పెప్సికో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
PepsiCo
రకంPublic (NYSE: PEP)
స్థాపితంNew Bern, North Carolina, U.S. (1898)
వ్యవస్థాపకు(లు)Caleb Bradham
Donald M. Kendall
Herman W. Lay
ప్రధానకార్యాలయంPurchase, New York, U.S.
సేవా ప్రాంతముWorldwide
కీలక వ్యక్తులుIndra Nooyi
(Chairperson and CEO)[1]
పరిశ్రమFood
Beverages
ఉత్పత్తులుPepsi
Diet Pepsi
Mountain Dew
AMP Energy
Aquafina
Sierra Mist
SoBe
Starbucks Frappuccino
Lipton Iced Tea
7up
Mirinda
Izze
Tropicana Products
Copella
Naked Juice
Gatorade
Propel Fitness Water
Quaker Oats Company
Lay's
Doritos
Cheetos
Kurkure
Fritos
Rold Gold
Ruffles
Tostitos
Slice
ఆదాయం US$44.3 billion
నిర్వహణ రాబడి US$7.3 billion
మొత్తం ఆదాయము US$6.24 billion
ఆస్తులుIncrease US$39.8 Billion (FY 2009)[2]
మొత్తం ఈక్విటీIncrease US$16.8 Billion (FY 2009)[2]
ఉద్యోగులు203,000 (2010)
విభాగాలుPepsiCo Americas (PepsiCo Ameri Food, PepsiCo Americas Beverages), PepsiCo International
వెబ్‌సైటుPepsiCo.com

పెప్సికో, ఇన్కార్పోరటేడ్, (NYSE: PEP) ఒక ఫార్చూన్ 500, అమెరికన్ బహుళజాతి సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూ యార్క్ లోని పర్చేస్ లో ఉంది. పలు రకాల కార్బోనేటడ్ మరియు నాన్-కార్బోనేటడ్ పానీయాలు, ఉప్పని, తీయని మరియు తృణధాన్యాల చిరుతిండిలు మరియు ఇతర ఆహార పదార్థాలను ఉత్పత్తి మరియు విక్రయం చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య వ్యాపారం. పెప్సి బ్రాండ్ తో పాటు, క్వాకేర్ ఓట్స్, గటోరెడ్, ఫ్రిటో-లే, సోబే, నేకడ్, ట్రోపికాన, కోపేల్ల, మౌన్టన్ డ్యూ, మిరిండా మరియు 7 అప్ (USA కు బయట) బ్రాండ్ లు కూడా ఈ సంస్థవే.

2006 నుంచి సంస్థ యొక్క ముఖ్య కార్య నిర్వాహణాధికారిగా ఇంద్రా కృష్ణమూర్తి నూయి వ్యవహరిస్తున్నారు. సంస్థ యొక్క పానీయాల పంపిణి మరియు బాట్లింగ్ పనులను అనుబంధ సంస్థలైన ది పెప్సి బాట్లింగ్ గ్రూప్ (NYSE: PBG) మరియు పెప్సి అమెరికాస్ (NYSE: PAS) చేపట్టుతున్నాయి. పెప్సికో ఒక SIC 2080 (పానీయాలు) సంస్థ.

చరిత్ర[మార్చు]

పర్చేస్, న్యూ యార్క్ లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఈ సంస్థ యొక్క పరిశోధనా మరియు అభువృద్ధి రంగ ప్రధాన కార్యాలయం వల్హల్లలో ఉంది. పెప్సి కోలా అనే పేరుతొ ఈ సంస్థను 1898లో ఒక NC ఫార్మసిస్ట్ మరియు వ్యాపారవేత్త అయిన కాలేబ్ బ్రాధం స్థాపించాడు. ఈ సంస్థ 1965 లో ఫ్రిటో లే సంస్థతో విలీనం అయినప్పుడే పెప్సికోగా మారింది. 1997 వరకు, KFC, పిజ్జా హాట్, టాకో బెల్ సంస్థలు కూడా ఈ సంస్థ క్రిందే ఉండేవి. అయితే, ఈ ఫాస్ట్-ఫుడ్ రెస్టారంట్ లు ట్రికాన్ గ్లోబల్ రెస్టారంట్స్ అనే కొత్త సంస్థగా వేరు చేయబడ్డాయి. ఈ సంస్థ పేరు ప్రస్తుతం యుం!బ్రాండ్స్, ఇంక్. పెప్సికో 1998లో ట్రోపికాన ను, 2001లో క్వాకేర్ ఓట్స్ ను కొనుగోలు చేసింది. 2005 డిసెంబరు లో, పెప్సికో సంస్థ 112 సంవత్సరాలలో మొదటి సారిగా కోకా-కోలా కంపెనీను మార్కెట్ విలువలో అధికమించింది. [2]

సంస్థాగత పరిపాలన[మార్చు]

పెప్సి-కోలా వెనిజూలా

పెప్సికో సంస్థ యొక్క పాలనా మండలి డైరెక్టర్లుగా ప్రస్తుతం ఉన్నవారు వీరే: ఇంద్రా నూయి C.E.O., రాబర్ట్ ఇ. అల్లెన్, డినా డుబ్లన్, విక్టర్ డ్జయు, రేయ్ లీ హుంట్, అల్బెర్టో ఇబార్గ్వెన్, ఆర్థర్ మార్టినేజ్, స్టీవెన్ రీనెముండ్, షరోన్ రాక్ఫెల్లెర్ జేమ్స్ షిరో, ఫ్రాంక్లిన్ థోమస్, సింథియా ట్రుడెల్, మరియు రివెర్ కింగ్.

2006, అక్టోబరు 1 న పూర్వ ప్రధాన ఆర్థిక వ్యవహారాల అధికారి మరియు అధ్యక్షురాలుగా ఉన్న ఇంద్రా నూయి, స్టీవ్ రీనెముండ్ స్థానంలో ప్రధాన కార్యనిర్వాహణ అధికారిగా నియమితులయ్యారు. నూయి సంస్థ యొక్క అధ్యక్షురాలుగా కొనసాహిస్తూ, మే 2007లో పాలక మండలి అధ్యక్షుడురాలుగా నియమితలయ్యారు.

పెప్సి-కో అంతర్జాతీయ విభాగానికి అధ్యక్షుడుగా మిల్క్ వైట్ ఉన్నారు.

పెప్సికో లో పని చేసిన పూర్వ ముఖ్య అధికారులు[మార్చు]

 • స్టీవెన్ రీనేముండ్
 • రోజేర్ ఎన్రికో
 • D. వెన్ కల్లోవే
 • జాన్ స్కల్లీ
 • మైకేల్ హెచ్. జోర్డాన్
 • డోనాల్డ్ ఎం. కేండాల్
 • క్రిస్టోఫర్ ఎ. సింక్లైర్
 • అల్ఫ్రెడ్ స్టీల్

లాబీయింగ్[మార్చు]

USలో, పానీయాల పరిశ్రమకు అనుకూలమైన చట్టాలను రూపొందించడానికి తమ పోటీ సంస్థ అయిన కోకా కోలా కంపెనీతో పాటు కలిసి పెప్సికో ఒక పెద్ద లాబీయింగ్ శక్తిగా ఉంది. లాబీయింగ్ కొరకు పెప్సికో 2005లో $740,000, 2006లో $880,318, 2007లో $1 మిలియను మరియు 2008లో $1,176,000 ఖర్చు పెట్టింది. 2009లో లాబీయింగ్ ఖర్చు దాదాపు 300 శాతం పెరిగి $4.2 మిలియనుకు పెరిగింది. లాబీయింగ్ ఖర్చుల్లో పెద్ద భాగం ఆల్కహాల్ లేని పనేయాల పై పెరుగుతున్న పన్నులకు వెతిరేకంగా పోరాడడానికి వాడబడుతుంది.[3] 2009 సంవత్సరానికి తమ తరఫున 31 లాబీయిస్ట్ లను 8 వివిధ సంస్థలలో పెప్సికో ఏర్పాటు చేసింది.[4]

పెప్సి మ్యూజిక్[మార్చు]

 • పెప్సి మ్యూజిక్ అనేది యాహూలో ప్రదర్శించబడుతున్న ఒక ప్రచార సంగీత లేబల్. దీనిలో పలు బాగాలు ఉన్నాయి. దానిలో ఒకటైన పెప్సి మైక్ పాస్ అనేది హౌస్టన్, టెక్సాస్ లో చాలా ప్రసిద్ధం. ఇది పెప్సి మరియు ఇతర పెప్సికో ఉత్పాదితాల ప్రచారాల కొరకు కళాకారులను కూడా ఒప్పందం చేసుకుంటుంది.
 • లాటినో ఛానల్ Mun2 లో పెప్సి మ్యూసికా అనే కార్యక్రమంలో పెప్సి మ్యూసికా ప్రసారమవుతుంది.
 • గ్రీన్ లేబల్ సౌండ్ అనేది మౌన్టన్ డ్యూ యొక్క రికార్డ్ లేబల్. ఇది అన్సైండ్ కళాకారుల పాటలను ప్రచారం చేస్తూ వాటిని ఉచిత డౌన్లోడ్ లను అందిస్తుంది.

పెప్సికో బ్రాండ్ లు[మార్చు]

5 వివిధ బిలియన్ డాలర్ల బ్రాండ్లు పెప్సికో సాంతం. అవి పెప్సి, ట్రోపికానా, ఫ్రిటో-లే, క్వేకేర్, మరియు గటోరెడ్. ఇంకా పలు ఇతర బ్రాండ్ లు ఈ సంస్థకు సొంతం.

 • పెప్సి, కెఫిన్-ఫ్రీ పెప్సి, డైట్ పెప్సి/పెప్సి లైట్, కెఫిన్-ఫ్రీ డైట్ పెప్సి, కెఫిన్-ఫ్రీ పెప్సి లైట్, వైల్డ్ చెర్రీ పెప్సి, పెప్సి లైం, పెప్సి మాక్స్, పెప్సి ట్విస్ట్ మరియు పెప్సి ONE.
 • ఇతర U.S. కార్బోనేటడ్ పానీయాలు, మౌంటైన్ డ్యూ, క్రష్, మగ్ రూట్ బీర్, సియరా మిస్ట్, ట్రోపికానా ట్విస్టర్ సోడా మరియు ఫ్రాగ్.
 • 7 అప్ (ప్రపంచవ్యాప్తంగా, USA కు బయట)
 • ఇతర U.S. పానీయాలు, ఆక్వాఫినా (ఫ్లావర్ స్ప్లాష్, ఆలివ్, మరియు ట్విస్ట్/బర్స్ట్), టావా, డొల్, గటోరెడ్, ఇజ్జే, AMP ఎనర్జి, ప్రొపెల్ ఫిట్నస్ వాటర్, సోబే, క్వాకేర్ మిల్క్ చిల్లెర్స్, మరియు ట్రోపికానా
 • U.S.కు బయట విక్రయించబడుతున్న పానీయాలు: అల్వల్లె, కాంకర్డియా, కోపెల్ల, ఎవేర్వేస్స్, ఫియస్టా, ఫ్రూ'విట, ఫ్రుకో, H2OH!, ఐవి, జూన్కనూ, కాస్, లూజా, మంజాన కరోన, మంజానిట సోల్, మిరిండా, పసో డి లోస్ టోరోస్ (పానీయం), రాడికల్ ఫ్రూట్, సాన్ కార్లోస్, ష్విప్ ష్వాప్, షని, టీం, ట్రిపిల్ కోలా, మరియు ఎడిగన్
 • ఫ్రిటో-లే బ్రాండ్ లు: బేకన్-ఇట్స్, బర్సుల్, బోకాబిట్స్, చీస్ ట్రిస్, చీటోస్, చేస్టేర్స్, చిజిటోస్, చుర్రుమిస్, క్రాకేర్ జాక్, క్రుజిటోస్, డోరిటోస్, ఫాన్డాన్గోస్, ఫ్రిటోస్, ఫన్యున్స్, గమెస, గో స్నాక్స్, జేమ్స్ గ్రాండ్మాస్ కుకీస్, హంకాస్, లేస్, మిస్ వికీస్, మన్చీస్, మన్చోస్, ఒల్లీస్ మీట్ స్నాక్స్, క్వావేర్స్, రోల్డ్ గోల్డ్, రఫ్ఫ్లేస్, రస్లర్స్ మీట్ స్టిక్స్, సబ్రిటాస్, సాబ్రిటోన్స్, సండోర, సంటిటాస్, స్మార్ట్ ఫుడ్, ది స్మిత్స్ స్నాక్ఫుడ్ కంపెనీ, సొంరిక్స్, స్టేస్ పీట చిప్స్, సన్ చిప్స్, టోర్-టీస్, కుర్కురే, టోస్టిటోస్, వాకేర్స్, మరియు వోట్సిట్స్
 • క్వాకేర్ ఓట్స్ బ్రాండ్ లు: ఆంట్ జేమిమ, కేప్'n క్రంచ్, చూయి గ్రనోల బార్స్, కొక్విరో, క్రిస్ప్'అమ్స్, క్రుస్లి, ఫ్రేస్క్అవెన, కింగ్ విటమన్, లైఫ్, ఒట్సో సింపుల్, క్వాక్, క్విస్ప్, రైస్-ఎ-రోని, మరియు స్పుడ్జ్
 • 2005లో వియత్నాంలో[5] మరియు పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ & మలేషియా వంటి కొన్ని ఆసియా దేశాలలో స్టింగ్ ఎనేర్జి డ్రింక్ (కార్బోనేటడ్) ను ప్రవేశ పెట్టింది.
 • 2007లో, కలిఫోర్నియా లోని సోయా పానీయాలు మరియు ఆర్గానిక్ జూస్ బ్రాండ్ అయిన నేకడ్ జూస్ వంటి ఆరోగ్యకరమైన బ్రాండ్ ల కొరకు, నూయి $1.3 బిలియను వెచ్చించారు.

సబ్రా డిప్పింగ్ కంపెనీ అనే ఒక U.S. సంస్థలో 50% వాటాను ఇటీవల పెప్సికో కొనుగోలు చేసింది.[6]

భాగస్వామ్యాలు[మార్చు]

తమకు సొంతం కాని పలు బ్రాండ్లతో పెప్సికో బాగస్వామ్యం ఏర్పరుచుకుంది. వీటిని పంపిణి చేయడము లేదా తమ బ్రాండ్ లతో కలిపి విక్రయించడమే దీని ఉద్దేశం.

 • ఫ్రాప్పుక్కినో
 • స్టార్బక్స్ డబిల్ షాట్
 • స్టార్బక్స్ ఇస్ద్ కాఫీ
 • మాండరిన్ (లైసెన్స్)
 • డి&జి (లైసెన్స్)
 • లిప్టన్ బ్రిస్క్
 • లిప్టన్ ఒరిజినల్ ఇస్ద్ టీ
 • లిప్టన్ ఇస్ద్ టీ
 • బెన్ & జేర్రీస్ మిల్క్ షేక్స్
 • డొల్ జూస్ లు & జూస్ పానీయాలు (లైసెన్స్)
 • సన్నీ డిలైట్ (సన్నీ డిలైట్ బెవేరేజస్ కొరకు పెప్సికో తయారు చేస్తుంది)
 • FRS[7]

నిలిపివేయబడిన ఉత్పత్తులు[మార్చు]

 • టీం-స్ప్రైట్ మరియు 7up కు పోటీగా పెప్సి రూపొందించిన పానీయం. పెప్సికో 7up ను కొనుగోలు చేసిన తరువాత ఇది నిలిపివేయబడింది.
 • ఆల్ స్పోర్ట్, క్రీడా పానీయం ఆల్-స్పోర్ట్ కొద్దిగా కార్బోనేట్ చేయబడిన పానీయం; అయితే పోటీ పానీయాలైన గటోరేడ్ మరియు కోక్ వారి పవరేడ్ కార్బోనేట్ చేయబడని పానీయాలు. 2001లో సంస్థ క్వేకేర్ ఓట్స్ ను కొనుగోలు చేయడంతో (దాని ద్వారా గటోరెడ్ ను) ఆల్ సపోర్ట్ పానీయం అవసరం లేకుండా పోవడంతో, ఆ బ్రాండ్ మరొక సంస్థకు విక్రయించబడింది.
 • అస్పెన్ సోడా, ఒక ఆపిల్-రుచి కలిగిన పానీయం (1970ల ఆకరి- 80'ల ఆరంభం)
 • క్రిస్టల్ పెప్సి, పెప్సి-కోలా యొక్క నిర్మలమైన రకం.
 • ఫ్రూట్ వర్క్స్: స్ట్రాబెర్రీ మెలాన్, పీచ్ పపాయ, టాన్జేరిన్ సిట్రస్, ఆపిల్ రాస్ప్ బెర్రీ, మరియు పింక్ లేమోనేడ్ రుచిలు. మరో రెండు రుచిలు, పాషన్ ఆరంజ్ మరియు గోవా బెర్రీ హవైలో మాత్రమే అందుబాటులో ఉండేవి.
 • జోస్టా: 1995 లో ప్రవేశపెట్టబడింది "గుఅరణ తో పాటు," USలో ప్రముఖ పానీయాల సంస్థ ప్రవేశ పెట్టిన మొదటి శక్తి పానీయం.
 • మాటిక: ఆగస్టు 2001లో లభించిన ఈ పానీయం టీ/జూస్ లకు ఒక ప్రత్యామ్నాయ పానీయం. కేన్ చక్కర ఇచ్చే తీపినముతో ఉంటుంది. గిన్సేంగ్ కలిగి ఉంది. డ్రేగన్ ఫ్రూట్ పోషన్, మేజిక్ మొంబిన్, మితికల్ మ్యాంగో, రైసింగ్ స్టార్ ఫ్రూట్, స్కైహై బెర్రీ.
 • మజాగ్రాన్: 1995లో ప్రవేశపెట్టబడింది.
 • Mr. గ్రీన్ (సోబే)
 • పాటియో (సోడా): ఫ్లేవర్డ్ పానీయాలు (1960-'70ల ఆకరి)
 • పెప్సి ఎడ్జ్, పెప్సి-కోలా యొక్క మిడ్-కేలరి రకం.
 • పెప్సి బ్లూ, బెర్రీ-ఫ్లేవర్ కలిగిన పెప్సి-కోలా యొక్క నీలి రకం.
 • పెప్సి కోనా: 1997లో ప్రవేశపెట్టబడింది. పెప్సి-కోలా యొక్క కాఫీ-ఫ్లేవర్ రకం.
 • స్మూత్ మూస్: 1995లో ప్రవేశపెట్టబడిన ఫ్లేవర్ కలిగిన పాలు-ఆధారిత పానీయం.
 • స్టాం: 1998 మార్చి 15 న ప్రవేశపెట్టబడింది. దీని స్థానే సియరా మిస్ట్ ప్రవేశపెట్టబడింది.
 • మిరండ లైం: 1990 దశాబ్దము యొక్క రెండవ భాగంలో ప్రవేశపెట్టబడింది (భారతదేశంలో). అయితే విఫమయింది.

పూర్వ బ్రాండ్లు[మార్చు]

పెప్సికో పలు రెస్టారంట్ చైన్ లను నడుపుతూ ఉండేది. అయితే 1997లో ఈ వ్యాపారమునుంది వైతోలిగింది. కొన్నిటిని విక్రయించింది, మిగిలినవాటిని ట్రికాన్ గ్లోబల్ రేస్టారంట్స్ అనే పేరుతొ కొత్త సంస్థగా ఏర్పాటయ్యాయి. దీని ప్రస్తుతం పేరు యుం! బ్రాండ్స్, ఇంక్.. ఇతర పలు బ్రాండ్ లు పెప్సికో వద్ద గతములో ఉండేవి. వాటిని తరువాత విక్రయించేసింది.

 • కాలిఫోర్నియా పిజ్జా కిచన్ (1992లో కొనబడి 1997లో మరల వారికే విక్రయించబడింది)
 • చేవిస్ ఫ్రెష్ మేక్స్ (1993 ఆగస్టులో కొనబడి, 1997 మేలో J. W. చిల్డ్స్ ఈక్విటీ పార్ట్నేర్స్ కు విక్రయించబడింది)
 • డి'ఎంజలో సాండ్విచ్ షాప్స్ (ఆగస్టు 1997 లో పాపా గినోస్ కు విక్రయించబడింది)
 • ఈస్ట్ సైడ్ మరియోస్ (యునైటెడ్ స్టేట్స్ హక్కుదారులు – 1993 డిసెంబరు న కొనబడి 1997 ప్రారంబములో విక్రయించబడింది)
 • హాట్ 'న్ నౌ (1990లో కొనబడి 1997లో విక్రయించబడింది)
 • జోల్లిబీ (1994లో కొనబడి 1997లో విక్రయించబడింది)
 • KFC (1986 అక్టోబరులో RJR నబిస్చో నుంచి కొనబడి, అక్టోబరు 1997లో ట్రికాన్ అనే సంస్థగా మార్చబడింది. అనంతరం మార్చబడిన పేరు యుం! బ్రాండ్స్
 • నార్త్ అమెరికన్ వాన్ లైన్స్
 • పిజ్జా హాట్ (1977లో కొనబడి, అక్టోబరు 1997లో ట్రికాన్ అనే సంస్థగా మార్చబడింది. అనంతరం మార్చబడిన పేరు యుం! బ్రాండ్స్
 • స్టాలిచ్నాయ
 • టాకో బెల్ (1978లో కొనబడి, అక్టోబరు 1997 లో ట్రికాన్ అనే సంస్థగా మార్చబడింది. అనంతరం మార్చబడిన పేరు యుం! బ్రాండ్స్)
 • విల్సన్ సపోర్టింగ్ గుడ్స్

వివిధీకరణం[మార్చు]

2004లో ప్రారంబించబడిన LGBT-అడ్వకేట్ గ్రూప్ హుమన్ రైట్స్ కేమ్పైన్, తమ మూడవ సంవత్సరమ నివేదికలో పెప్సికోకు కార్పరేట్ ఈక్వాలిటి ఇండెక్స్ లో 100 శాతం రేటింగ్ ఇచ్చింది.[8]

టాంపెరింగ్[మార్చు]

1993 వేసవి సమయములో, సంస్థ పానీయాలలో తమేరింగ్ జరిగిందనే మోసపూరిత ఆరోపణను ఎదురుకుంది. డయట్ పెప్సిలో సిరంజీలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముందు సియాటిల్ లో, తరువాత కొన్ని రోజులలో U.S. అంతట ఇదే వార్త వచ్చింది. మోసపూరితంగా ఆరోపించిన పలువురును అడులుపో తీసుకోవడంతో, ఇది సద్దు మణిగింది. 1993 జూన్ 15 నాటికల్ల డయట్ పెప్సి లో, తుపాకి ఒక గుండు, సూదులు, మరమేకులు ఉన్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు. అతి జాగ్రత్తగా రాయబడిన పత్రికా ప్రచారాల ద్వారానూ VNRల ద్వారానూ సంస్థ ఈ వ్యవహారాన్ని పెప్సికో సమర్ధవంతంగా ఎదుర్కుంది. ఒక సంస్థ తమకు వెతిరేకంగా వచ్చిన మోసపూరిత ఆరోపణలను ఎలాగా ఎదురోవలో అనడానికి పెప్సికో దీనిని ఎదురుకొన్న విధానాన్ని మంచి ఉదాహరణంగా చెప్పబడుతుంది.[9] ఎదురుకొన్న విధానం

విమర్శలు[మార్చు]

భారతదేశంలో పెప్సికో[మార్చు]

1988లో పెప్సికో భారతదేశములో ప్రవేశించింది. పంజాబ్ ప్రభుత్వ సంస్థ అయిన పంజాబ్ ఆగ్రో ఇండస్త్రియల్ కార్పరేషన్ (PAIC) మరియు వోల్టాస్ ఇండియా లిమిటెడ్ తో కలిసి ఒక ఉమ్మడి సంస్థగా ఏర్పాటు చేసింది. ఈ ఉమ్మడి సంస్థ 1991 వరకు లేహర్ పెప్సిను విక్రయించడం మరియు అమ్మడం కార్యకాలాపాలను చేపట్టేది; 1994లో బాగస్వామ్య సంస్థలనుండి వారి వాటాలను కొనుగోలు చేసి ఈ ఉమ్మడి సంస్థకు ముగింపు తెచ్చింది.[10] మొదట్లో, పనీయములో ఏమేమి కలిపారో అని చెప్పడానికి నిరాకరించినదానికి 1970లో భారదేశములోకి పెప్సిని దిగుమతి చేయడం నిషేధించబడిందని ఇతరాలు ఆరోపిస్తున్నారు. 1993లో ఈ నిషేధం ఎత్తివేయబడింది. ఆ తరువాత పెప్సి మార్కెట్ లోకి ప్రవేశించింది. "భారతదేశము కొన్ని సార్లు ప్రముఖ బహుళజాతి సంస్థలతో ఘాటైన సంబంధం పెట్టుకుంటుంది" అనడానికి వివాదాలు ఉదాహరణలు. పెప్సికో మరియు ది కొకా-కోలా కంపెనీ, "ప్రముఖ విదేశీ సంస్థలు కావడంతో, తరచూ అవి ప్రధానంగా వెతిరేకించబడుతున్నాయి" అనేది కొందరి వాదన.[11]

2003లో, న్యూ ఢిల్లీ లోని ఒక ప్రభుత్వేతర సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) ఈ విధంగా పెర్కుంది: భారతదేశములో సీతాల పానీయాలు తయారి చేస్తున్న సంస్థలు, ప్రముఖ బహుళజాతి సంస్థలైన పెప్సికో, ది కొకా-కోలా కంపెనీ లతో సహా, తయారు చేస్తున్న ఏరేటడ్ నీళ్ళలో లిండెన్, DDT, మాలాథియాన్ and క్లోర్ పైరిఫోస్ వంటి టాక్సిన్లు ఉన్నాయని చెప్పింది. ఇవి కాసేర్ రోగానికి దారి తీయొచ్చు, రోగ నిరోధిక వ్యవస్థను క్షీణింపచేసే శక్తి కలిగిన మరియు జననములో లోపాలకు దారి తీసే పురుగు మందులు. వేరు పరీక్షించిన పానీయాలలో ఇవి ఉన్నాయి: కోక్, పెప్సి, 7 అప్, మిరిండా, ఫాంటా, తమ్స్ అప్, లిమ్కా, మరియు స్ప్రైట్. భారతదేశములో తయారయిన పెప్సి యొక్క సీతాల పానీయాలు, యురోపియన్ యూనియన్ నియమాల కంటే 36 రెట్లు ఎక్కువ; కొకా కోలా డి 30 రెట్లు ఎక్కువ.[12] ఇదే పానీయాలను USలో పరీక్షించామని వాటిలో ఇటువంటి పదార్ధాలు లేవని CSE చెప్పింది. అయితే, ఇది నీళ్ళకు యూరోపియన్ నియమాలే గాని ఇతర పానీయాలకు కావు. పానీయాలలో పురుగుమందులు ఉండకూడదని భారతదేశములో ఏ చట్టాలు లేవు.

కొకా-కోలా కంపెనీ, పెప్సికో ఇరు సంస్థలు ఈ ఆరోపణలను ఘాటుగా నిరాకరించాయి. తాము భారతదేశములో ఉత్పత్తి చేసే పానీయాలలో అభివృద్ధి చెందిన దేశాలలో అనుమతించబడుతున్న స్థాయిలకంటే ఎక్కువ టాక్సిన్ లు లేవని చెప్పాయి. అయితే, 2004లో ఒక భారతదేశ పార్లిమెంట్ సంఘం, CSE యొక్క నివేదికను సమర్ధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంఘం ఇప్పుడు, ప్రపంచములోనే మొట్ట మొదటి సారిగా, సేతాల పానీయాలకు పురుగు మందుల స్థాయి నియమాలను రూపొందించడానికి కృషి చేస్తూ ఉంది. కోక్ మరియు పెప్సికో దీనిని వెతిరేకించాయి. మిశ్రమ పానీయాలలో ఉన్న అతి స్వల్ప పురుగు మందు స్తాయీలను కనుగోడానికి ప్రయోగశాలలో జరిపే పరీక్షలకు విశ్వాశానీయత లేవని పెర్కున్నాయి.

2005 నాటికి, ది కొకా-కోలా కంపెనీ మరియు పెప్సికో కలిపి భారద దేశములో శీతల పానీయాల విక్రయంలో 95% వాటా కలిగిన్ ఉన్నాయి.[13] భారతదేశములోని కేరళా లో పాలక్కాడ్ జిల్లాలో ఉన్న పుతుస్సేరి పంచాయత్, పెప్సికో "నీళ్ళ పైరసీ" చేస్తుదని ఆరోపించింది. భూమిలిని నీళ్ళను చాలా అత్యదికంగా వాడి, పంచాయత్ వాసులకు తాగే నీళ్ళు లేకుండా చేసిందని చెప్పి తమ గ్రామములోని పెప్సికో సంస్థను మూసివేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు.[14]

పెప్సి మరియు కొకా-కోలా సంస్థలు తయారి చేస్తున్న సోడా పానీయాలలో అత్యధిక స్థాయిలో పురుగుమందులు ఉన్నాయని CSE మరల 2006లో కనుగొంది. అయితే, తమ పానీయాలు తాగడానికి సురక్షితమేనని పేర్కొని పెప్సికో మరియు ది కొకా-కోలా కంపెనీ సంస్థలు పత్రికలలో ప్రకటనలు ప్రచురించాయి. తమ పానీయాలలో ఉన్న పురుగుమందుల స్థాయిలు టీ, పళ్ళు మరియు పాల ఉత్పాదికలలో ఉన్న స్థాయిలకంటే కంటే తక్కువగానే ఉన్నాయని వాటిలో పెర్కున్నాయి.[15] భారతదేశములోని కేరళ రాష్ట్రంలో పెప్సి-కోలా మరియు ఇతర శీతల పానీయాల తయారి మరియు అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2006లో నిషేధించింది.[16] అయితే, ఒక నెల తరువాత, కేరళా ఉచ్ఛ న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది.[17] భారతదేశములోని ఐదు ఇతర రాష్ట్రాలలో పాఠశాలలు, కళాశాలలు మరియు ఆసుపత్రీలలో ఈ పానీయాల పై పాక్షిక నిషేధం విదించింది.[18]

భారతదేశములో శీతల పానీయాల మార్కెట్[మార్చు]

శీతల పానీయాల మార్కెట్ పెరుగుదలలో ఐదు ప్రధాన మార్కట్లలో భారతదేశం ఒకటి. దేశములో శీతల పానీయాల తలసరి వాడకం 2003 సంవత్సరములో ఏడాదికి 6 బాటిల్ అని అంచనా. US తో పోలిస్తే (ఏడాదికి 600+ బాటిల్ లు), ఇది చాలా తక్కువ. అయితే, అతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కట్ లలో ఒకటిగా ఉండడం మరియు అతి ఎక్కువ సంఖ్యలో జనాభా ఉండడం వంటి కారణాల వలన భారతదేశం శీతల పానీయాలకు ఒక మంచి మార్కెట్గా నిలుస్తుంది.

ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశములో కూడా ప్రముఖ శీతల పానీయాల సంస్థలు పెప్సికో మరియు కొకా-కోలా కో సంస్థలే. రెండవ సారి భారతదేశపు మార్కెట్ లో ప్రవేశించినప్పుడు కొకా-కోలా సంస్థ, లిమ్కా, గోల్డ్ స్పాట్, థమ్స్ అప్ వంటి అనేక స్థానిక బ్రాండ్ లను కొనుగోలు చేసింది. పెప్సి కో యొక్క శీతల పానీయాల పోర్ట్ ఫోలియోలో పెప్సితో పాటు మిరండ మరియు 7అప్ ఉన్నాయి. ఈ రెండు సంస్థల మార్కెట్ వాటా దాదాపు సమంగా ఉన్నాయి. ఐతేహ్, వివిధ వర్గాల అంచనాలలో తేడాలు ఉన్నాయి.[19]

శీతల పానీయాలలో ప్రధాన పదార్థం నీరు. శీతల పానీయములో 90% నీళ్ళే ఉంటుంది. నీళ్ళతో పాటు, తీపి చేసే పదార్ధాలు, కార్బన్ డై ఆక్సైడ్, సిట్రిక్ ఏసిడ్, రంగులు, ప్రిసర్వేటివ్ లు, యాంటి-ఆక్సిడంట్ లు మరియు ఇతర ఏమల్సిఫయింగ్ ఏజెంట్ లు ఉన్నాయి.[19]

భారతదేశములో వాడకము భాణి[మార్చు]

భారతదేశములోని 1,2 మరియు 3వ స్థాయి నగరాలలో, రోజులో ఒక కచ్చితమైన సమయములో తాము కార్ బోనేటడ్ పానీయాలను/శీతల పానీయాలను తాగుతున్నట్లు భారతదేశపు వినియోగదారులలో 29% పేర్కొన్నారు. శీతల పానీయాలను తాగడం ఒక రోజువారి కార్యక్రమం అయిపోయిందని, ఎక్కువ వాడకం "మధ్యాహ్నం నుంచి సాయంత్రం" సమయములో జరుగుతుందని దీని బట్టి తెలుస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు వంటి 1 స్థాయి నగారాలలో వాడకం అత్యదికంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

కుటుంబ ఆదాయం పెరుగదలతో పాటు వినియోగం స్థాయి కూడా పెరుగుతుంది (అత్యధిక ఆదాయం ఉన్న స్థాయి మినగా). అదే విధముగా వయస్సుతో పాటు వినియోగం తగ్గుతుంది.[20] 

భారతేదేశములో శీతల పానీయాల మార్కెట్ కు ఎటువంటి నియంత్రణ లేదు. 1954 నాటి ఆహార కల్తి చట్టంలో శీతల పానీయాలు చేర్చబడిలేదు. ఆగుస్ట్ 2003కు ముందు అమలులో ఉన్న BIS నియమాలలో శీతల పానీయాలలో పురుగుమందు ఎంత మేరకు ఉండవచ్చో అని ఎటువంటి నియమాలు లేవు. అయితే పురుగుమను ఎంత మేరకు ఉండవచ్చని వివిధ సంస్థలు కొన్ని నియమాలను రూపొందించాయి. తాగే నీళ్ళలో గరిష్ఠంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు పురుగుమందులు ఉండవచ్చని, అలగైతేనే అవి మనుషులకు హాని ఉండదని స్పష్టం చేసాయి. ఆల్డ్రిన్, డయల్డిన్, హేప్టాక్లోర్ ఎపోక్సైడ్ వంటి పురుగుమందులకు ఇంకా తక్కువగా అనగా గరిష్ఠంగా 0.1 పార్ట్స్ పెర్ బిలియన్ వరకు మాత్రమే ఉండవచ్చు.[19]

బర్మాలో పెప్సికో[మార్చు]

1991 నుంచి 1997 వరకు పెప్సికో, బర్మా లో ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉండేది. పెప్సికో యొక్క వ్యాపార బాగస్వామి అయిన తీన్ టున్ బర్మాను పాలిస్తున్న సైన్య ముటాకు వ్యాపార బాగస్వామి. ప్రపంచంలోనే అతి గోరమైన మానవ హాక్కుల ఉల్లంఘనలకు ఆ ముటా పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి.

దీంట్లో పెప్సికో పాల్గొనడం, చరిత్రలోనే అతి పెద్ద బర్మా-సంబంధించిన నిషేధానికి దారి తీసింది. ఇది గతములో సమకాలములో టెక్సాకో మరియు యునోకాల్ కు వెతిరేకంగా జరిగిన ప్రచారం మాదిరిగాను, ప్రస్తుతం టోటల్ ఆయిల్ కు వెతిరేకంగా జరుగుతున్నా ప్రచారం మాదిరిగాను ఉండింది.

బర్మాలో పెట్టుబడిని నవంబరు 1991లో లాంచనంగా పెప్సికో ప్రారంబించింది. అప్పటి బర్మా రాజధాని అయిన రంగూన్ లో ఒక బాట్లింగ్ సదుపాయాన్ని స్థాపించింది. అయితే, అప్పటికే బర్మాలో ప్రజాస్వామ్యం పునరుద్దించబడే వరకు బర్మాలో వ్యాపారం చేయవద్దని ఆంగ్ సాన్ సు క్యి మరియు నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసి పిలుపు ఇచ్చి ఉన్నారు. ఆసియాలో ఉన్న బుర్మా రైట్స్ మూవ్మెంట్ ఫర్ ఏక్షన్ పెప్సికు వెతిరేకంగా ఈ ప్రచారాన్ని ప్రారంబించింది. బర్మాలోని మానవ హక్కు సంస్థలు ప్రముఖ చమురు సంస్థలైన టెక్సకో, యునోకాల్, అమోకో, పెట్రో-కెనడా వంటి సంస్థల పై ప్రచారాన్ని ప్రారంబించడంతో పెప్సి పై ప్రచారం ప్రస్చాత్య దేశాలలో ఊపు అందుకుంది.[21]

పెట్రో-కెనడా బర్మాను వదిలి వెళ్ళిన తరువాత, కనడా, U.S.లో ఉన్న బర్మా ప్రజాస్వామ్య సంశాలు తమ దృష్టిను పెప్సికో పై ప్రచారాన్ని తీవ్రకత చేసాయి. 1996లో, ఫ్రీ బర్మ కోఎలిషణ్ సంస్థ అమెరికన్ విశ్వవిద్యాలయాల నుంచి పెప్సిను తొలగింకాదానికి కృషి చేయడంతో, ఈ ప్రచారం బాగా బలప్రథమయింది. హార్వర్డ్ లో ఒక మల్టి-మిలియన్ డాలర్ల ఒప్పందం రద్దయింది.

ప్రచారం యూరోప్ కు కూడా వ్యాపించింది. థర్డ్ వరల్డ్ ఫస్ట్ అనే UK సంస్థ కూడా ఈ నిషేధాన్ని సమర్ధించింది. 1996లో, పెప్సికో బర్మీస్ ఉమ్మడి సంస్థలో తమ వాటాను బాగాస్వామికి అమ్మేవిషి తమ మీద ఉన్న దృష్టిని తగ్గించాలని ప్రయత్నించింది. అయితే, బర్మీస్ ఫ్రాంచైస్ ఒప్పందాన్ని అట్టి పెట్టుకుంది. "మాకు సంబంధించిన వరకు, పెప్సి[కో] బర్మా నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరించలేదు" అని ఆంగ్ సాన్ సు క్యి వ్యాఖ్యానించారు. మానవ హక్కువ సంస్థలు మరియు పర్యావరణ సంస్థలు పెప్సి పై పట్టు విడవలేదు. తరువాత, బర్మీస్ ముటా హిమ్శాత్మక ప్రజాస్వామ్య-వెతిరేక సమావేశాలను నిర్వహించడంతో, ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరగడంతో, జనవరి 1997లో బర్మాతో అన్ని సంబంధాలను విరమించుకున్నట్లు పెప్సికో ప్రకటించింది. అయితే, బర్మాను వదిలి పెట్టిన ఇతర సంస్థలు ఒప్పుకున్నట్లు, బర్మాలో పెట్టుబడి పెట్టడం నైతికంగా తప్పని పెప్సికో ఈ నాటికి ఒప్పుకోవడం లేదు.

ఇస్రేల్ లో పెప్సికో[మార్చు]

1994 వరకు, పెప్సికో ఇస్రేల్ లో విక్రయంచబడలేదు. దీనికి యునైటెడ్ స్టేట్స్ లో పలువురు సంస్థను, అరాబ్ వారి ఇస్రేల్ బహిష్కరణకు మడ్డాడు ఇస్తుందని విమర్శించారు. అయితే, ఈ ఆరోపణను పెప్సికో తిరస్కరించి, ఇస్రేల్ చాలా చిన్న మార్కెట్ అని వివరణ ఇచ్చింది. అందువలన, ఇస్రేల్ మార్కెట్ ను పోటీ సంస్థ కొకా కోలా కైవసం చేసుకుంది. ఈ నాటికి, ఇస్రేల్ లో పెప్సికి చాలా చిన్న వాటా మాత్రమే ఉంది.[22][23]

పెప్సి బాట్లర్ లు[మార్చు]

దస్త్రం:Pepsi Beverages Company.png
ది పెప్సి బివరేజస్ కంపెనీ లోగో.

2009 ఆగుస్ట్ 4న, ది పెప్సి బాట్లింగ్ గ్రూప్, ఇంక్ మరియు పెప్సిఅమెరికాస్, ఇంక్ అనే తమ రెండు అతి పెద్ద బాట్లింగ్ సంస్థలతో తుది విలీనం ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెప్సికో ప్రకటించింది. ఈ రెండు సంస్థలను 1990లలో పెప్సికో స్పిన్ ఆఫ్ చేసిని. ఈ లావాదేవి యొక్క మొత్తం విలువ $7.8 బిలియను అని అంచనా.[24]

2010 ఫిబ్రవరి 17 నాడు ఈ రెండు బాట్లింగ్ సంస్థల వాటాదారులు విలీనాన్ని ఆమోదించడంతో, ఈ విలీనం ఫిబ్రవరి 26 నాడు పూర్తీ అయింది. పెప్సికో యొక్క కొత్త ఉత్తర అమెరిక పానీయాల అనుబంధ సంస్థ అయిన పెప్సి బివరేజస్ కంపెనీ (PBC) ఏర్పాటయింది. విలీనంలో భాగంగా Dr పెప్పర్ స్నాపిల్ గ్రూప్ తో ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని ప్రకారం, గతములో PBG మరియు PAS సంస్థలు ఒక 20-సంవత్సరాల లైసెన్స్ ఒప్పందం ద్వారా Dr పెప్పేర్, ష్వేప్స్ మరియు క్రష్ బ్రాండ్లను పంపిణి చేస్తున్న మార్కట్ లలో ఇక పై PBC బాట్లింగ్ మరియు పునఃపంపిణి చేస్తుంది (ఫిబ్రవరి 2009 నుంచి PBG మరియు PAS సంస్థలు క్రష్ ను పలు మార్కెట్ లలో బాట్లింగ్ మరియు పంపిణి కార్యక్రమాలను చేపట్టుతూ ఉండేవి).

మిగిలిన ప్రాంతాలలో Dr పెప్పేర్ మరియు ష్వేప్స్ బ్రాండ్ లను PBC పంపిణి చేస్తుందా, చేస్తే ఎప్పుడు చేస్తుందనే విషయాలు ప్రస్తుతం తెలియవు (షికాగో వంటి ఇతర మార్కెట్ లలో DPS వారి బాట్లింగ్ సంస్థలు ఉన్నాయి). అంతే కాక, PBC మరియు DPS వారి బార్లింగ్ సంతలు ఉన్న US ప్రాంతాలలో, వేర్నోర్స్ మరియు హవైయన్ పంచ వంటి DPS వారి కొన్ని ఇతర బ్రాండ్ ల బాట్లింగ్ హక్కులు PS బాట్లింగ్ సంస్థలకు బదిలీ చేయబడుతుంది. ఈ రెండు పూర్వ బాట్లింగ్ సంస్థల అంతర్జాతీయ కారకలాపాలు పూర్తిగా వేరు సంస్థ అయిన పెప్సికో అంతర్జాతీయ విబాగానికి బదిలీ చేయబడింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • పెప్సి స్టఫ్
 • కోలా యుద్ధాలు
 • పెప్సి చాలెంజ్
 • పెప్సి రకాల జాబితా
 • ఇంద్రా నూయి
 • కలేబ్ బ్రాధం
 • కొకా-కోల

గమనికలు మరియు సూచనలు[మార్చు]

 1. http://www.pepsico.com/Company/Leadership.html#block_Indra K. Nooyi
 2. 2.0 2.1 Pepsico (PEP) annual SEC balance sheet filing via Wikinvest
 3. http://www.opensecrets.org/lobby/clientsum.php?year=2009&lname=pepsico+Inc&id=Center for Responsive Politics, పెప్సి కో ఇంక్,, నవ 20, 2009
 4. http://www.opensecrets.org/lobby/clientlbs.php?lname=పెప్సికో+Inc&year=2009 Center for Responsive Politics, పెప్సికో ఇంక్, నవ 20, 2009
 5. వియట్నాంలో పెప్సి కథ
 6. సబ్రాలో 50% వాటాను పెప్సికో కొనుగోలు చేసింది
 7. "పెప్సికో FRS హేల్తి ఎనేర్జి బ్రాండ్ ను కొనుగోలు చేసింది". నుట్రాచుటికల్స్ వరల్డ్. (జూన్ 18, 2010).http://www.nutraceuticalsworld.com/contents/view/24756
 8. కార్పరేట్ ఈక్వాలిటి ఇండెక్స్ 2006
 9. 1993 నాటి పెప్సి తమ్పెరింగ్ కుంబకోణం
 10. "కొకా-కోలా ఇండియా", జేన్నిఫెర్ కాయే, డార్ట్ మౌత్ లోని టక్ స్కూల్ అఫ్ బిజినెస్ , 2004 (PDF)
 11. "లేబల్ ల పై పోట్లాటలో కోక, పెప్సి ఓడి పోయాయి", నైట్ రిడ్దర్ న్యూస్ , డిసెంబర్ 9, 2004
 12. "ఇండియన్ కోక్, పెప్సి లలో పురుగుమందులు ఎక్కువ ఉన్నాయి, అని NGO కథనం", ఇంటర్ ప్రెస్ సర్వీస్, ఆగష్టు 5, 2003
 13. "ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలలు ఎలాగా కోక కు ఇండియాలో సమశ్యలు ఇస్తున్నాయి", వాల్ స్ట్రీట్ జర్నల్ , జూలై 7, 2005
 14. "కేరళా దావాలో పెప్సి కు ఊరట", రీడిఫ్ ఇండియా అబ్రాడ్ , ఏప్రిల్ 11, 2007
 15. ప్రభుత్వ నిషేధం వలన కోలా అమ్మకం 10% తగ్గుముఖం
 16. Sanjoy Majumder (2006-08-09). "Kerala bans Coke and Pepsi". BBC News. Retrieved 2008-01-03. Cite news requires |newspaper= (help)
 17. K.C. Gopakumar (2006-09-23). "Kerala HC quashes ban on Coke and Pepsi". The Hindu BusinessLine. Retrieved 2008-01-03. Cite web requires |website= (help)
 18. భారత రాష్ట్రం పెప్సి మరియు కోక్ లను నిషేదించింది
 19. 19.0 19.1 19.2 CSE నివేదిక: శీతల పానీయాలలో పురుగుమందులు శాతం, ఆగష్టు 2006
 20. భారతదేశములో కొట్టులో కొనబడిన ఆల్కహాల్ లేని పానేయాలు, జూన్ 2009
 21. "పెప్సికో/బర్మా బహిష్కరణ - ఒక చారిత్రాత్మక నివేదిక" బాయ్కాట్ క్వాటేర్లీ (సుమ్మెర్ 1997), ఆన్ లైన్ లో http://www.thirdworldtraveler.com/Boycotts/Hx_పెప్సిBurmaBoy.html [1]
 22. గెట్టింగ్ ఇన్ టెంపో విత్ పెప్సి కోలా (జెరూసలెం పోస్ట్, 1991)
 23. స్నోప్స్.కాం: కొకా-కోలా మరియు ఇస్రేల్, మార్చ్ 13, 2007
 24. "పెప్సి బాట్లింగ్ గ్రూప్ మరియు పెప్సిఅమెరికాస్ లతో పెప్సికో విలీనం ఒపందం కుదుర్చుకుంది", ఆన్ లైన్ లో http://www.పెప్సికో.com/PressRelease/పెప్సికో-Reaches-Merger-Agreements-with-పెప్సి-Bottling-Group-and-పెప్సిAmericas08042009.html

బాహ్య లింకులు[మార్చు]

మూస:PepsiCo

"https://te.wikipedia.org/w/index.php?title=పెప్సికో&oldid=2140928" నుండి వెలికితీశారు