Jump to content

పెరుమాళ్ల ప్రణయ్ హత్య

వికీపీడియా నుండి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా 2018 సెప్టెంబర్‌ 14న ఓ దుండగుడు మాటువేసి ప్రణయ్‌ను నరికి చంపాడు.[1] అప్పట్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని నల్గొండ ఎస్‌పీ రంగనాథ్ చెప్పారు.

ప్రణయ్ అమృతాల వివాహం

[మార్చు]

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత వర్షిణిలు తొమ్మిది, పదో తరగతుల నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇంజినీరింగ్ (బీటెక్) మధ్యలో ఆపేశారు. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తండ్రి తిరునగరి మారుతీ రావు, బాబాయి శ్రవణ్ ప్రణయ్‌ని హెచ్చరించారు. అమృత 2018 జనవరిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్‌ కులానికి (మాల) చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది వైశ్య సామాజిక వర్గం.[2]

హత్య

[మార్చు]

మిర్యాలగూడకు చెందిన అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు బీహార్‌కు చెందిన సుభాష్‌ శర్మకు సుపారీ ఇచ్చి 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు. పెరుమాళ్ల ప్రణయ్ 14 సెప్టెంబర్ 2018న తన భార్య అమృతకి వెన్ను నొప్పి రావడంతో ప్రణయ్ తల్లితో కలిసి ముగ్గురు ఆసుపత్రికి వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా వారిని వెంబడించిన ఓ వ్యక్తి ప్రణయ్‌ను గొడ్డలితో రెండుసార్లు నరికి చంపడంతో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు.


ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్‌ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రణయ్‌ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు.

ఏడుగురు నిందితులు

[మార్చు]

ఎ-1 తిరునగరి మారుతీరావు (అమృత తండ్రి)

ఎ-2 సుభాష్‌ కుమార్‌ శర్మ (హంతకుడు)

ఎ-3 అస్గర్ అలీ (హత్య కుట్ర అమలులో పాత్రధారి)

ఎ-4 అబ్దుల్ భారీ (హత్య కుట్ర అమలులో పాత్రధారి)

ఎ-5 అబ్దుల్ కరీం (మారుతీరావు - బారీల మధ్య మధ్యవర్తి)

ఎ-6 తిరునగరి శ్రవణ్‌ కుమార్‌ (అమృత బాబాయ్)

ఎ-7 సముద్రాల శివగౌడ్ (మారుతీరావు కారు డ్రైవర్)

ఎ-8 నిజాం (ఆటో డ్రైవర్)

అనంతర పరిణామాలు

[మార్చు]

ప్రణయ్‌ హత్య కేసులో మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. మారుతిరావు బీహార్‌కు చెందిన సుభాష్‌ శర్మకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుభాష్‌ శర్మ బెయిల్‌పై విడుదల కాగా, ఏప్రిల్ 28, 2019లో బెయిల్‌పై బయటకు వచ్చిన[3][4] మారుతిరావు హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో రూమ్ నెంబర్ 306లో 2020 మార్చి 8న విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.[5][6][7]

ప్రణయ్ హత్య కేసు తుది విచారణ అనంతరం 2025 మార్చి 10న నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏ2 శుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది. మిగిలిన  నిందితులకు జీవిత ఖైదు విధిస్తు తీర్పు ఇచ్చింది.[8] 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది.[9]  

మూలాలు

[మార్చు]
  1. "ప్రణయ్‌కి కన్నీటి వీడ్కోలు". Sakshi. 16 September 2018. Archived from the original on 16 September 2018. Retrieved 12 January 2025.
  2. "ప్రణయ్, అమృత అసలు వీళ్లెవరు?". BBC News తెలుగు. 15 September 2018. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  3. "ప్రణయ్ హత్య కేసు నిందితులు విడుదల". 10TV Telugu. 28 April 2019. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  4. "Pranay murder case: Maruthi Rao, two co-accused get bail" (in ఇంగ్లీష్). The New Indian Express. 28 April 2019. Retrieved 12 January 2025.
  5. "ప్రణయ్‌ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య". Andhrajyothy. 9 March 2020. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  6. "Pranay murder case: Amrutha's dad, prime accused, kills himself". The Times of India. 9 March 2020. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  7. "విషం తాగి మారుతీరావు ఆత్మహత్య". 10TV Telugu. 8 March 2020. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  8. "ప్రణయ్‌ హత్య కేసు.. నల్గొండ కోర్టు సంచలన తీర్పు". Eenadu. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.
  9. "ప్రణయ్ హత్యకేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు". Andhrajyothy. 10 March 2025. Archived from the original on 10 March 2025. Retrieved 10 March 2025.