పెందుర్తి వెంకటేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెందుర్తి వెంకటేష్
మాజీ ఎమ్మెల్యే
Assumed office
2009 - 2019
తరువాత వారుజక్కంపూడి రాజా
నియోజకవర్గంరాజానగరం నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1966
సీతానగరం , తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ
సంతానంలక్ష్మి సాధన , అభిరామ్
తల్లిదండ్రులురామచందర్ రావు
నివాసంసీతానగరం

పెందుర్తి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రాజానగరం నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

పెందుర్తి వెంకటేష్ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తూర్పు గోదావరి జిల్లా , సీతానగరం లో జన్మించాడు. ఆయన పదవ తరగతి రాజమండ్రి లోని నివేదిత్ కిశోర్ విహార్ హై స్కూల్ లో, ఇంటర్మీడియట్ సి.జి.టి.ఎం కళాశాలలో, విజయవాడలో 1988లో బి.టెక్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

పెందుర్తి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టూరి రవీంద్ర పై 6,936 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. పెందుర్తి వెంకటేష్ 2014లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మి పై 8887 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. [1]

పెందుర్తి వెంకటేష్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జక్కంపూడి రాజా చేతిలో 31772 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]ఆయన ప్రస్తుతం రాజానగరం టీడీపీ ఇంచార్జి గా పని చేస్తున్నాడు.

మూలాలు[మార్చు]

  1. 10TV (11 February 2019). "రాజానగరం రగడ : టీడీపీ పట్టు నిలుపుకుంటుందా!" (in telugu). Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (2019). "Rajanagaram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.