పృథ్వీరాజ్ తొండైమాన్
స్వరూపం
| పతకాల రికార్డు | |||
|---|---|---|---|
| పురుషుల షూటింగ్ | |||
| Competitor for | |||
| ఆసియా క్రీడలు | |||
| 2022 హాంగ్జౌ | ట్రాప్ టీమ్ | ||
| ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ | |||
| 2012 పాటియాలా | ట్రాప్ టీమ్ | ||
| 2023 చాంగ్వాన్ | మిక్స్డ్ ట్రాప్ టీమ్ | ||
| 2016 అబూదాబి | ట్రాప్ టీమ్ | ||
| 2019 దోహా | ట్రాప్ టీమ్ | ||
| 2023 చాంగ్వాన్ | ట్రాప్ టీమ్ | ||
| 2015 కువైట్ సిటీ | ట్రాప్ టీమ్ | ||
పృథ్వీరాజ్ తొండైమాన్ (జననం 6 జూన్ 1987) తమిళనాడుకు చెందిన భారతీయ క్రీడా షూటర్. ఇతడు ట్రాప్ విభాగంలో పోటీ చేస్తాడు. ఇతడు చైనా హాంగ్జౌ జరిగిన 2022 ఆసియా క్రీడలలో భారత షూటింగ్ జట్టులో భాగంగా ఉన్నాడు.[1]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]తొండైమాన్ తమిళనాడులోని పుదుక్కొట్టైకి చెందినవాడు. ఇతని తండ్రి రాజగోపాల్ తొండైమాన్ కూడా ఒక షూటర్. ఇతడు పుదుక్కోట్టై మహారాజ వంశానికి చెందినవాడు.[2] ఇతడు 2012లో చెన్నై వడపళని క్యాంపస్‌లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు.[3]
వృత్తి
[మార్చు]జూలై 2023లో, ఇటలీ లోనాటోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షాట్‌గన్ పురుషుల ట్రాప్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో పతకం సాధించిన ఏకైక భారతీయుడు పృథ్వీరాజ్.[4] అంతకుముందు, మార్చి 2023లో, దోహా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ ప్రపంచ కప్‌లో కూడా కాంస్య పతకం గెలుచుకున్నాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Indian shooters at Asian Games: Events, key dates, format and rules". ESPN (in ఇంగ్లీష్). 2023-09-24. ఒరిజినల్ నుండి 2023-09-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-28.
- ↑ S, Gomesh (2024-07-21). "Tamil Nadu shooter Prithviraj set for Olympic debut". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-16.
- ↑ "SRMIST Alumni Mr. Prithviraj Tondaiman Shines as World Champion! - SRMIST" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-20. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-02-16.
- ↑ Scroll Staff (2023-07-17). "Shooting World Cup: Prithviraj Tondaiman wins bronze in men's trap event in Lonato". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2023-09-28 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-28.
- ↑ "Prithviraj Tondaiman wins maiden individual World Cup medal". The Times of India. 2023-03-11. ISSN 0971-8257. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-09-28.