Coordinates: 16°08′43″N 80°39′51″E / 16.145149°N 80.664282°E / 16.145149; 80.664282

పెదపూడి (అమృతలూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపూడి
—  రెవెన్యూ గ్రామం  —
పెదపూడి is located in Andhra Pradesh
పెదపూడి
పెదపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°08′43″N 80°39′51″E / 16.145149°N 80.664282°E / 16.145149; 80.664282
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం అమృతలూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి పెదపూడి సమాధానమ్మ
జనాభా (2011)
 - మొత్తం 3,395
 - పురుషుల సంఖ్య 1,710
 - స్త్రీల సంఖ్య 1,685
 - గృహాల సంఖ్య 935
పిన్ కోడ్ 522325
ఎస్.టి.డి కోడ్ 08644

పెదపూడి బాపట్ల జిల్లా అమృతలూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అమృతలూరు నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 935 ఇళ్లతో, 3395 జనాభాతో 580 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1710, ఆడవారి సంఖ్య 1685. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1956 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 181. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590388[1].పిన్ కోడ్: 522325. ఎస్.టి.డి.కోడ్ = 08644.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మూల్పూరు, అమృతలూరు, పాంచాలవరం, పెరవలి, కూచిపూడి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. సమీప బాలబడి కూచిపూడిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ పొన్నూరులోను, మేనేజిమెంటు కళాశాల తెనాలిలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పెదపూడిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పెదపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పెదపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 99 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 476 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 476 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పెదపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 476 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పెదపూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మొక్కజొన్న, మినుము

ఇతర విశేషాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాల విద్యార్థిని అయిన యర్రంశెట్టి సంధ్యారాణి, 2013,డిసెంబరు 1వ తేదీన అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పరుగు పందెములలో, 300 మీటర్లు మరియూ, 4x400 మీటర్ల రిలే పరుగు పందెములలో తృతీయస్థానంలో నిలిచి కాంస్యపతకం & ప్రశంసాపత్రం పొందినది. ఈమె ఇంతవరకు, జిల్లాస్థాయిలో 30 సార్లు, రాష్ట్రస్థాయిలో 14 సార్లు, విజయం సాధించి ఙాపికలు అందుకున్నది.
  2. ఈ పాఠశాలకు చెందిన ఉమాసఖి, సంధ్యారాణి, సౌజన్య, సునీత, సుజిత్ కుమార్ అను ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై, 2014, సెప్టెంబరు-13,14 తేదీలలో కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొన్నారు. వీరిలో యర్రంశెట్టి సంధ్యారాణి, 3000 మీటర్ల పరుగు పందెంలో తృతీయస్థానం సాధించి, కాంస్యపతకం పొందినది.
  3. ఈ పాఠశాలలో చదువుచున్న నాగమల్లేశ్వరి, సంధ్యారాణి, సునీత, సౌజన్య అను విద్యార్థినులు, 2014,డిసెంబరు-17వ తేదీనాడు గుంటూరులో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో విజయకేతనం ఎగురవేసి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు.
  4. ఈ పాఠశాలలో చదువుచున్న ఇద్దరు విద్యార్థినులు, జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనారు. 2014,డిసెంబరు-19 నుండి 21 వరకు, గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన పోటీలలో, సంధ్యారాణి అను విద్యార్థిని 3000 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయస్థానం సాధించి, రజతపతకం కైవసం చేసుకున్నది. నాగవెంకట ఉమాసఖి అను విద్యార్థిని 600 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానం సాధించి స్వర్ణపతకం మరియూ 400 మీటర్ల పరుగుపందెంలో తృతీయస్థానం పొంది, కాంస్యపతకం అందుకున్నది. దీనితో వీరిద్దరూ, 2015,జనవరి-19 నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించారు.
  5. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్న సౌజన్య, ఉమాసఖి అను విద్యార్థినులు, 2015,ఆగస్టు-23వ తేదీన, గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి 4 X 100 మీటర్ల పరుగు పందెంలో, రిలే విభాగంలో గెలుపొంది స్వర్ణపతకం సాధించారు.
  6. విశాఖపట్నంలో 2015,సెప్టెంబరు-5వ తేదీనుండి నిర్వహించు జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్థిని నాగవెంకట ఉమాసఖి ఎంపికైనది.
  7. పాఠ్యబోధనలో ఉత్తమ పనితీరు ప్రదర్శించినందుకు గాను, ఈ పాఠశాల ప్రధానోపాధ్యులు శ్రీ వేంకటేశ్వరరావును, గుంటూరుకు చెందిన లైన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో వారిని గురుబ్రహ్మ పురస్కారానికి ఎంపికచేసారు. వీరికి ఈ పురస్కారాన్ని, ఇటీవల గుంటూరులో నిర్వహించిన అభినందన సభలో, ఆయనను సత్కరించి, జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ శ్రీమతి జానీమూన్ చేతులమీదుగా అందజేసినారు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గోపాలమిత్ర సేవా కేంద్రం:- ఇటీవల ఈ కేంద్రానికి నిర్మించిన నూతన భవనాన్ని, 2015,డిసెంబరు-4వ తేదీనాడు ప్రారంభించారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పెదపూడి సమాధానమ్మ, 734 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.
  2. పెదపూడి గ్రామ పంచాయతీ ఏర్పడి, 2014,అక్టోబరు-17 నాటికి 85 సంవత్సరాలు పూర్తి అయినది.
  3. చదలవాడ వెంకటరత్నం, లలితాంబ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు శ్రీ శ్రీనివాసరావు, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి భవన నిర్మాణానికై 3 సెంట్ల స్థలం వితరణ చేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ గోగర్భ రామానంద అవధూత స్వామి మందిరం[మార్చు]

  1. శ్రీ రామానందస్వామి, తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కాటు జిల్లాలోని కలకటూరు గ్రామములో జన్మించి, 136 సంవత్సరాలు జీవించి, 137వ సంవత్సరంలో, పెదపూడిలో జీవసమాధి అయినారు. అప్పట్లో స్వామికి నిర్మించిన మందిరం మెతకబారడంతో, దీనిని మళ్ళీ పునర్నిర్మాణానికి, 2015,ఫిబ్రవరి-11వ తేదీనాడు శంకుస్థాపన చేసారు. ఈ ఆలయ నిర్మాణం, శ్రీ షేక ఖాశిం పర్యవేక్షణలో, దాతల, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో చురుకుగా నిర్వహించారు.
  2. దాతల ఆర్థిక సహకారంతో రు.7 లక్షల వ్యయంతో ఈ ఆలయం పుననిర్మాణం పూర్తి అయినది. అవధూతస్వామితోపాటు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, సాయిబాబా విగ్రహలను గూడా ప్రతిష్ఠించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల-29వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించారు. 30వతేదీ శనివారంనాడు, విఘ్నేశ్వరపూజ, యంత్ర అనుష్టానం, పంచగవ్యం, అంకురారోపణ, శాంతిహోమం నిర్వహించారు. 31వ తేదీ ఆదివారంనాడు, విగ్రహ ప్రతిష్ఠ కావించి, అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.
  3. ఈ మందిరంలో స్వామివారి వార్షిక ఆరాధన మహోత్సవం, 2016,మే-25వ తేదీ బుధవారంనాడు నిర్వహించెదరు. ఈ సందర్భంగా 17వ తేదీ మంగళవారం నుండి 25వ తేదీ బుధవారం వరకు సప్తాహం నిర్వహించెదరు.

శ్రీ కాళీకృష్ణ దివ్య కిరణ పీఠం[మార్చు]

ఇక్కడ, 2015,మార్చి-15వ తేదీ ఆదివారం నాడు, ఏకాహ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటలనుండి భజనలు ప్రారంభించారు. 24 గంటలు కాళీకృష్ణ భజనలు కొనసాగించెదరు. ఈ సందర్భంగా మందిరంలో, కాళీకృష్ణ నామం, పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామ సభ్యులు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, సమీప గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామములో పండుగ వాతావరణం నెలకొన్నది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు.

శ్రీ బృందావన సాయిమందిరం[మార్చు]

ఈ ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా, 2017,మే17వతేదీ బుధవారంనాడు గీతాపారాయణం, ప్రత్యేకపూజలు నిర్వహించారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

చదలవాడ ఉమేశ్ చంద్ర
  • చదలవాడ ఉమేశ్ చంద్ర - 1966 మార్చి 19 న పెదపూడి గ్రామంలో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడు.కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు. ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆగగా, నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. 2000 సెప్టెంబరు 4, న ఉమేశ్ చంద్ర విగ్రహం సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
  • ఆర్.సి.శేఖర - ప్రముఖ ఇంద్రజాల ప్రదర్శకుడు, "రాష్ట్రస్థాయి ఉత్తమ ఇంద్రజాల ప్రదర్శకుడు" ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాదుకు చెందిన "లలిత కళాసుధ" అను సాంస్కృతిక సంస్థ వారు, 2014,మార్చి-27 రాత్రి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సత్కార సభలో, మాజీ మంత్రి శంకరరావు చేతులమీదుగా వీరికి ఈ పురస్కారం అందజేశారు. పలురంగాలలో విశిష్టసేవలందించిన 40 మందికి ఈ పురస్కారం అందజేశారు. సమాజంలో మూడనమ్మకాల నిర్మూలనకు, విజ్ఞానంతోపాటు వినోదం అందిస్తూ దేశంలో 1200 ప్రదర్శనలిచ్చినందుకు వీరికి ఈ పురస్కారం అందజేశారు.
  • చదలవాడ పిచ్చయ్య -సోషలిస్టు ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ యర్రంశెట్టి వెంకటరావు, వెంకటసుబ్బమ్మ దంపతులు ఒక వ్యవసాయ కుటుంబనికి చెందినవారు. వీరి కుమార్తె సంధ్యరాణి, ఖాజీపాలెంలోని డి.ఎస్.రాజు.జూనియర్ కళాశాలలో ఇంటరు చదువుచున్నది. ఈమె చిన్నతనం నుండి క్రీడలంటే ఎంతో ఆసక్తి. 10వ తరగతిలో జిల్లాస్థాయిలో నిర్వహించిన ఖో-ఖో, పరుగుపందెం పోటీలలో పాల్గొని తన ప్రతిభ కనబరచింది. ఈమె ఇపుడు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని తన సత్తా అటుచున్నది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3401. ఇందులో పురుషుల సంఖ్య 1741, స్త్రీల సంఖ్య 1660,గ్రామంలో నివాస గృహాలు 873 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 580 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.