Jump to content

పెదరావూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°38′E / 16.183°N 80.633°E / 16.183; 80.633
వికీపీడియా నుండి
పెదరావూరు
పెదరావూరు గ్రామ సైన్ బోర్డు
పెదరావూరు గ్రామ సైన్ బోర్డు
పటం
పెదరావూరు is located in ఆంధ్రప్రదేశ్
పెదరావూరు
పెదరావూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°38′E / 16.183°N 80.633°E / 16.183; 80.633
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంతెనాలి
విస్తీర్ణం
8.72 కి.మీ2 (3.37 చ. మై)
జనాభా
 (2011)
7,088
 • జనసాంద్రత810/కి.మీ2 (2,100/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,493
 • స్త్రీలు3,595
 • లింగ నిష్పత్తి1,029
 • నివాసాలు2,019
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522201
2011 జనగణన కోడ్590298

పెదరావూరు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తెనాలి నుండి 3 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2019 ఇళ్లతో, 7088 జనాభాతో 872 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3493, ఆడవారి సంఖ్య 3595. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2819 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 277. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590298[1].ఇది తెనాలి నుండి 3 కి.మి దూరంలో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి తెనాలిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల తెనాలిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెదరావూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెదరావూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెదరావూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 157 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 714 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 6 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 707 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెదరావూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 679 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 28 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెదరావూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులలో మంచి ఆదరణ ఉన్నదనటానికి ఈ పాఠశాల నిదర్శనంగా ఉంది. ఉపాధ్యాయుల అంకితభావం, చక్కని విద్యాబోధనతో, ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుచున్న విద్యార్థుల సంఖ్య 650 కి చేరుకున్నది.
  2. ఈ పాఠశాల స్థల దాత కీ.శే.కొత్తపల్లి అంజయ్య. గ్రామంలో ఈ పాఠశాల ప్రారంభించి 53 సంవత్సరాలు అయిన సందర్భంగా, 2016, జనవరి-11వ తేదీనాడు, స్వర్ణోత్సవాలు (గోల్డెన్ జూబిలీ) నిర్వహించారు.
  3. ఈ పాఠశాల ఆవరణలో, 2015, నవంబరు-14వ తేదీ ఉదయం 10ంగంటలకు నాడు తెలుగుతల్లి విగ్రహావిష్కరణ నిర్వహించారు.
  4. ఇటీవల శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ అఖిల భారతదేశ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ప్రదర్శించారు. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న డి.హనుమానాయక్ ప్రథమ బహుమతిని అందుకోగా, జక్కా విజయలక్ష్మి, కొసనా శివతేజ, షేక్ సమీర్ బాషా, కె.వదూషలక్ష్మి ప్రత్యేక బహుమతులు పొందినారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. "పెదరావూరు" గ్రామం ఉద్దండుల పంచాయతీగా పేరు పొందినది. నాడు గ్రామ పంచాయతీ సర్పంచులుగా పనిచేసినవారు ఉత్తమపాలకులుగా కీర్తి పుటలకెక్కారు. 1928లో ఈ గ్రామ తొలి సర్పంచిగా శాఖమూరి వెంకటరామయ్య పనిచేశారు. తదనంతరం 1956 నుండి 1970 వరకూ, తిరిగి 1981 నుండి 1988 వరకూ సుదీర్ఘకాలం పనిచేసిన సర్పంచిగా కొత్తపల్లి ఉమామహేశ్వరరావు గుర్తింపు పొందినారు. రావూరి సామ్రాజ్యం తొలి దళిత మహిళా సర్పంచిగా 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. కొత్తపల్లి ఉమామహేశ్వరరావు గుర్తింపు పొందినారు. రావూరి సామ్రాజ్యం తొలి దళిత మహిళా సర్పంచిగా 2001 నుండి 2006 వరకూ పనిచేశారు. శ్రీ కొత్తపల్లి ఉమామహేశ్వరరావు కూచిపూడి (తెనాలి) సమితి అధ్యక్షులుగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్సులుగా, సహకార సంస్థ అధ్యక్సులుగా గ్రామస్థుల మన్ననలందుకున్నారు. ఈ గ్రామానికి చెందిన పాలడుగు రామకృష్ణయ్య జిల్లా ఖాదీ బోర్డు అధ్యక్షులుగా పనిచేశారు. ఈ గ్రామానికి చెందిన మారౌతు సీతారామయ్య గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులుగా పనిచేశారు. వీరు గ్రామానికి కొత్త గుర్తింపు తెచ్చారు.
  2. పెదరావూరు గ్రామ పంచాయతీ 1923లో ఏర్పడింది. ప్రస్తుత గ్రామ జనాభా=5,380.ఓటర్లు:- పురుషుల సంఖ్య=2,622. స్త్రీల సంఖ్య=2758. మొత్తం=5,380. వార్షికాదాయం=రు.12లక్షలు. ఈ గ్రామంలో 2006 నుండి అభివృద్ధి ఎక్కువ జరిగింది. బురదకూపంగా ఉండే మట్టిరోడ్లు సిమెంటురోడ్లుగా, కునారిల్లుతూ వెలుగుతున్న వీధిదీపాలు ట్యూబ్ లైట్లుగా మారినవి. పార్టీలకతీతంగా గ్రామం ప్రగతిబాటలో అడుగులు వేయడానికి అప్పటి సర్పంచి శ్రీ మాదల వెంకటభానుప్రసాద్ కృషే కారణం. పెదరావూరు గ్రామ అభివృద్ధికి, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తో పాటు, రాయపాటి సాంబశివరావు, ఒకప్పటి ఎం.పి.శ్రీ ఎడ్లపాటి వెంకటరావు, ఎం.ఎల్.సి.లు శ్రీమతి నన్నపనేని రాజకుమారి, శ్రీ కె.ఎస్.లక్ష్మనరావుల నుండి, నిధులు విడుదలైనవి. పారదర్శకంగా పూర్తి స్థాయిలో నిధులు వినియొగించినందుకుగాను, 2009-10లో జిల్లా ఉత్తమ సర్పంచిగా శ్రీ మాదల వెంకటభానుప్రసాద్ ఎంపిక కావడాఅనికి కారణమైనది. జిల్లా మంత్రి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, అప్పటి కలెక్టర్ శ్రీ విష్ణు నుండి అభినందనలు అందుకున్నారు. ఐదేళ్ళలో గ్రామంలో 80 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం, ఓవర్ హెడ్ ట్యాంకు, మంచినీటి పైపులైను నిర్మాణం చేపట్టినారు. మండల అభివృద్ధి నిధులతో, సిమెంటు రహదారులు, పంచాయతీ అంతర్గత నిధులతో సిమెంటు రహదారులు, మురుగు కాలువలు నిర్మించారు. 2 కోట్ల ఖర్చుతో గ్రామాభివృద్ధి జరిగింది. ఇంకా 4.5 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం, మరో 5 లక్షల రూపాయలతో సామాజిక భవనం, 2 అంగనవాడీ భవనాలు, శుద్ధజలం అందించేటందుకు ఆర్.వొ. ప్లాంటు ఏర్పాటు చేశారు. రాష్ట్రలో మొట్టమొదటి "డిజిటల్" గ్రంథాలయం ఏర్పాటుచేసిన ఘనత పెదరావూరుకే దక్కింది.
  3. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కుదరవల్లి ఉమశ్రీ, (పొదుపు మహిళ) సర్పంచిగా, 194 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)
  • శ్రీ నన్నూరమ్మ తల్లి దేవర ఆలయం

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కొడాలి గోపాలరావు - (1925 - 1993) ప్రముఖ తెలుగు నాటక రచయిత.

కుదరవల్లి శివశంకరరావు

కూచిభొట్ల శివరామకృష్ణయ్య -రంగస్థల, సినిమా నటులు

త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి -రంగస్థల, సినిమా నటులు

కొడాలి భవ్యశ్రీ -అమెరికాలోని క్యాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో ఉన్నత పాఠశాల చదువు పూర్తి చేసింది. ఈమె వ్రాసిన "విండిక్టివ్" అను నవల అక్కడ బహుళ ప్రజాదరణ పొందినది.

వీరమాచనేని శ్రీనివాసరావు - వి.డి.ఆర్.మనోహర్, వాకర్స్ క్లబ్-2, అధ్యక్షులుగానూ, గౌరవాధ్యక్షులు. వీరి సతీమణి శ్రీమతి గృహలక్ష్మి. వీరి కుమారుడు వీరమాచనేని శ్రీనివాసరావు, 10వ తరగతి వరకు ఈ గ్రామ పాఠశాలలోనే చదివినారు. ఆ తరువాత వరంగల్లులోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (ఎన్.ఐ.టి.) లో బి.టెక్., చదివినారు. అనంతరం అమెరికాలోని "ఉటా" విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పొందినారు. వీరు అమెరికాలోని ఇన్నొవేషన్స్ రీసెర్చ్ లాబొరేటరీ అను సంస్థలో, సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తాజాగా ఈయన, యు.ఎస్.జి. (జిప్సం) కార్పొరేషను అను సంస్థకు వైస్-ప్రెసిడెంటుగా నియమింపబడినారు. ఈ పదవికి ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం.

పెద్దపాటి నాగేశ్వరరావు -పెదరావూరు గ్రామంలో జన్మించి, పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ మాష్టారుగా రిటైర్మెంట్ అయ్యారు.

ఘట్టమనేని సాయిరేవతి -

నిరుపేద కుటుంబంలో జన్మించి, ఎం.బి.ఏ చదివి ఎం.సి.ఏ చదివిన ఘట్టమనేని సాయిరేవతి, వెయిట్ లిఫ్టింగ్ లో ఎన్నో రికార్డులు సాధించింది. తాజాగా ఈ 2013 జూలై-21 నుండి 26 వరకూ కర్నాటకలోని మంగుళూరులో భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సీనియర్ స్థాయి పోటీలలో ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం గెలుచుకున్నది. అన్ ఎక్విప్ డ్ విభాగంలో మొత్తం 317.5 కిలోలబరువును ఎత్తి బంగారు పతకం గెలుచుకున్నది. ఎక్వి ప్డ్ విభాగంలో 160కిలోల బరువు యెత్తి వెండి పతకం గెలుచుకున్నది. రేపో, మాపో దేశం తరపున ఆడేటందుకు సమాయత్తమగుచున్నది.ఈమె 21-5-2014 నుండి 18-6-2014 వరకు ఏ.ఎన్.యు.లో నిర్వహించిన రాష్ట్రస్థాయి Phisical Education Common Entrance Test లో 28 వేల మందిలో ప్రథమస్థానం కైవసం చేసుకున్నది. ఈమె 2014, డిసెంబరు-6 నుండి 8 వరకు, థాయిలాండు దేశంలో జరిగే అంతర్జాతీయ ఓల్డ్ యూనివర్శిటీస్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించుటకు ఎంపికైనది. ఈ పోటీలకు, దేశం మొత్తం మీద ముగ్గురు క్రీడాకారులను ఎంపిక చేయగా, అందులో ఈమె ఒకరు. గతంలో ఈమె ఏడుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, వెయిట్ లిఫ్టింగులో రెండు, పవర్ లిఫ్టింగులో రెండు, బంగారు పతకాలను సాధించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషను ఆధ్వర్యంలో, కృష్ణా జిల్లా కేతనకొండ గ్రామంలో, 27-2-2015 నుండి 1-3-2015 వరకు నిర్వహించిన సౌత్ జోన్ (దక్షిణ భారతదేశం) పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఈమె ఛాంపియనుగా నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నది. ఈ పోటీలలో ఈమె స్క్వాట్ విభాగంలో 150 కిలోలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ విభాగంలో 185 కిలోలు, మొత్తంగా 385 కిలోల బరువును అవలీలగా ఎత్తి, విజేతగా నిలిచింది. ఈమె 2015, సెప్టెంబరు-8 నుండి 13 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూరులో నిర్వహించిన జాతీయస్థాయి సీనియర్ పవర్ లిఫ్టింగ్-2015 పోటీలలో, 63 కిలోల విభాగంలో, మొత్తం 350 కిలోల బరువులెత్తి, ప్రథమస్థానాన్ని సాధించి స్వర్ణ పతకం అందుకున్నది. ఈమె జాతీయస్థాయి పోటీలలో స్వర్ణ పతకం సాధించడం ఇది రెండవ సారి. ఈమెకు క్రీడా కోటలో, కేంద్రప్రభుత్వ అదాయపన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంటుగా ఉద్యోగం లభించింది. 2016, డిసెంబరు-26 నుండి 31 వరక ఝార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్ పూర్ నగరంలో "శుభ్రత క్లాసిక్ ఇంటర్ నేషనల్" సంస్థ నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఈమె, 357.5 కిలోల బరువును ఎత్తి, స్వర్ణ పతకం, ఉత్తమ క్రీడాకారిణి పతకం సాధించింది.

కల్లూరు తులశమ్మ - (25.12.1910–2000) గాంధేయవాది, బ్రహ్మచారిణి

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా = 6959, పురుషుల సంఖ్య = 3441, మహిళలు = 3518, నివాస గృహాలు = 1861, విస్తీర్ణం = 872 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.