పెద్ద వాల్తేరు
పెద వాల్తేరు | |
---|---|
రెవెన్యూ గ్రామం, మహా విశాఖ నగర పరిధిలోని ఒక ప్రాంతం | |
పెద వాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ దేవాలయం | |
నిర్దేశాంకాలు: 17°43′59″N 83°19′56″E / 17.732943°N 83.332220°ECoordinates: 17°43′59″N 83°19′56″E / 17.732943°N 83.332220°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | స్థానిక స్వపరిపాలన |
• నిర్వహణ | మహా విశాఖ నగర పాలక సంస్థ |
భాష | |
• అధికార భాష | తెలుగు |
కాలమానం | UTC+5:30 (టైం జోన్) |
పిన్కోడ్ | 530017 |
పెద వాల్తేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం (అర్బన్) మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం,ఇది గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెందిన తీరప్రాంతంలో కలిగి ఉన్న ప్రాంతం,ఇది నగర కేంద్రంగా ఉన్న ద్వారకా నగర్ నుండి సుమారు 5 కి.మీ.దూరంలో ఉంది.విశాఖపట్నం నగరం ఉత్తర భాగంలో ఉంది.[1]
గ్రామ పేరు వెనుక చరిత్ర[మార్చు]
పెద వాల్తేరు అనే పేరు 18 వ శతాబ్దంలో విశాఖపట్నంలో కలెక్టర్‌గా పనిచేసిన బ్రిటిష్ అధికారి పేరు వాల్టెయిర్ నుండి వచ్చింది.
దేవాలయాలు[మార్చు]
పెద వాల్తేరు ప్రాంతంలో పోలమాంబ దేవాలయం ఉంది.ఈ దేవాలయాన్ని కరకచెట్టు పోలమాంబ దేవాలయం అని కూడా అంటారు.ఈ ఆలయంలో ప్రతిష్టించిన పోలమాంబ అమ్మవారి విగ్రహం సుమారు 2019 నాటికి 900 వందల సంవత్సరాల క్రితం చేపల వేటకు వెళ్లిన జాలర్లుకు విశాఖ సముద్ర తీరంలో లభించినట్లు తెలుస్తుంది.మొదట ఈ అమ్మ వారి విగ్రహాన్ని జాలరిపేటలో నెలకొల్పి పూజించారు.ఆ తరువాత కొంత కాలానికి విగ్రహాన్ని పెదవాల్తేరులోని కరక్కాయ చెట్టు క్రింద విగ్రహాన్ని ప్రతిష్టంచబడింది.అప్పటి నుండి కరకచెట్టు పోలమాంబ అమ్మవారుగా పేరుబడింది. దుర్గాదేని అవతారంగా పోలమాంబ అమ్మవారిని భక్తులు భావిస్తారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు పోలమాంబ అమ్మవారని ఆరాధ్యదైవంగా భావిస్తారు.
మూలాలు[మార్చు]
- ↑ Sarma, G. v Prasada (2018-09-15). "24x7 water supply scheme to cover 10,000 households". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-05-03.