Coordinates: 16°41′24″N 79°13′20″E / 16.690132°N 79.222183°E / 16.690132; 79.222183

పెద్దవూర మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దవూర మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

పెద్దవూర
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, పెద్దవూర స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, పెద్దవూర స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, పెద్దవూర స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°41′24″N 79°13′20″E / 16.690132°N 79.222183°E / 16.690132; 79.222183
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం పెద్దవూర
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 288 km² (111.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 67,959
 - పురుషులు 34,322
 - స్త్రీలు 33,637
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.61%
 - పురుషులు 63.82%
 - స్త్రీలు 38.55%
పిన్‌కోడ్ 508266

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం పెద్దవూర.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 67,959 - పురుషులు 34,322 - స్త్రీలు 33,637

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 288 చ.కి.మీ. కాగా, జనాభా 54,877. జనాభాలో పురుషులు 27,466 కాగా, స్త్రీల సంఖ్య 27,411. మండలంలో 13,964 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
 1. పిన్నవూర
 2. గర్నెకుంట
 3. వెల్మగూడ
 4. కొత్తలూరు
 5. తమ్మడపల్లి
 6. శిరసనగాండ్ల
 7. లింగంపల్లి
 8. తెప్పలమడుగు
 9. చింతపల్లి
 10. పెద్దవూర
 11. సంగరం
 12. పోలేపల్లి-ఎమ్-సింగారం
 13. పొత్నూరు
 14. పులిచర్ల
 15. ఉట్లపల్లి
 16. పర్వేదుల
 17. చలకుర్తి
 18. తుంగతుర్తి
 19. విజయపురి నార్త్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

ఇన్‌టెక్‌ వెల్‌

[మార్చు]

హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత రానీయకుండా నీటి సరఫరా చేసేందుకు పెద్దవూర మండలంలోని సుంకిశాల గ్రామ సమీపంలో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 1,453 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇన్‌టెక్‌ వెల్‌ పనులకు 2022 మే 14న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖామంత్రి సీహెచ్ మల్లా రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, విద్యుత్ శాఖామంత్రి జి. జగదీష్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జలమండలి చైర్మన్ దాన కిషోర్, ఈడి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.[4][5]

పల్లె గాంధీ

[మార్చు]

పెద్దవూర మండలంలోని పొట్టివానితండా గ్రామ పంచాయతీ ఏనెమీదితండాకు చెందిన బోజ్యనాయక్‌ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ఒంటిపై చొక్కా లేకుండా చేతి కర్రతో వివిధ తండాలు తిరుగుతూ ప్రజలు సమస్యలు పరిష్కరించేవారు. ఇతనిని స్థానికులు పల్లె గాంధీగా పిలిచేవారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన రామాంజచార్యులు చేతుల మీదుగా గిరిజన గాంధీ అవార్డును అందుకున్నాడు. 109 ఏళ్ళ వయసులో బోజ్యనాయక్‌ 2021 డిసెంబరు 25న తుదిశ్వాస విడిచారు.[6]

మూలాలు

[మార్చు]
 1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nalgonda.pdf
 2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
 4. telugu, NT News (2022-05-14). "2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్ : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
 5. Mustafa, Gulam (2022-05-13). "KTR to launch intake well station at Sunkishala". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
 6. "పల్లె గాంధీ ఇక లేరు". EENADU. Retrieved 2022-01-07.

వెలుపలి లంకెలు

[మార్చు]