పూంచ్ జిల్లా
పూంచ్ జిల్లా | |
---|---|
జిల్లా, జమ్మూ కాశ్మీరు | |
Coordinates: 33°46′N 74°06′E / 33.77°N 74.1°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
విభాగం | జమ్మూ |
ప్రధాన కార్యాలయం | పూంచ్ |
తహసీల్సు[1] | 1. బాలకోటే, 2. హవేలీ , 3. మండి , 4. మంకోట్, 5. మెన్ధర్, 6. సూరన్‌కోట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,674 కి.మీ2 (646 చ. మై) |
జనాభా (2011)జిల్లా | |
• మొత్తం | 4,76,835 |
• జనసాంద్రత | 280/కి.మీ2 (740/చ. మై.) |
• Urban | 8.1% |
జనాభా | |
• అక్షరాస్యత | 66.74% |
• లింగ నిష్పత్తి | 893 |
Time zone | UTC+05:30 |
Vehicle registration | JK-12 |
Website | http://poonch.nic.in/ |
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో పూంచ్ జిల్లా లేక పుంచ్ (ఉర్దు -ضلع پونچھ, హింది -पुंछ) ఒకటి. జిల్లా ఉత్తర, పశ్చిమ, దక్షిణ సరిహద్దులో భారత పాకిస్థాన్ సరిహద్దు, పాక్ ఆధీనంనంలో ఉన్న కాశ్మీర్ ఉంది. 1947 -1948 వార్ యుద్ధం ఈ భూభాగాన్ని రెండుగా చేసింది. ఒకటి పాకిస్థాన్ వశమైంది రెండవ భాగం భారత్‌లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో ఉంది.
పాలనా విభాగాలు
[మార్చు]పూంచ్ జిల్లా జిల్లా 4 తెహ్సిల్స్‌గా విభజించబడింది. పూంచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
- హవేలి తెహ్సిల్
- మండి తెహ్సిల్
- మెంధర్ తెహ్సిల్
- సురన్‌కోటే తెహ్సిల్
ఒక్కో తెహ్సిల్‌కు ఒక్కోక తెహసిల్దార్ ఉంటారు. జిల్లా అదనంగా జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది : పూంచ్, మండి, మెంధర్, బాలాకోట్, సురన్‌కోట్, బఫ్లియాజ్ .[2] ఒక్కొక్క బ్లాకుకు ఒక బ్లాక్ డెవెలెప్మెంట్ ఆఫీసర్ నియమించబడ్డాడు. ఒక్కొక్క బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]1936లో జామ్మూ రాజు డోగ్రా మహారాజా పాలనలో పూంచ్ జిల్లాలోని దిగువ భూమిలోని భాగ్ ( కాశ్మీర్), రావలకోట్ ప్రాంతాలలో ఉన్న ముస్లిములు అసంతోషానికి గురైయ్యారు. భారత్, పాక్ విభజన సమయంలో ముస్లిములు వధించబడడంతో ఈ ప్రాంతంలో జమ్మూకు వ్యతిరేకత తలెత్తింది. ఫలితంగా 1947-48 భారత్ పాక్ యుద్ధంలో ఈ ప్రాంతంలో అధికభాగం పాక్ పాలిత కాశ్మీరులో చేరింది. యుద్ధంలో పూంచ్ నగరం మీద పాకిస్థాన్‌కు చెందిన గిరిజనులు, పాకిస్థాన్ చెందిన సైన్యం దాడిచేసారు. ఒక సంవత్సరం పాకిస్థాన్ వశంలో ఉన్న తరువాత 1948 నవంబరులో పూంచ్ నగరం తిరిగి భారత్ పాలనలో ఉన్న కాశ్మీర్‌లో భాగం అయింది.
ఆర్ధికం
[మార్చు]2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో పూంచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జమ్మూ కాశ్మీరు రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
రాజకీయాలు
[మార్చు]పూంచ్ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి : సురన్‌కోట్, మెంధర్, పూంచ్ హావెలి. హావెలి ప్రస్తుత ఎం.ఎల్.ఎ. ఆఫ్ హవేలి అజిజాజ్ జన్ ఆఫ్ నేషనల్ కాంఫరెంస్, సురంకోట్- మొహద్. అస్లాం ఆఫ్ ఐ.ఎ.సి., మెంధర్- రఫిక్ ఖాన్ ఆఫ్ పి.డి.పి.[4]
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 476,820, [5] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 548వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 285 [5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.97%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 890 : 1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.69%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | |
ముస్లిములు | 87% .[7] |
జిల్లాలో నివసిస్తున్న ప్రజలలో గుజ్జర్లు, బేకర్వాల్స్, పహరీలు, పంజాబీలు, కాశ్మీరిలు, రాజపుత్రులు ఉన్నారు. గుజ్జర్లు ఏటావాలు ప్రాంతాలలో నివసిస్తుంటారు. వారికి వ్యవసాయానికి స్వల్పంగా భూమి, కొన్ని పశువులు ఉంటాయి. నోమడీక్ జాతి ప్రజలను బకర్వాలాలు అంటారు. గుజ్జర్లు, బకర్వాలాలు గోజ్రి భాషను మాట్లాడుతుంటారు. మిగిలిన ప్రజలు పహరి, పూంచ్ భాధను మాట్లాడుతుంటారు. పహరీ భాష ప్రజలమద్య అనుబంధం పెంచుతూ ఉంది. పహరీ మాట్లాడే ప్రజలు కులమత భేధం లేకుండా ఒకరితో ఒకరు కలిసి ఉంటారు.[8]
శాంతి
[మార్చు]భారత పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడిన తరువాత వివడిన ప్రజలు ఇప్పుడు ఒకరితో ఒకరు తిరిగి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. పూచ్-రావలకాట్ బస్ ఏర్పాటు ఈ దశకు మొదటిమెట్టు.
ప్రయాణసౌకర్యాలు
[మార్చు]జిల్లాలో " పూంచ్ ఎయిర్‌పోర్ట్ (చిన్నది) " ఉంది. అదనంగా రైల్వే - పూంచ్ రైల్వే స్టేషను నిర్మాణంలో ఉంది. భారత్ పాక్ సరిహద్దులను కలుపుతూ " పూంచ్-రవలకాట్ బసు నడుపబడుతూ ఉంది.
చిత్రమాలిక
[మార్చు]సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ https://poonch.nic.in/tehsil/
- ↑ Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Suriname 491,989 July 2011 est.
- ↑ Sumantra Bose, Geography, Politics and the Fighters of Kashmir Archived 2011-12-16 at the Wayback Machine London School of Economics
- ↑ "About Poonch - Official site of District Poonch of J&K". Archived from the original on 2007-08-16. Retrieved 2014-06-30.
వెలుపలి లింకులు
[మార్చు]- Official website of District Poonch - Administered by India.
- The entire list of rulers starting from Raja Moti Singh