పెద్దన్నవారిపల్లె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్దన్నవారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తలుపుల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,007
 - పురుషుల సంఖ్య 1,973
 - స్త్రీల సంఖ్య 2,034
 - గృహాల సంఖ్య 1,096
పిన్ కోడ్ 515581
ఎస్.టి.డి కోడ్

పెద్దన్నవారిపల్లె, అనంతపురం జిల్లా, తలుపుల మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 515581. "పెద్దన్నవారి పల్లి " అనుపేరు "అన్నం" అను ఇంటి పేరుగల వారి పేరు మీదుగా వచ్ఛినట్లు తెలుస్తున్నది. ఈ ఊరికి ఉత్తరాన చిన్నన్నవారి పల్లి, హరిజనవాడ, పడమర గాలివాండ్లపల్లి, దక్షిణాన దేవలానాయక్ తాండా మరియు తూర్పున వేమలగొంది అను పల్లెలు ఉన్నాయి. " అన్నం " అని పేరుగా గలవారు ఇద్దరు అన్నదమ్ములు అని, రెండుగా విడిపోయి చిన్న అన్నంవారు చిన్నన్నవారి పల్లెలోనూ, పెద్ద అన్నం వారు పెద్దన్నవారి పల్లి లోనూ స్థానిక నివాసం ఏర్పరచుకొన్నారు. రెండు ఊళ్లలోనూ ఇప్పటికి "అన్నం" అనుపేరుగల వారు ఉన్నారు. కాగా పెద్దన్నవారి పల్లి యందు జరుగు అన్ని జాతరలకు పెద్దన్నం వారి ఇంటి నుండి మొదటి టెంకాయ కానీ, ఇతర ప్రారంభ కార్యక్రమాలు గాని జరగడం ఇప్పటికి ఆనవాయితి.

జనాభా[మార్చు]

వృత్తులు :ప్రధాన వృత్తి : వ్యవసాయం. ఈత బర్రలతో గంపలు అల్లడం. కుండల తయారి, చాకలి, పంటలు: ప్రధాన పంట: వేరుశనగ., ఉలవ. జొన్న పండిస్తారు. నీటి వసతి క్రింద వరి, కళింగర (పుచ్ఛకాయ), ప్రొద్దుతిరుగుడు ( సూర్యకాంతి) పండిస్తారు. అంతర పంటలుగా కంది, పెసర, అలసంద (బొబ్బరలు) అనప ప్రధానంగా పండిస్తారు. పండుగలు: ఈ ఊరి వారు ఘనంగా జరుపు కొనే పండుగలలో దోశలమ్మ పండుగ. మత సామరస్యానికి భూమిక అయిన మొహరం పండుగను అన్ని కులాల వారు కలిసి కట్టుగా సంబరంగా జరుపుకుంటారు. ఇంకా ఉగాది, శ్రీరామ నవమి జరుపుకుంటారు. ఇంకా వానలు ఆలస్యం అయినప్పుడు "వలసదేవర" పండుగ కడు వైభవంగా జురుపుకుంటారు.[2] గ్రీన్ ట్రీ ఫౌండేషన్ : మా ఊరి బడి: కుమ్మర గుంతలు : పొంబాయి: వనం బావి : మంఛినీళ్ళబావి. నంధాలం బావి నీరు. పుట్టం బావి. గాజులం బావి మేడాబావి పాత బడి కొత్తబడి పై బజారు క్రింది బజారు

కళారూపాలు[మార్చు]

ఈ గ్రామం కళాకారులకు పుట్టినిల్లు. చెంచునాటకం జిల్లాలో కేవలం ఈ ఊరు మాత్రమే ప్రదర్షించగలరు. బుర్రకథలు, సుద్దులు, చెప్పేవార కాల క్రమంలో కలిసిపోయారు. ఈ గ్రామంలో హార్మోనియం, తబలా, కంజీరా మొదలగు సంగీత పరికరాలను వాయించగలవారున్నారు. కోలాటం, జక్కీకు, ఉప్పుర పెట్టె ఆటలు ఆడుతారు. కబడ్డీగా చెప్పుకొనే " బలిగూడు" ఆడుతారు. ఛిల్లా కట్టె ఆడుతారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,007 - పురుషుల సంఖ్య 1,973 - స్త్రీల సంఖ్య 2,034 - గృహాల సంఖ్య 1,096

మూలాలు[మార్చు]