పెండ్యాల రాఘవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండ్యాల రాఘవరావు
పెండ్యాల రాఘవరావు


నియోజకవర్గము వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1917-03-15) 1917 మార్చి 15
చిన్నపెండ్యాల, వరంగల్ జిల్లా
మరణం 1987 సెప్టెంబరు 10 (1987-09-10)(వయసు 70)
రాజకీయ పార్టీ Peoples Democratic Front (Hyderabad)
జీవిత భాగస్వామి వెంకటమ్మ
సంతానము 2 కుమారులు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

పెండ్యాల రాఘవరావు (Pendyala Raghava Rao) లోక్‌సభ సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటుకు భారతీయ కమ్యూనిష్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1]

ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు వరంగల్ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.

ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి; 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో 1వ లోకసభకు హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-03-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-07-06. Cite web requires |website= (help)