పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన పనిముట్ల తయారీ సంప్రదాయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానవ జీవన గమనంలో మార్పు దిశగా మొదటి అడుగు రాతి పరికరాల (Stone Tools) తయారీతో మొదలయ్యింది. ఆదిమ మానవులు తయారుచేసి ఉపయోగించిన రాతి పనిముట్లు తమ మనుగడ నిమిత్తం ప్రకృతిని నియంత్రించే తొలి ప్రయత్నాన్ని సూచిస్తాయి.

శిలా పరికరాల తయారీ కాలం[మార్చు]

పూర్వ ప్రాచీన శిలాయుగం మలి ప్లియోసీన్ (Late Pliocene) శకంలో ప్రారంభమై మధ్య ప్లీస్టోసిన్ (Middle Pleistocene) శకంలో ముగిసింది. మలి ప్లియోసీన్ శకంలో చివరిభాగంలో ఆస్ట్రలోపితికన్లు (australopithecines) వంటి ఆదిమ మానవులు తొలి శిలా పరికరాలు లేదా పనిముట్లు (Stone Tools) ను ఉపయోగించడం తెలిసికొని వుండవచ్చు.

పురావస్తు ఆధారాలను బట్టి మానవ జాతి చరిత్రలో ఆదిమ మానవుడు ఉపయోగించిన తొలి శిలా పరికరాలు ఒల్డోవన్ (Oldowan) సంస్కృతికి చెందినవిగా గుర్తించారు. తొలి ప్లీస్టోసిన్ (క్రీ. పూ. 26 లక్షల సంవత్సరాలు నుండి క్రీ.పూ. 18 లక్షల సంవత్సరాల వరకు) కాలానికి చెందిన ఈ పరికరాలను తొలుత ఆఫ్రికా ఖండానికి చెందిన ఆస్ట్రలోపితికన్లు (australopithecines) గా భావిస్తున్న ఆదిమ మానవులు తయారు చేసి ఉపయోగించారు. తరువాత దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, యూరఫ్‌లకు చెందిన ఆస్ట్రలోపితికన్లు, హోమో హ్యాబిలిస్ (Homo habilis), హోమో ఎరెక్టస్ (Homo erectus) వంటి తరగతులకు చెందిన ఆదిమ మానవులు ఉపయోగించారు.

పశ్చిమ యూరఫ్‌లో లభించిన తొలి రాతి పనిముట్లు పూర్వ ప్లీస్టోసిన్ (Lower Pleistocene) శకం లోని మొదటి అంతర హిమ యుగ దశ (First Inter glacial Phase) కాలానికి చెందినవి. పూర్వ ప్రాచీన శిలాయుగ సంస్కృతి (Lower Paleolithic Age) కి చెందిన ఈ శిలా పరికరాలు ఉత్తర ఫ్రాన్స్ లోని సామ్ నదీ లోయ (Somme Valley), దక్షిణ ఇంగ్లాండ్ లోని థేమ్స్ నదీ లోయ (Thames Valley) లకు చెందిన ప్రాంతాలలో దొరికాయి.

సంప్రదాయాలు - వర్గీకరణ[మార్చు]

పశ్చిమ యూరఫ్ లో పూర్వ ప్రాచీన శిలాయుగానికి (Lower Paleolithic Age) చెందిన రాతి పరికరాల తయారీ సంప్రదాయాలను రెండు రకాలుగా వర్గీకరిస్టారు. అవి

  1. చేతి గొడ్డళ్ళ సంప్రదాయం (Hand-Axe Tradition)
  2. పెచ్చు సంప్రదాయం (Flake Tradition)

ప్రాధమికంగా 'చేతి గొడ్డళ్ళ తయారీ సంప్రదాయం', మూల రాయి నుంచి తయారు చేసిన పనిముట్లను కలిగి వుంటే 'పెచ్చు తయారీ సంప్రదాయం' మూల రాతి నుండి తీసిన పెచ్చులను ఉపయోగింఛి తయారు చేసిన పనిముట్లను కలిగి వుంటాయి. అంటే 'చేతి గొడ్డళ్ళ సంప్రదాయం' మూల రాతి పనిముట్లు (core tool) కు సంబందించిన సంప్రదాయం అయితే 'పెచ్చు సంప్రదాయం' పేరుకు తగినట్లే రాతి పెచ్చు పనిముట్లు (Flake tool) కు సంబందించిన సంప్రదాయం అవుతుంది.

చేతి గొడ్డళ్ళ సంప్రదాయం (Hand-Axe Tradition)[మార్చు]

చేతి గొడ్డళ్ళ తయారీ సంప్రదాయంలో ద్విముఖం గల పనిముట్లు తయారు చేయబడ్డాయి. అంటే మూల రాయి (core stone) యొక్క పై భాగం, క్రింద భాగపు ఉపరితలాలపై పని చేసి ఒక మాదిరి వాడి (pointed) గా వున్నా పనిముట్లను తయారు చేస్తారు. చేతి గొడ్డళ్ళ తయారీ సంప్రదాయంలో ఇటువంటి మూల రాతితో చేసిన పనిముట్లు (core tools) ప్రధాన భాగం అయినప్పటికీ వాటితో పాటు పెచ్చులతో చేసిన పనిముట్లు (Flake tools) కూడా అన్ని స్థాయిలలోనూ లభించాయి.

పెచ్చు సంప్రదాయం (Flake Tradition)[మార్చు]

చేతి గొడ్డళ్ళు తయారు చేస్తున్నప్పుడు వెలువడే వ్యర్ధ రాతి పెచ్చులను ఉపయోగించి రాతి పెచ్చు పనిముట్లను (Flake tools) లను తయారు చేస్తారు. కనుక చేతి గొడ్డళ్ళ తయారీ సంప్రదాయంతో పోలిస్తే పెచ్చు తయారీ సంప్రదాయం ఒకింత సరళంగా (Simple) గా వుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఆదిమ మానవులు సంక్లిష్టమైన పెచ్చు పనిముట్లు (Complicated Flake tools) లను సైతం చేసారు. రాతితో చేసిన పనిముట్లు కన్నా, రాళ్ళ పై తీసిన పెచ్చులతో చేసిన పనిముట్లు (Flake tools) మరింత పరిణితి చెందినవి.

సంస్కృతులు[మార్చు]

పూర్వ ప్రాచీన శిలాయుగానికి చెందిన ఈ రెండు రకాలైన పనిముట్ల సంప్రదాయాలు (Tool traditions) (చేతి గొడ్డళ్ళ సంప్రదాయం, పెచ్చు సంప్రదాయం) తిరిగి కొన్ని సంస్కృతులకు దారితీసాయి. అవి

చేతి గొడ్డళ్ళ సంప్రదాయం (Hand-Axe Tradition) ఇది 3 సంస్కృతులుగా వర్గీకరించ వచ్చును. అవి

  1. పూర్వ చెలియన్ సంస్కృతి (Pre- chellian culture)
  2. చెలియన్ లేదా అబివిల్లియన్ సంస్కృతి ( Chellian culture లేదా Abbevillian Culture)
  3. అషులియన్ సంస్కృతి ( (Acheulean culture)

పెచ్చు సంప్రదాయం (Flake Tradition) ఇది 2 సంస్కృతులుగా వర్గీకరించ వచ్చును. అవి

  1. క్లాక్టన్ సంస్కృతి (Clactonian culture)
  2. లెవలోషియన్ సంస్కృతి (Levalloisian culture)

వీటిని కూడా చూడండి[మార్చు]

రిఫరెన్స్‌లు[మార్చు]