పెద్దగోపతి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్ద గోపతి బోర్డు

పెద్దగోపతి, ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 507305.[1] . ఈ గ్రామంలో జనాభా సుమారుగా 5000 మంది. గ్రామంలో ఎక్కువగా కమ్మ వారు మిగతావారు బి.సి., యస్.సీ. కులాలకు చెందినవారు ఉన్నారు. కమ్మ వారిలో ఎక్కువగా "ప్రతాపనేని" అనే ఇంటిపేరు వారు ఉన్నారు. ఈ గ్రామ ప్రధాన ఆధారం వ్యవసాయం. గ్రామం గుండా "నాగార్జున"సాగర్ ప్రధాన కాలువ ప్రవహించటం వలన గ్రామం ఎప్పుడు సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లుతుంటుంది. గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలంగా ఉంది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నుండి పోటి చేసి గెలుపొందిన సామినేని నర్సయ్య సర్పంగ్ గా పనిచేస్తున్నారు.

చిన్న గోపతి అనే మరో గ్రామం ఈ గ్రామం కంటే ముందు వస్తుంది. ఇక్కడ గౌడ కులం బలమైన సామాజికవర్గంగా ఉంది. పొట్లపల్లి ఇంటి పేరు గలవారు గత కొన్నేళ్లుగా గ్రామ పంచాయితీని ఏలుతున్నారు. విద్యాధికులైన కొందరు ఈ గ్రామం నుంచి హైదరాబాద్ లో వివిధ విభాగాల్లో స్థిరపడ్డారు.

సమీప గ్రామాలు[మార్చు]

నేరడ, అనంతారం, లచ్చగూడెం, కోమట్ల గూడెం, బొట్లకుంట, పెద్ద మునగాల, చిన్న గొపతి,

సమీప మండలాలు[మార్చు]

చింతకాని, వైరా, ఖమ్మం అర్బన్, బొనకల్

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

పెద్దగొపతి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం అధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాల ఉన్నాయి. వీటితో పాటు ప్రయివేట్ చిన్న, చిన్న పాఠశాలలు కూడా గ్రామంలోని పిల్లలకే కాకుండా పక్కా గ్రామాల పిల్లలకు కూడా విద్య అవసరాలను తీరుస్తున్నాయి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెద్దగోపతి గ్రామానికి కల రవాణా సదుపాయాలు అన్ని ఇన్ని కావు. జిల్లా ప్రధాన కేంద్రం ఖమ్మం నుండి రెండు మార్గాల్లో తెలంగాణా రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు నిత్యం తిరుగుతూ ఉంటాయి. బస్సు మార్గమే కాకుండా గ్రామం నుండి 7కి.మీ దూరంలో గల మండల కేంద్రం కొణిజర్లకు ఆటోరిక్షాలు కూడా ఎల్లవేళాలా అందుబాటులో ఉంటాయి. అలాగే గ్రామం నుండి సమీపాన గల ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయంతో పాటు చక్కని రవాణా సౌకర్యం కూడా గలదు.

గ్రామానికి సరిహద్దు గ్రామాలుః నేరడ, కొమట్లగూడెం, బొట్లకుంట, చిన్న గొపతి, పెద్ద మునగాల

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామ అవసరాలను తీరుస్తున్నది. ఇంకా గ్రామంలో మెడికల్ షాపుతో పాటు గ్రామీణ వైద్యులు కూడా కలరు.

తపాలా సౌకర్యం[మార్చు]

గ్రామంలో పోస్టాపిస్ కలదు

గ్రామములో రాజకీయాలు[మార్చు]

పెద్దగొపతి గ్రామం రాజకీయాంగా అన్ని పార్టీలకు ఒక వేదిక. ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా, టీఆర్ఎస్ మరియు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మన్నన పొందుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ ప్రతి సారి జరిగే ఎన్నికలలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మద్యనే పోటి నెలకొనిఉంటుంది. రెండు దశాబ్దాలు పైగానే ఈ గ్రామంలోని ప్రజలు రాజకీయ చైతన్యం పొందారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామానికి ప్రధాన అకర్షణ నాగార్జున సాగర్ కాలువ. సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలని సస్యశ్యామలం చేసిన ఈ కాలువ పెద్దగొపతి గ్రామం నడిమద్యన ప్రవాహిస్తుండటం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. కాలువ మీద కట్టిన లాకులు దాని పక్కనే ఒక పెద్ద చెరువు (దీనిని పాంచెరువు అంటారు) మరో ప్రదాన అకర్షణ. వీటితో పాటు గ్రామంలో రెండు అంజనేయ స్వామి ఆలయాలు ఒకటి ఊరికి ఒక పక్క ఇంకోకటి మరో పక్క ఉంటూ గ్రామాన్ని కంటికి రెప్పాలా కాపాడుతున్నాయి. అలాగే క్రైస్తవుల కోసం ఎప్పూడో కట్టిన ఒక చర్చి కూడా దర్శనీయ స్థలమే. ఇవే కాక చుట్టూ పచ్చని పంట పోలాలతో ఈ గ్రామం ఎప్పుడు కొనసీమకు దగ్గరగా ఉండే ప్రాంతంలా కనిపిస్తుంటుంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పండించే ప్రధాన పంటలు వరి, మొక్కజోన్న, ప్రత్తి, మిర్చితో పాటు మామిడి సాగు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలోని ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయ సంబదిత వృత్తులనే నమ్ముకున్నారు. కమ్మరి, వండ్రంగి, కంసాలి, కల్లుగీత, మంగళి ఇలా ప్రతి ఒక్క వృత్తుల వారు ఉన్నారు.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామ పంచాయితీ పరిదిలో కల అనంతారం గ్రామం నుండి రాష్ట్ర మంత్రిగా దివంగత కీసర అనంతరెడ్డిగారు పనిచేశారు. 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి కీసర అనంతరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక గ్రామంలోని ప్రముఖులు వడ్డె కొటయ్య, నల్లమోతు భద్రయ్య, తాళ్ళూరి పెద్ద పుల్లయ్య, తాళ్ళూరి చిన్న పుల్లయ్య, సామినేని నర్సయ్య, వడ్డె నారాయణ రావు, ప్రతాపనేని లక్ష్మయ్య, ప్రతాపనేని నరసింహరావు, స్వర్ణ సుబ్బారావు, చింతనిప్పు వెంకయ్య,

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]