పుల్లేటికుర్రు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?పుల్లేటికుర్రు
ఆంధ్రప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°38′13″N 81°56′51″E / 16.637076°N 81.947434°E / 16.637076; 81.947434
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) తూర్పుగోదావరి జిల్లా
కోడులు
పిన్‌కోడు
వాహనం

• 533239
• AP 06


పుల్లేటికుర్రు
—  రెవిన్యూ గ్రామం  —
పుల్లేటికుర్రు is located in ఆంధ్ర ప్రదేశ్
పుల్లేటికుర్రు
అక్షాంశరేఖాంశాలు: 16°38′13″N 81°56′51″E / 16.637076°N 81.947434°E / 16.637076; 81.947434
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అంబాజీపేట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,208
 - పురుషుల సంఖ్య 4,672
 - స్త్రీల సంఖ్య 4,536
 - గృహాల సంఖ్య 2,447
పిన్ కోడ్ 533 239
ఎస్.టి.డి కోడ్

పుల్లేటికుర్రు, తూర్పు గోదావరి జిల్లా, అంబాజీపేట మండలానికి చెందిన గ్రామము.[1].. పుల్లేటికుర్రు ఊరి పేరు పులి వేట కుర్రు అనే పేరు నుండి వచ్చినది

పేరువెనుక చరిత్ర[మార్చు]

పుల్లేటికుర్రు తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలానికి చెందిన ఓ అందమైన గ్రామం.పుల్లేటికుర్రు గ్రామానికి ఆ పేరు రావడానికి ఒక చరిత్ర ఉంది.పూర్వం అభయారణ్య ప్రాతం అయిన ఈ ప్రాతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యం పరమశివుని అత్యంత భక్తి శ్రధ్దలతో పూజిస్తుండేవాడు.ఒకరోజున ఆ బ్రాహ్మణున్ని అరణ్యంలో ఒక పులి (వ్యాఘ్రం) తరమసాగింది.దీంతో భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచని స్థితిలో తను రోజూ అర్చించే ఆ పరమశివున్ని నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడే ఉన్న ఒక బిల్వ వృక్షం (మారేడు చెట్టు) ఎక్కెను.పులి మారేడు చెట్టు క్రింద ఆ బ్రాహ్మణుని కొరకు కాచుకుని కుర్చుంది. దీంతో ఏమి చెయ్యాలో తోచక ఆ మారేడు చెట్టు యొక్క ఆకులు ఒక్కటొక్కటీ తెంపి పరమశివుని స్మరిస్తూ ఆ పులిపై వేయసాగాడు. కొంతసేపటికి ఆ మారేడు ఆకులతో ఆ పులి కప్పబడి కదలకుండా అలానే ఉంది.దీంతో ఆ పులి నిద్రిస్తుందేమో అని ఆ బ్రాహ్మణుడు భావించి మెల్లిగా చెట్టు నుండి క్రిందికి దిగి అగ్రహారం లోకి వెళ్ళి తన తోటి వారికి ఈ విషయం చెప్పి పులిని చంపడానికి కర్రలు, బరిసెలతో అక్కడికి వచ్చాడు. .అయితే ఎంతకీ పులి ఆ మారేడు ఆకులనుండి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అక్కడి వారు ఆ అకులను తొలగించి చూడగా ఆ అకుల క్రింద శివలింగం కనిపించెను. పులి శివలింగముగా మారిన ప్రాంతాన్ని వ్యాఘ్రేశ్వరము అని అక్కడ స్వయంభూగా వెలసిన ఆ శివుని వ్యాఘ్రేశ్వరుడు అనే పేరు వచ్చింది. పులి వేటాడిన ఊరు కనుక ఆ ఊరుకు పులి వేట వూరు అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే పుల్లేటికుర్రుగా రూపాతరం చెందింది. పుల్లేటికుర్రు గ్రామానికి మండల కేంద్రం అయిన అంబాజీపేట 5.3కిమీ, అలాగే అమలాపురం 10 కిమీ దూరాన ఉన్నాయి.ఈ ఊరి మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి సమయంలో ఇక్కడ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి.ఇక్కడ కొబ్బరి, వరి పంటలను ఎక్కువగా సాగుచేస్తారు.

గ్రామ విశేషాలు[మార్చు]

  • ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ జరిగే ప్రభల తీర్థం చాలా ప్రఖ్యాతి చెందినది.
  • ప్రతి శనివారం ఇక్కడ సంత జరుగుతుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 9,208 - పురుషుల సంఖ్య 4,672 - స్త్రీల సంఖ్య 4,536 - గృహాల సంఖ్య 2,447

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,615.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,937, మహిళల సంఖ్య 4,678, గ్రామంలో నివాస గృహాలు 2,375 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14