Jump to content

పెరంబలూర్

అక్షాంశ రేఖాంశాలు: 11°14′N 78°53′E / 11.23°N 78.88°E / 11.23; 78.88
వికీపీడియా నుండి
Perambalur
Perumpuliur
Perumpuliyur
Town
Perambalur court
Perambalur court
Perambalur is located in Tamil Nadu
Perambalur
Perambalur
Location in Tamil Nadu, India
Coordinates: 11°14′N 78°53′E / 11.23°N 78.88°E / 11.23; 78.88
Country India
StateTamil Nadu
DistrictPerambalur district
Government
 • TypeSecond Grade Municipality
 • BodyPerambalur Municipality
Elevation
143 మీ (469 అ.)
జనాభా
 (2011)
 • Total49,648
 • Rank1
Languages
 • OfficialTamil
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతపు కోడ్04328
Vehicle registrationTN-46
Website[1]

పెరంబలూరు, భారతదేశం తమిళనాడు రాష్ట్రం, పెరంబులూరు జిల్లా లోని ఒక పట్టణం. ఇది పెరంబలూరు జిల్లా, పెరంబలూరు (ఉపజిల్లా) ప్రధాన కార్యాలయం. 2011 భారత జనాభాలెక్కల ప్రకారం, పట్టణంలో49,648 జనాభా ఉంది. 11వ శతాబ్దానికి చెందిన బుద్ధ విగ్రహాలు పెరంబలూరు పరిసర గ్రామాల చుట్టూ పెరంబలూర్ బుద్ధులుగా ఉన్నట్లు కనుగొనబడ్డాయి.

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

ఇది పెరంబలూరు జిల్లాలో అతిపెద్ద పట్టణం, పరిపాలనా ప్రధాన కార్యాలయం, అలాగే పెరంబలూరు తాలూకా (ఉప-జిల్లా)కు కేంద్రం. [1] పట్టణం 20.59 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.[1] భూపరివేష్టిత ప్రాంతం అయినప్పటికీ, పెరంబలూర్ జిల్లాలోని కున్నం తాలూకా సమీపంలో 4.16 లక్షల సంవత్సరాల క్రితం నాటి సముద్ర జాతుల శిలాజాలు కనుగొనబడ్డాయి.ఈభూమి పురాతన సముద్రంలో ఒక భాగమనే వాస్తవాన్నిఇది వెల్లడిస్తుంది.

జనాభాశాస్త్రం

[మార్చు]
మతాల ప్రకారం జనాభా
మత వివరం శాతం (%)
హిందూ
  
86.94%
ముస్లిం
  
9.29%
క్రిష్టియన్లు
  
3.6%
సిఖ్
  
0.01%
బుద్ధిష్ట్
  
0.01%
జైన్
  
0.0%
ఇతరులు
  
0.12%
మతం తెలపనివారు
  
0.03%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పెరంబలూరులో 49,648 జనాభా ఉంది.ప్రతి 1,000 మంది పురుషులకు 1,013 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 తోో పోలిస్తే చాలా ఎక్కువ [2] జనాభా మొత్తంలో 5,190 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో 2,678 మంది పురుషులు కాగా,2,512 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 29.43% మంది ఉన్నారు.షెడ్యూల్డ్ తెగలు వారు 0.29% మంది ఉన్నారు.పట్టణ సగటు అక్షరాస్యత 80.77% ఉంది.

దీనిని జాతీయ సగటు 72.99% అక్షరాస్యతతో పోల్చగా ఎక్కువగా ఉంది.[2] పట్టణంలో మొత్తం 12,732 గృహాలు ఉన్నాయి.మొత్తం జనాభాలో 18,430 మంది కార్మికులు ఉన్నారు, వీరిలో 998 మంది సాగుదారులు, 1,750 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 364 మంది గృహ పరిశ్రమలు, 13,762 మంది ఇతర కార్మికులు, 1,609 సన్నకారు కార్మికులు, 397 మంది ఉపాంత కార్మికులు ఉన్నారు. [3] 2011 భారత జనగణన ప్రకారం మతాలవారిగా పెరంబలూరులో 86.94% హిందువులు, 9.29% ముస్లింలు, 3.6% క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.01% బౌద్ధులు, 0.0% జైనులు, 0.12% మంది మతపరమైన ప్రాధాన్యత, ఇతర మతాలను అనుసరించడం లేదా అనుసరించనివారు లేదని 0.03% సూచించింది. . [4]

రాజకీయం

[మార్చు]

పెరంబలూరు (రాష్ట్ర శాసనసభ నియోజకవర్గం) షెడ్యూల్డ్ కులాలకు కేటాయించబడింది. [5]ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకరన్ 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో డిఎంకె నుండి ఎన్నికయ్యాడు. పెరంబలూరు నియోజకవర్గానికి ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు టిఆర్ పారివేందర్ .

ఆనవాలు

[మార్చు]

పెరంబలూరు పరిసర గ్రామాలలో 11వ శతాబ్దానికి చెందిన బుద్ధ విగ్రహాలు పెరంబలూర్ బుద్ధులుగా ఉన్నాయి.

ఇది కూడ చూడు

[మార్చు]
  • పెరంబలూరులోని విద్యా సంస్థల జాబితా

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 "Perambalur Municipality - About Municipality". Archived from the original on 17 March 2012. Retrieved 1 March 2012."Archived copy". Archived from the original on 2016-03-09. Retrieved 2015-04-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. 2.0 2.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  3. "Census Info 2011 Final population totals - Perambalur(05783)". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  4. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  5. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006. Retrieved 2008-10-11.

వెలుపలి లంకెలు

[మార్చు]