "Citation of Dr. Phani Kumar Pullela" (PDF). Archived from the original (PDF) on 2017-07-11. Retrieved 2017-05-15.
- ↑ "Prof. Phani Kumar Pullela". Archived from the original on 2020-10-09. Retrieved 2017-05-15.