పెద్ద పప్పూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెద్ద పప్పూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం తాడిపత్రి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ ఊరి పేరు పెద్ద పప్పూరు. ఈ ఊరు అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా లో ఉంది. ఈ ఊరిలో ఎక్కువగా నేతపని వాళ్ళు ఉంటారు. ధర్మ వరం పట్టు చీరలు చాలా ప్రసిద్ధి చెందినవి.అటువంటి ధర్మ వరం పట్టు చీరల్లో చాలా వరకు పెద్దపప్పూరులో నేయబడ్డ చీరలే ఉంటాయి. ఈ ఊరిలో పండుగలు చాలా బాగా కులమతాలకతీతంగా జరుపుకుంటారు. మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. మండలంలో చాలా కాలం క్రితం ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు. ఇక దేవాలయాల విషయంలో అయితే ఈ ఊరిలో అశ్వర్థ నారాయణ స్వామి దేవాలయం,శ్రీ చక్రభీమలింగేశ్వస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందాయి.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

  • అశ్వర్థ నారాయణ స్వామి దేవాలయం  : మండలంలోని చిన్నపప్పూరు గ్రామ సమీపంలో వెలసిన అశ్వర్థనారాయణస్వామి, శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాఘమాసం చివరి ఆదివారం అశ్వర్థ క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. వేదపండితులు స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, ఆకుపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరిస్తారు. తెల్లవారు జాము నుంచి భక్తులు కోనేరులో మాఘస్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరుతారు. వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులబండ్లు, ట్రాక్టర్లలో భక్తులు హాజరై పెన్నానదిలో పాలపొంగులు నిర్వహించి స్వామి వారికి నైవేద్యం, బియ్యం బేడలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భీమలింగేశ్వర ఆలయ ఆవరణలో మహిళలు మాఘమాస దీపాలను వెలిగిస్తారు. భక్తుల సౌకర్యార్థం. ఆలయ ఆవరణలో వాసవీ ఆర్య వైశ్య సేవా సంస్థ, శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ఏటా అన్నదానం నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది.

గణాంకాల వివరాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]