పూజా బేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజా బేడీ
2019లో పూజా బేడీ
జననం (1970-05-11) 1970 మే 11 (వయసు 53)[1]
వృత్తినటి, టెలివిజన్ వ్యాఖ్యాత, రిలేషన్ షిప్ కాలమిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1991–2020
జీవిత భాగస్వామి
ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్ వాలా
(m. 1994; div. 2003)
పిల్లలు2, అలయ ఎఫ్ తో సహా
తల్లిదండ్రులు

పూజా బేడి (జననం 1970 మే 11) ఒక భారతీయ నటి, టెలివిజన్ టాక్ షో హోస్ట్. ఆమె వార్తాపత్రికల కాలమిస్ట్ కూడా. ఆమె రియాలిటీ టెలివిజన్ షోలు ఝలక్ దిఖ్లా జా, నాచ్ బలియే, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్‌లలతో ప్రజాదరణ పొందింది.

బాల్యం[మార్చు]

భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ప్రొతిమా బేడీ, చలనచిత్ర నటుడు కబీర్ బేడీలకు బొంబాయిలో పూజా బేడీ జన్మించింది.[2] ఆమె బోహేమియన్ ప్రగతిశీల కళాత్మక వాతావరణం అని పిలిచే దానిలో పెరిగింది.

కెరీర్[మార్చు]

బాలీవుడ్ చిత్రాలలో 1991 నుండి 1995 వరకు పూజా బేడి నటించింది. ఆమె అనేక వాణిజ్య ప్రకటనలు, ప్రచారాలలో కూడా కనిపించింది. ముఖ్యంగా కామసూత్ర కండోమ్ ప్రచారంతో ఆమె అందరికి గుర్తుండిపోయింది. ఈ ప్రకటనను ఆమోదించిన ఆమె ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి కృషి చేసినట్టయింది.[3] ఆమె జగ్ ముంధ్రా చిత్రం విషకన్య (1991)తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె జో జీతా వోహీ సికిందర్ (1992)లో అమీర్ ఖాన్‌తో కలిసి నటించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్థాన్ టైమ్స్, మిడ్ డే వార్తాపత్రికలతో ఆమె కాలమిస్ట్‌గా చేసింది. అలాగే ఎల్'ఆఫీషియల్, ఫెమినా, ది వీక్‌తో సహా అనేక పత్రికలతో వ్యాసాలు రాసింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

పూజా బేడీ 1990లో పరిచయం అయిన పార్సీ, ఖోజా సంతతికి చెందిన గుజరాతీ ముస్లిం అయిన ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకుంది. వీరి వివాహం 1994 మే 6న జరిగింది. ఆ తర్వాత ఆమె ఇస్లాం మతంలోకి మారి నూర్జహాన్ అని పేరు మార్చుకుంది.[5][6][7] వారికి ఇద్దరు సంతానం కుమార్తె అలయా ఫర్నిచర్‌వాలా, కుమారుడు ఒమర్ ఫర్నిచర్‌వాలా. 2003లో పూజా బేడి, ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాలు విడాకులు తీసుకున్నారు.[8] 2019 ఫిబ్రవరిలో తిరిగి ఆమెకు మానెక్ కాంట్రాక్టర్ అనే పార్సీతో నిశ్చితార్థం జరిగింది.[9]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

Year Title Role Director
1991 విషకన్య ప్రధాన పాత్ర జగ్ ముంద్రా
1992 జో జీత వోహి సికందర్ సపోర్టింగ్ రోల్ మన్సూర్ ఖాన్
1993 లూటరే ధర్మేష్ దర్శన్
చిట్టెమ్మ మొగుడు మోహన్ బాబుతో కలిసి నటించింది
ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ మహేష్ భట్
1995 ఆటంక్ హాయ్ ఆటంక్ అతిథి దిలీప్ శంకర్
2011 శక్తి ఫక్తూని మెహర్ రమేష్
2020 కామెడీ కపుల్ జోహ్రా నచికేత్ సమంత్

టెలివిజన్[మార్చు]

Year Show Role
2006 ఝలక్ దిఖ్లా జా 1 పోటీదారు
2007 నాచ్ బలియే 3
2008 బిగ్ బాస్ 2 హోస్ట్
ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 పోటీదారు
2011 మా ఎక్స్ఛేంజ్
బిగ్ బాస్ 5
2020 మసాబ మసాబ గీతా చోప్రా

మూలాలు[మార్చు]

  1. Sawhney, Anubha (1 June 2003). "Pooja Bedi: The siege within". The Times of India. Retrieved 20 September 2011.
  2. "Pooja Bedi: I have really liked all my father's girlfriends, and wives, including Parveen Babi - Times of India". The Times of India.
  3. Misra, Shubhangi (16 February 2020). "The KamaSutra ad that changed the role of condoms in India from functional to pleasurable".
  4. "Actress and columnist Pooja Bedi's barefoot moment!". Zee News (in ఇంగ్లీష్). 28 September 2011. Retrieved 9 March 2021.[permanent dead link]
  5. "Pooja Bedi: The siege within | undefined News - Times of India". The Times of India.
  6. "Fell in Love with 5 Different Men, Yet Pooja Bedi is Single and Rocking at the Age of 47". 19 February 2018.
  7. "Pooja Bedi REVEALS quitting acting for ex-husband Farhan Furniturewalla's family". 4 June 2021.
  8. Ramasubramanian, Uma (24 February 2019). "My kids wanted me to settle down for many years now, says Pooja Bedi". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 16 May 2021.
  9. "Pooja Bedi engaged to boyfriend Maneck Contractor: He proposed to me in a hot air balloon". India Today (in ఇంగ్లీష్). Retrieved 9 January 2022.{{cite news}}: CS1 maint: url-status (link)
"https://te.wikipedia.org/w/index.php?title=పూజా_బేడి&oldid=3849426" నుండి వెలికితీశారు