పెదవెంకన్న పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదవెంకన్న పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
పెదవెంకన్న పాలెం is located in Andhra Pradesh
పెదవెంకన్న పాలెం
పెదవెంకన్న పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°13′32″N 79°47′57″E / 15.225509°N 79.799205°E / 15.225509; 79.799205
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పొన్నలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,283
 - పురుషుల సంఖ్య 655
 - స్త్రీల సంఖ్య 628
 - గృహాల సంఖ్య 284
పిన్ కోడ్ 523109
ఎస్.టి.డి కోడ్ 08599

పెదవెంకన్న పాలెం, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామము.[1] ఎస్.టి.డి కోడ్:08599.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ చల్లా వెంకటసుబ్బయ్య[మార్చు]

  • ఈ గ్రామానికి సర్పంచిగా పనిచేసిన శ్రీ చల్లా వెంకటసుబ్బయ్య, ఎలాంటి స్వార్ధం లేకుండా స్వంతగ్రామాభివృద్ధికి జీవితాంతం, శాయశక్తులా కృషిచేసి, గ్రామస్థుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1959లో కొత్తగా ఆవిర్భవించిన ఈ గ్రామ పంచాయతీకి తొలిసారి జరిగిన ఎన్నికలలో వీరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై, 1988 వరకూ సర్పంచిగా కొనసాగినారు. 1988లో సర్పంచి పదవిని ఎస్.సి.వర్గానికి రిజర్వేషను చేయగా, సర్పంచి పదవికి, వీరు సూచించిన వ్యక్తినే గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వీరు 1994 వరకూ గ్రామానికి జీవితకాల సర్పంచిగా పనిచేశారు. 1994 తరువాత వీరి మరణాంతరం జరిగిన 1996, 2001, 2006 ఎన్నికలలో సర్పంచి పదవికి పోటీలు జరగటం గమనార్హం. గ్రామానికి చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇప్పించిన ఘనత వీరిదే. నావాళ్ళు, నా కుటుంబం అన్న పక్షపాతం లేకుండా గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలలోని నిరుపేదలకు, సమ న్యాయం చేశారని ఇప్పటికీ గ్రామస్థులు చెప్పుకుంటారు. పట్టాలకోసం కార్యాలయల చుట్టూ తిరిగే క్రమంలో ఆయన స్వంతభూమిని అమ్ముకోవలసి వచ్చిందని ఆయన సమకాలీకులు చెపుతుంటారు. గ్రామానికి ఉత్తరంగా ఉన్న గరటయ్యకుంట గూడా "చల్లా" వారి హయాంలో నిర్మించినదని గ్రామస్థులు చెపుతారు. కుంట వలన పశువులకు, సమీప పొలాల రైతులకు ఎంతగానో ప్రయోజనం కలుగుచున్నది. 1971కి పూర్వం, గ్రామం పొలాలలో ఉండేది. వీధులన్నీ అస్తవ్యస్తంగా ఉండి గ్రామానికి చేరుకునేటందుకు బాట వసతి గూడా ఉండేదిగాదు. దానితో గ్రామాన్ని విప్పగుంట నుండి కందుకూరు వైపు వెళ్ళే రహదారిలోకి తరలించేటందుకు నడుం కట్టినారు. రహదారి ప్రక్కనే ప్రభుత్వ స్థలానికి నివేశన స్థలాలు ఇప్పించి, గ్రామస్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం విశాలమైన వీధులతో పచ్చని చెట్ల మధ్య ప్రకృతి రమణీయతకు దర్పణంగా నిలుస్తున్నదీ గ్రామం. వీరి హయంలో గ్రామానికి సమకూరిన శాశ్వత సదుపాయాలలో చెరువు నిర్మాణం మొదటిది. గ్రామంలో అందరూ నిరుపేదలు. పైగా గ్రామంలోనివి మెట్టభూములు కావటంతో, తిండిగింజల కొరత ఉండేది. ఈ చెరువు నిర్మాణానికి తన పరపతితో, నిధులు మంజూరు చేయించారు. చెరువు సమీపంలో ప్రవహించుచున్న పందివాగు నుండి నీటిని తరలించేటందుకు, గ్రామస్తులతో, కాలువ త్రవ్వించారు. 1985లో వాగుపై చెక్ డ్యాం నిర్మించి, శాశ్వత పరిష్కారం చూపించారు. దానితో గత 25 సంవత్సరాలనుండి చెరువు క్రింద ఏటా క్రమం తప్పకుండా, వరి పంట సాగవుచున్నది. గ్రామంలో తిండిగింజల కొరత తీర్చిన ఘనత ఆయనదేనని, గ్రామస్థులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 872. ఇందులో పురుషుల సంఖ్య 442, మహిళల సంఖ్య 430, గ్రామంలో నివాస గృహాలు 186 ఉన్నాయి.

2.జనాభా (2011) - మొత్తం 1,283 - పురుషుల సంఖ్య 655 -స్త్రీల సంఖ్య 628 - గృహాల సంఖ్య 284

సమీప పట్టణాలు[మార్చు]

వోలేటివారిపాలెం 13.2 కి.మీ, కందుకూరు 14.6 కి.మీ, కొండపి 17.8 కి.మీ, లింగసముద్రం 21.3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున కందుకూరు మండలం, దక్షణాన వోలేటివారిపాలెం మండలం, ఉత్తరాన కొండపి మండలం, తూర్పున జరుగుమిల్లి మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-17; 8వపేజీ.