పెద్దాపురం పట్టణం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?పెద్దాపురం
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°05′N 82°08′E / 17.08°N 82.13°E / 17.08; 82.13
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) తూర్పు గోదావరి
జనాభా 45,174 (2001 నాటికి)


పెద్దాపురం పట్టణం, దక్షిణ భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రసిద్ధ పురాతన మునిసిపల్ పట్టణము.

భౌగోళికం[మార్చు]

పెద్దాపురం పట్టణం17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

జనాభా[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం పట్టణ జనాభా 45,174. ఇందులో 49% మగవారు 51% ఆడవారు ఉన్నారు. పెద్దాపురం పట్టణంలో అక్షరాస్యతా శాతం 63%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 66%, మరియు స్త్రీల అక్షరాస్యతా శాతం 59%. 6 సం.ల లోపు ఉన్న పిల్లల శాతం 11%.

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర[మార్చు]

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్రలో పెద్దాపురము గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము... యిక్కడనుంచి రెండుగంటలకు భయిలువెళ్ళి నాలుగు కోసులదూరములోనుండే పెద్దాపురము 6 గంటలకు చేరినాను. యీ మధ్యాహ్నము నడిచిన దోవ పల్లపు పారు గనుకనున్ను భూమి రేగడ గనుకనున్ను యీదినము వర్షము కురిశినందుననున్ను అడుసునీళ్ళుగా వుండినందున చాలా జారుచూ వచ్చింది. యీ నడమ యేలా అనే ఒక చిన్ననది కాలినడకగా దాటినాము. ఈ నది చిన్నదయినా మిక్కిలి తీక్ష్ణమయిన వేసంగికాలములయందున్ను, అనావృష్టి దోషాలు కలిగినప్పుడున్ను వొక్కరీతిని మిట్టను ప్రవహింపుచున్నది. పిఠాపురము పెద్దాపురము జమానుదారులు తాలుకాలవారు వంతుల ప్రకారము యేటి నీళ్ళు అడ్డకట్టి తమ గ్రామాదులకు తెచ్చుకోవడము చేత వీరి తాలూకాలలో యెల్లప్పుడు పంటలు సమృద్ధిగా గలిగియున్నవి.

పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. 100 బ్రాహ్మణుల యిండ్లు ఉన్నాయి. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా 3 లక్షలది. అంగళ్ళు ఉన్నాయి. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో 3 సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని ఒక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను.

పెద్దాపురము పట్టణ జనాభా:

మొత్తము
మొత్తము జనాభా: 45,174
పురుషులు: 22,308
స్త్రీలు: 22,866
6 సం. లోపు పిల్లలు: 4,815
6 సం. లోపు మగ పిల్లలు: 2,453
6 సం. లోపు ఆడ పిల్లలు: 2,362
మొత్తము అక్షరాస్యులు: 28,271
మొత్తము నిరక్షరాస్యులు: 16,903

ప్రాశస్త్యము[మార్చు]

పెద్దాపురం ఒక సాంస్కృతిక, చరిత్రక పురాతన పట్టణము. పెద్దాపురం పట్టణమునకు మునిసిపాలిటి హొదా 1915 లోనే ఇవ్వబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భీమునిపట్టణం తరువాత రెండవ అతి పురాతన మునిసిపాలిటి.

పెద్దాపురం పట్టణములో మరిడమ్మ తల్లి దేవాలయం[1] ఉంది. ప్రతీ సంవత్సరం ఆషాఢమాసములోఒక నెల పాటు జాతర జరుపబడును. ఈ ఆషాఢ మాసము మొత్తం పెద్దాపురం పట్టణములో పండుగ వాతావరణము కనపడును. ప్రతీ ఆదివారం పట్టణములోని ఒక్కొక్క వీధి చొప్పున వంతుల వారీగా సంబరము జరుపుదురు.

పెద్దాపురం పట్టణములో ప్రతి ఆదివారం జరిగే *పెద్దాపురం సంత ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. బ్రిటిషువారి కాలం నుండి ఇక్కడ అనాదిగా వర్తకము జరుగుచున్నది. చుట్టు ప్రక్కల గ్రామముల వారు ఈ సంతలో వస్తువులు కొనుగోలు చేయుదురు.

పెద్దాపురానికి సామర్లకోట అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను.

పెద్దాపురం పట్టణములో *జనాబ్ మదీనా పాష్ఛా ఔలియా ( తొమ్మిది మూరల సాహెబ్ ) దర్గా ఉంది. ప్రతీ సంవత్సరం జనవరి నెల 20వ తారీఖున గందోత్సవము (ఉరుసు) జరుగును. కుల, మత తారతమ్యం లేకుండా అన్ని మతములవారు ఈ ఉత్సవములో పాల్గొందురు.ఈ ప్రదేశము దర్గా సెంటర్ అని ప్రసిద్ధి చెందినది.

ఇక్కడ ఉన్న వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో రాగి మరియు కర్ర పెండలం మీద పరిశోధన జరుపుతున్నారు. ఈ పరిశోధనా క్షేత్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం పరిధిలోకి వస్తుంది.

19వ శతాబ్దములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే *లూధరన్ హై స్కూల్ స్థాపించబడింది.

పెద్దాపురం పట్టణములో బహుళ ప్రాశస్త్యము పొందిన శ్రీ రాజా వత్సవాయి జగపతి బహద్దూర్ మహారాణి కళాశాల కలదు. దీనిని 1967 లో అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్ష్యులు శ్రీ బలుసు పి.బి.కే. సత్యనారాయణ రావు గారు, పెద్దాపురం సంస్థానం మహారాణి బుచ్చి సీతయమ్మ గారి జ్ఞాపకార్ధము ప్రారంబించారు.

7వ పంచవర్ష ప్రణాళికా కాలంలో శ్రీ .పి.వి.నరసింహారావు గారి చొరవతో, ప్రతిభ గల గ్రామీణ ప్రాంతమునకు చెందిన విద్యార్థులకు మంచి విద్యను అందించుటకు, ప్రతీ జిల్లాకు ఒక్కటి చొప్పున, *జవహర్ నవోదయ విద్యాలయ ప్రారంబించారు.అందున పెద్దాపురం పట్టణము ఎన్నిక కాబడింది. పెద్దాపురం పట్టణములో గల *పాండవుల మెట్ట మీద గల జవహర్ నవోదయ విద్యాలయ దేశంలోనే మొదటి 10 స్థానములలో ఒకటి.

పెద్దాపురంలో గల పాండవుల మెట్టకు పౌరాణిక కథనం ఉంది. ఇచ్చట భీముడు (పాండవులు) యొక్క పాద ముద్రలు, పురాతన గుహలు చూడవచ్చు.

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గము[మార్చు]

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు

ఎం.యల్.ఏగా ఎంపిక కాబడిన వ్యక్తులు:

 • 1955 - దూర్వాసుల వెంకట సుబ్బారావు(సి.పి.ఐ)
 • 1962 - పంతం పద్మనాభం (కాంగ్రెస్)
 • 1967 - వుండవల్లి నారాయణ మూర్తి (సి.పి.ఐ)
 • 1972 - కొండపల్లి కృష్ణమూర్తి (కాంగ్రెస్)
 • 1978 - వుండవల్లి నారాయణ మూర్తి (కాంగ్రెస్ (ఐ) )
 • 1983 - బలుసు రామారావు (తెలుగు దేశం)
 • 1985 - బలుసు రామారావు (తెలుగు దేశం)
 • 1989 - పంతం పద్మనాభం (కాంగ్రెస్)
 • 1994 - బొడ్డు భాస్కర రామారావు (తెలుగు దేశం)
 • 1999 - బొడ్డు భాస్కర రామారావు (తెలుగు దేశం)
 • 2004 - తోట గోపాల కృష్ణ (కాంగ్రెస్)
 • 2009 - పంతం గాంధీ మోహన్ (ప్రజా రాజ్యం)
 • 2014 - నిమ్మకాయల చినరాజప్ప (తెలుగుదేశం)

చూడదగిన ప్రదేశాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]