పూర్నియా విమానాశ్రయం
పూర్నియా విమానాశ్రయం చూనాపూర్ హవాయి అడ్డ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్నియా విమానాశ్రయం | |||||||||||
| సంగ్రహం | |||||||||||
| విమానాశ్రయ రకం | మిలిటరి/పౌర | ||||||||||
| యజమాని | భారతీయ వాయు సేన | ||||||||||
| కార్యనిర్వాహకత్వం | ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా | ||||||||||
| సేవలు | పూర్నియా, కతిహార్ | ||||||||||
| ప్రదేశం | గోవాసి (చూనాపూర్ ), పూర్నియా, బీహార్ , భారత్ | ||||||||||
| ప్రారంభం | 15 సెప్టెంబర్ 2025 | ||||||||||
| ఎత్తు AMSL | 39 m / 129 ft | ||||||||||
| అక్షాంశరేఖాంశాలు | 25°45′35″N 087°24′36″E / 25.75972°N 87.41000°E | ||||||||||
| పటం | |||||||||||
| రన్వే | |||||||||||
| |||||||||||
పూర్నియా విమానాశ్రయం బీహార్ రాష్ట్రంలోని పూర్నియా నగరానికి సేవలందించే దేశీయ విమానాశ్రయం, భారత వైమానిక దళ స్థావరం. ఇది పూర్నియా నగరానికి పశ్చిమ అంచున గోయాసి (చునాపూర్) ప్రాంతంలో ఉంది. విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ నిర్వహిస్తుంది. ఇది సీమాంచల్ ఉపప్రాంతానికి ప్రధాన వైమానిక అనుసంధాన కేంద్రంగా ఉంది..
చరిత్ర.
[మార్చు]1962 చైనా-భారత యుద్ధం అనంతరం 1963లో ఈ ఎయిర్ఫీల్డ్ నిర్మించబడింది. సిలిగురి కారిడార్ ప్రాంతంలో సైనిక సరఫరాలు, ఈశాన్య భారతదేశ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా భారత వైమానిక దళం దీన్ని ప్రారంభించింది.[1] ప్రారంభంలో దీనిని చునాపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్గా పిలిచేవారు.[2]
1974 వరకు ఈ స్థావరాన్ని భారత వైమానిక దళంలోని 5 కేర్ అండ్ మెయింటెనెన్స్ యూనిట్ నిర్వహించింది. 1971 భారత–పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఇది ద్వితీయ డైవర్షన్ ఎయిర్ఫీల్డ్గా ఉపయోగించబడింది. 1 జనవరి 1981న 14 ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేయబడింది.
1980లలో ఇక్కడ హెచ్ ఏ ల్ తయారు చేసిన ఫోలాండ్ గ్నాట్/హెచ్ఏఎల్ అజీత్ యుద్ధవిమానాలు, హాకర్ హంటర్, మిగ్-21ఎఫ్ఎల్ టైప్-77 విమానాలు కార్యకలాపాలు నిర్వహించాయి. 1987లో రాత్రి సమయ విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కలైకుండ వైమానిక స్థావరంలో ఉన్న కొన్ని మిగ్-27 విమానాలు 2003 నుండి 2005 వరకు ఈ స్థావరం నుండి తాత్కాలికంగా నడపబడ్డాయి.[3]
ఈ స్థావరం దశాబ్దాల పాటు భారత వైమానిక దళ నియంత్రణలో కొనసాగింది.[4][5] ప్రయాణికుల సేవలు 2025 సెప్టెంబర్లో ప్రారంభించబడ్డాయి. 1956–58 కాలంలో బాలుర్ఘాట్ ఎయిర్వేస్, 1976–78 కాలంలో జామ్ ఎయిర్వేస్ పూర్నియా–కొల్కతా మార్గంలో సేవలు నిర్వహించాయి. తగిన మౌలిక సదుపాయాల లేని కారణంగా ఆ సేవలు నిలిపివేయబడ్డాయి.[6]
పౌర ప్రాంగణం
[మార్చు]విమానాశ్రయంలోని ఒక చిన్న ప్రాంతాన్నిపౌర ప్రాంగణం( సివిల్ ఎన్క్లేవ్) గా మార్చడం గురించి ప్రారంభ చర్చలు 2000ల ప్రారంభంలో మోదలయ్యాయి . బీహార్ కోసి-సీమాంచల్ ఉపప్రాంతంలో మెరుగైన విమాన కనెక్టివిటీ అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ఇది జరిగింది. 2012లో స్వల్ప కాలం పాటు వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి, కానీ సరిపోని మౌలిక సదుపాయాలు, తక్కువ డిమాండ్ కారణంగా అవి స్వల్పకాలం మాత్రమే కొనసాగాయి.[7] పౌర ప్రాంగణం నిర్మాణాన్ని ప్రారంభించడానికి ప్రస్తుత వైమానిక దళ స్థావరం పక్కన ఉన్న 52.50 ఎకరాల భూమిని సేకరించడం జూన్ 2022లో బీహార్ ప్రభుత్వం పూర్తి చేసింది.[8] విఐపి లాంజ్, కార్గో సౌకర్యాలు, ఇతర సహాయక మౌలిక సదుపాయాలను కూడా నిర్మించాలని యోచించారు. ఉత్తర బీహార్ లో తక్కువ విమాన సేవలున్న ప్రాంతాలలో విమాన సేవలను పెంచడానికి భారత ప్రభుత్వ ఉడాన్ ప్రాంతీయ అనుసంధాన పథకంలో భాగంగా పూర్ణియా విమానాశ్రయాన్ని ఎంపిక చేశారు. 2025 ప్రారంభంలో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాత్కాలిక ప్రయాణీకుల టెర్మినల్ నిర్మాణానికి ఒక ఒప్పందాన్ని ఆమోదించింది.[9] ఈ కాంట్రాక్టు విలువ ₹ 33.99 కోట్లు (US $4 మిలియన్లు), నిర్మాణం మూడు నుండి నాలుగు నెలల్లో పూర్తవుతుంది.[10] భూసేకరణ నష్టపరిహారం ఆలస్యం అవుతుందనే ఆరోపణలపై చిన్న నిరసనలు జరిగాయి, అయితే స్థానిక అధికారులు చెల్లింపులు ప్రాసెస్ చేయబడి సంబంధిత భూ యజమానులకు పంపినట్లు పేర్కొన్నారు.[11] ఈ టెర్మినల్, విమానాశ్రయం 2025 చివరి నాటికి పనిచేయాలని భావించారు, ఆ తరువాత షెడ్యూల్ చేసిన విమానాలు ప్రారంభమవుతాయి.[12] ఈ విమానాశ్రయాన్ని సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కు అంకితం చేశారు .[13] ఉత్తర బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్ లోని సమీప ప్రాంతాల నివాసితులకు విమాన కనెక్టివిటీని పెంచడానికి పూర్ణియాను పాట్నా, ఢిల్లీ, ముంబై , కోలకత్తా తో అనుసంధానించడానికి ప్రారంభ మార్గాలు ప్రతిపాదించబడ్డాయి.
సెప్టెంబర్ 15 నుండి పూర్ణియా నుండి కోల్కతా , అహ్మదాబాద్ ఇండిగో, స్టార్ ఎయిర్ ప్రత్యక్ష విమానాలను ప్రారంభించాయి.[14] ఇండిగో కూడా అక్టోబర్ 26 నుండి ఢిల్లీకి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించింది.
భవిష్యత్తు లో అభివృద్ధి
ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత టెర్మినల్ భవనం నిర్మాణం అవసరంగా మారింది. ప్రస్తుత తాత్కాలిక సదుపాయాలు విస్తరిస్తున్న కార్యకలాపాలకు సరిపోవడం లేదు. ప్రయాణికులు ఎయిర్ ఇండియా , ఆకాశ ఎయిర్ , ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి సంస్థల సేవలు, ముంబై, బెంగళూరు, పాట్నా, ఢిల్లీ వంటి ప్రధాన కేంద్రాలకు కొత్త మార్గాలు కోరుతున్నారు.
శాశ్వత టెర్మినల్ నిర్మాణం, మార్గాల విస్తరణ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. విమానాశ్రయం దీర్ఘకాలికంగా సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది.
విమానయాన సంస్థలు, వాటి గమ్యస్థానాలు
[మార్చు]ప్రయాణికులు
[మార్చు]| Airlines | Destinations |
|---|---|
| IndiGo | Delhi, Hyderabad, Kolkata[15] |
| Star Air | Ahmedabad, Kolkata[15] |
బాహ్య మూలాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Centre blames Bihar for delay in Purnia airport work". hindustantimes. Retrieved 25 June 2025.
- ↑ "North-south feud holds up Purnia airport construction". hindustantimes. Retrieved 25 June 2025.[permanent dead link]
- ↑ "14 Forward Base Support Unit – Chunapur". Bharat Rakshak. Retrieved 25 June 2025.
- ↑ "Purnea Airport to open Sept 15; IndiGo, Star Air to launch flights to two cities". Hindustan Times (in ఇంగ్లీష్). 2025-09-09. Retrieved 2026-02-14.
- ↑ "Purnia back on air map". The Times of India. 7 November 2012. Retrieved 7 August 2025.
- ↑ "Purnia back on air map". The Times of India. 7 November 2012. Retrieved 7 August 2025.
- ↑ "Answer to Lok Sabha Question No. 4014 on Purnea Airport" (PDF). Ministry of Civil Aviation, Government of India. Retrieved 25 June 2025.[permanent dead link]
- ↑ "Key hurdle cleared for civil airport at Purnia". Hindustan Times. March 10, 2022. Archived from the original on February 8, 2023.
- ↑ "Construction of Interim Terminal Building at Purnea airport". AAI. Retrieved 25 June 2025.
- ↑ "Bihar UDAN Scheme Update: ₹190 Cr Sanctioned for 7 Airports". Bihar Say. 5 April 2025. Retrieved 25 June 2025.[permanent dead link]
- ↑ "Purnea Airport land acquisition sparks protest by villagers". Mangalorean. 13 March 2025. Retrieved 25 June 2025.
- ↑ "State Set to Open Fourth Operational Airport in Purnia". PatnaPress. 15 March 2025. Retrieved 25 June 2025.
- ↑ Reporter, Staff (2025-08-26). "PM Modi , he visited Purnia on September 15, to Inaugurate New Airport". Patna Press (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-08-26.
- ↑ "Purnea Airport to open Sept 15; IndiGo, Star Air to launch flights to two cities". Hindustan Times (in ఇంగ్లీష్). 2025-09-09. Retrieved 2025-09-12.
- 1 2 "Flight booking started from Purnia Airport, Indigo and Star Air have got permission to fly". Business League. Retrieved 4 September 2025.