Jump to content

పుష్పేంద్ర సింగ్ చందేల్

వికీపీడియా నుండి
పుష్పేంద్ర సింగ్ చందేల్

పదవీ కాలం
2014 మే 16  2024 జూన్ 4
ముందు విజయ్ బహదూర్ సింగ్
తరువాత అజేంద్ర సింగ్ లోధి
నియోజకవర్గం హమీర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1973-10-08) 1973 అక్టోబరు 8 (వయసు: 52)
మహోబా, ఉత్తర ప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కున్వర్ హర్పాల్ సింగ్ చందేల్, షీల్ సింగ్ చందేల్
జీవిత భాగస్వామి
దీపాలి సింగ్
(m. 1999)
సంతానం 2
నివాసం మహోబా, ఉత్తర ప్రదేశ్
పూర్వ విద్యార్థి బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం (ఎంఏ, ఎల్‌ఎల్‌బీ)
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం

కున్వర్ పుష్పేంద్ర సింగ్ చందేల్ (జననం 8 అక్టోబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పుష్పేంద్ర సింగ్ చందేల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బిశంభర్ ప్రసాద్ నిషాద్‭పై 2,66,788 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 16వ లోక్‌సభలో రైల్వేలపై స్టాండింగ్ కమిటీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ, లాభాల కార్యాలయాలపై జాయింట్ కమిటీ, ఆర్థిక స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి దిలీప్ కుమార్ సింగ్‌పై 2,48,652 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[2] 17వ లోక్‌సభలో విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ, నియమాల కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

పుష్పేంద్ర సింగ్ చందేల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హమీర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజేంద్ర సింగ్ లోధి చేతిలో 2,629 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Kunwar Pushpendra Singh Chandel: Looking For A Hat-Trick Win In Hamirpur" (in ఇంగ్లీష్). TimelineDaily. 11 March 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. "Hamirpur Election Results 2024: SP's Ajendra singh Lodhi wins with over 4.9 lakh votes". The Times of India. 5 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  4. "2024 Loksabha Elections Results - Hamirpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.
  5. "Hamirpur Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 1 June 2025. Retrieved 1 June 2025.