పూర్వ రాణా
| అందాల పోటీల విజేత | |
| జననము | 1991 ఫిబ్రవరి 12 ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం[1] |
|---|---|
| వృత్తి | మోడల్ |
| ఎత్తు | 1.75 m (5 ft 9 in) |
| జుత్తు రంగు | గోధుమ రంగు |
| కళ్ళ రంగు | గోధుమ రంగు |
| బిరుదు (లు) | వైస్ క్వీన్ యునైటెడ్ కాంటినెంట్ 2013 |
| భర్త | శ్రేణిక్ పారిఖ్ |
పూర్వ రాణా (జననం 1991 ఫిబ్రవరి 12) ఒక భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2012 మొదటి రన్నరప్ నిలిచింది. ఆ తరువాత ఫెమినా మిస్ ఇండియన్ యునైటెడ్ కాంటినెంట్స్ 2012 కిరీటాన్ని పొందింది.[2] ఆమె మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ 2013 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ 2013 సెప్టెంబరు 14న మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ 2013 వైస్ క్వీన్ గా పట్టాభిషేకం చేయబడింది.[3] ఆమె గతంలో మిస్ టూరిజం ఇంటర్నేషనల్ 2012 పోటీలో కూడా మొదటి రన్నరప్ గా నిలిచింది.
ప్రారంభ జీవితం
[మార్చు]పూర్వ రాణా భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో జన్మించింది. ఆమె హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె హిమాచల్ ప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థిని.
ప్రదర్శనలు
[మార్చు]ఆమె హిమాచల్ ప్రదేశ్ ప్రతినిధిగా, జాతీయ అందాల పోటీ, ఫెమినా మిస్ ఇండియాలో 20 మంది పోటీదారులలో ఒకరిగా, 2012 మార్చి 30న పోటీ చేసింది, అక్కడ ఆమె మిస్ డ్రీమ్ గర్ల్ 2012 అవార్డును పొంది, మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. ఆమె 2010లో మిస్ హిమాచల్ కిరీటాన్ని కూడా గెలుచుకుంది.
2012 డిసెంబరు 19న థాయ్లాండ్ లోని బ్యాంకాక్ లో జరిగిన మిస్ టూరిజం 2012 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ, ఆమె మొదటి రన్నరప్ గా నిలిచింది.
2013 సెప్టెంబరు 14న ఈక్వడార్ లోని గ్వాయాక్విల్ లో జరిగిన 2013 వైస్ క్వీన్ యునైటెడ్ కాంటినెంట్ పోటీలో ఆమె విజేతగా నిలిచింది.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | గమనిక |
|---|---|---|---|---|
| 2018 | పాగల్పంటి | రోష్ని టెండూల్కర్ | గుజరాతీ | [4] |
| 2019 | లవ్అటర్న్ | హిందీ |
మూలాలు
[మార్చు]- ↑ Dharamsala resident Purva Rana eager to regain the crown of Miss India Archived 2016-03-04 at the Wayback Machine himsatta.com. Retrieved 20 September 2013
- ↑ "Purva Rana". Femina Miss India. Archived from the original on 2019-09-23. Retrieved 2019-09-23.
- ↑ Purva Rana strikes gold for India Archived 21 సెప్టెంబరు 2013 at the Wayback Machine Yahoo News. Retrieved 17 September 2013
- ↑ "Bioscopewala and Pagalpanti films will be released on May 25". www.amarujala.com. Retrieved 5 May 2018.