పూర్ణం బూరెలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పూర్ణం బూరెలు లేదా కుడుం బూరెలు ఒక ప్రత్యేకమైన బూరెలు.

కావలసిన పదార్ధాలు[మార్చు]

తయారుచేయు విధానం[మార్చు]

  • బూరెలు వండడనికి మూడు గంటలు ముందుగా చోవి (బూరె పైన తొక్క కోసం) తయారుచేసుకోవాలి. దీనికోసం మినప పప్పు నానబెట్టి; గంటతర్వాత మెత్తని కాటుకలా రుబ్బి, ఆ రుబ్బినపిండిలో బియ్యపు పిండి పోసి కలిపి, చిటికెడు ఉప్పు వేసి గిన్నె మీద మూతపెట్టి ఉండనివ్వాలి. ఈ పిండిని కనీసం మూడు గంటలన్నా నానబెట్టాలి.
  • శనగ పప్పు తక్కువ నీరుపోసి బాగా ఉడకనివ్వాలి. పప్పు చేతితో పట్టుకొని నొక్కి సూస్తే చితికిపోవాలి. తర్వాత పప్పులో నీరుగనక ఉంటే వంచేసి తరిగిన బెల్లం లేక చక్కెర పోసి ఉడకనివ్వాలి. ఈ మాదిరిగా పాకం పెట్టడం వల్ల బూరెలు రెండురోజులున్నా చెడిపోవు.
  • ఏలకులు వొలిచి గింజలు పొడుంలాగా దంచుకోవాలి. కొబ్బరి సన్నంగా ముక్కలు తరిగి నేతిలో చేయించుకోవాలి.
  • పాకం గిన్నెలోని పప్పుని గరిటెతో బాగా కుమ్మి, అందులో ఏలకులపొడి, కొబ్బరిముక్కలు వేసి, నేతితో బాగా కలిసేటట్లు పిసికి, తరువాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.
  • పొయ్యిమీద బూరెల మూకుడు పెట్టి, నూనె మరిగాక, ఒక్కొక్క పూర్ణపు ఉండ సిద్ధంగా ఉంచుకున్న చోవిలో ముంచి, నూనెలోవేసి, ఎర్రగా వేగాక తీసి విడిగా పెట్టుకోవాలి. బూరెచోవి మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు.

చిట్కాలు[మార్చు]

  • బూరె చోవిలో బియ్యం పిండి ఎక్కువ కలిపితే, వేగాక బూరెలు పైన కరకరలాడుతూ ఉంటాయి. మినప పిండి ఎక్కువ కలిపితే చల్లారిన తర్వాత మెత్తబడి సాగుతాయి.