Coordinates: 16°02′56″N 80°28′14″E / 16.048865°N 80.470498°E / 16.048865; 80.470498

పెదపాలెం (పొన్నూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
పెదపాలెం is located in Andhra Pradesh
పెదపాలెం
పెదపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°02′56″N 80°28′14″E / 16.048865°N 80.470498°E / 16.048865; 80.470498
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ధూళిపాళ్ళ నాగేశ్వరరావు
పిన్ కోడ్ 522112
ఎస్.టి.డి కోడ్ 08643

పెదపాలెం గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు, 2014,నవంబరు-26న పొన్నూరులో జరిగిన మండల సర్పంచుల సంఘం ఎన్నికలలో, ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు.

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన ధూళిపాళ్ళ బాలచంద్ర ప్రసాద్ అను విద్యార్థిచదరంగంలో చిచ్చరపిడుగు. ఇతడు రాష్ట్ర, జాతీయ పోటీలలో అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈతని తల్లిదండ్రులు శ్రీ రమేష్ బాబు & రత్నశ్రీ.

గ్రామ విశేషాలు[మార్చు]

గుంటూరు జిల్లాలో రెండు గ్రామాలున్నవి. ఆ గ్రామాల మధ్యలో రోడ్డే అడ్డం. రోడ్డుకు రెండువైపులా ఉన్నా, ఈ పంచాయతీలు రెండూ కలిసే ఉన్నట్లుగా ఉంటవి. ఈ రెండు గ్రామాలూ, రాజకీయ చైతన్యం ఉన్న గ్రామాలే. కానీ ఆ రెండు గ్రామాలూ రెండు వేర్వేరు శాసనసభా నియోజకవర్గాలలో ఉండటమె ఆశ్చర్యం. ఆ రెండు గ్రామాలూ ఇవి:-

  1. పొన్నూరు నియోజకవర్గంలో, పొన్నూరు మండలంలో ఉన్న పెదపాలెం గ్రామం. ఈ గ్రామం మండలకేంద్రానికి 10కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,000. ఓటర్లు=1,500.
  2. ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలంలో ఉన్న తెలగాయపాలెం. ఈ గ్రామం మండలకేంద్రానికి 7కి.మీ.దూరంలో ఉంది. జనాభా=3,500. ఓటర్లు=1,850.