పెడ్రో అల్మోడోవర్
పెడ్రో అల్మోడోవర్ కాబల్లెరో (1949 సెప్టెంబరు 25)[1] స్పానిష్ సినిమా నిర్మాత. మెలోడ్రామా, హాస్యం, బోల్డ్ కలర్, అలంకరణ, జనాదరణ పొందిన సంస్కృతి, సంక్లిష్ట కథనాలతో ఇతని సినిమాలు గుర్తింపుపొందాయి. ఇతని సినిమాలలో సమస్యలు, కుటుంబం వంటివి అత్యంత ప్రబలమైన అంశాలుగా ఉంటాయి. అంతర్జాతీయ సినిమా నిర్మాతలలో ఒకరిగా ప్రశంసించబడిన అల్మోడోవర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి.
జననం, కుటుబం
[మార్చు]పెడ్రో అల్మోడోవర్ కాబల్లెరో 1949 సెప్టెంబరు 25న స్పెయిన్‌లోని కాస్టిలే-లా మంచా ప్రావిన్స్‌లోని సియుడాడ్ రియల్‌లోని ఒక చిన్న గ్రామీణ పట్టణమైన కాల్జాడా డి కాలట్రావాలో జన్మించాడు.[2] అతనికి ఇద్దరు అక్కలు (ఆంటోనియా, మరియా జీసస్), ఒక సోదరుడు (అగస్టిన్) ఉన్నారు.[3] . [4] తండ్రి, ఆంటోనియో అల్మోడోవర్, ఒక వైన్ తయారీదారుడు,[5] తల్లి ఫ్రాన్సిస్కా కాబల్లెరో, లెటర్ రీడర్, ట్రాన్స్‌క్రైబర్.[6]
సినిమారంగం
[మార్చు]1986లో, తన తమ్ముడు అగస్టిన్ అల్మోడోవర్‌తో కలిసి ఎల్ డెసియో అనే తన స్వంత సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు. 1987లో లా ఆఫ్ డిజైర్ సినిమాను నిర్మించాడు. 1988లో వచ్చిన ఉమెన్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఎ నెర్వస్ బ్రేక్‌డౌన్ సినిమా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు ఎంపికైంది.
నటులు ఆంటోనియో బాండెరాస్, పెనెలోప్ క్రజ్‌లతో కలిసి విజయవంతమైన సినిమాలు తీశాడు. టై మి అప్! టై మి డౌన్! (1989) హై హీల్స్ (1991), లైవ్ ఫ్లెష్ (1997) అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు..తరువాతి రెండు సినిమాలు ఆల్ అబౌట్ మై మదర్ (1999), టాక్ టు హర్ (2002) అతనికి వరుసగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అకాడమీ అవార్డును పొందాయి. తరువాత వోల్వర్ (2006), బ్రోకెన్ ఎంబ్రేసెస్ (2009), ది స్కిన్ ఐ లైవ్ ఇన్ (2011), జూలియటా (2016), పెయిన్ అండ్ గ్లోరీ (2019), పారలల్ మదర్స్ (2021) మొదలైన సినిమాలు తీశాడు.
అవార్డులు
[మార్చు]అల్మోడోవర్ రెండు అకాడమీ అవార్డులు, ఐదు బాఫ్టా అవార్డులు, రెండు ఎమ్మీ అవార్డులు, రెండు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, తొమ్మిది గోయా అవార్డులతోపాటు ఇతర అనేక అవార్టులను అందుకున్నాడు. 1997లో ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ హానర్, 1999లో ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్ మెడల్ ఆఫ్ మెరిట్, 2013లో యూరోపియన్ ఫిల్మ్ అకాడమీ అచీవ్‌మెంట్ ఇన్ వరల్డ్ సినిమా అవార్డును అందుకున్నాడు.[7][8] 2019లో గోల్డెన్ లయన్‌ను అందుకున్నాడు.[9][10][11] 2009లో[12][13] హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి, 2016లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరల్ డిగ్రీలను కూడా పొందాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Book of Members, 1780–2010: Chapter A" (PDF). American Academy of Arts and Sciences. Retrieved 2023-05-22.
- ↑ "Pedro Almodóvar Biography". Biography.com. Archived from the original on 28 January 2019. Retrieved 2023-05-22.
- ↑ José Luis Romo (8 April 2016). "Agustín Almodóvar, 'Todo sobre mi hermano' | loc | EL MUNDO". Elmundo.es. Retrieved 2023-05-22.
- ↑ Chitra Ramaswamy (28 April 2013). "Pedro Almodóvar on his new film 'I'm so Excited!'". Scotsman.com. Retrieved 2023-05-22.
- ↑ Lynn Hirschberg (5 September 2004). "The Redeemer : Pedro Almodovar : Cannes: The Slow Drive to Triumph". The New York Times. Retrieved 2023-05-22.
- ↑ Giles Tremlett (27 April 2013). "Pedro Almodóvar: 'It's my gayest film ever' | Film". The Guardian. Retrieved 9 May 2015.
- ↑ "Winners 2013". European Film Awards. European Film Academy. Retrieved 2023-05-22.
- ↑ "Biennale Cinema 2019 | Pedro Almodóvar, Golden Lion for Lifetime Achievement". La Biennale di Venezia (in ఇంగ్లీష్). 2019-06-14. Retrieved 2023-05-22.
- ↑ "Biennale Cinema 2019 | Pedro Almodóvar, Golden Lion for Lifetime Achievement". La Biennale di Venezia (in ఇంగ్లీష్). 2019-06-14. Retrieved 2023-05-22.
- ↑ Vivarelli, Nick (2019-06-14). "Pedro Almodovar to Receive Lifetime Achievement Award at Venice Film Festival". Variety. Retrieved 2023-05-22.
- ↑ Wiseman, Andreas (2019-06-14). "Pedro Almodóvar To Receive Venice Film Festival Golden Lion For Lifetime Achievement". Deadline. Retrieved 2023-05-22.
- ↑ Luis Martínez (29 March 2016). "Pedro Almodóvar, doctor honoris causa por Oxford | Cultura | EL MUNDO". Elmundo.es. Retrieved 2023-05-22.
- ↑ Ten honorary degrees awarded at Commencement | Harvard Gazette. News.harvard.edu. Retrieved on 2023-05-22.