పెరెన్
పెరెన్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°33′14″N 93°44′26″E / 25.554°N 93.7406°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | పెరెన్ |
Elevation | 1,445 మీ (4,741 అ.) |
జనాభా (2011) | |
• Total | 9,744 |
• జనసాంద్రత | 38/కి.మీ2 (100/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎన్ఎల్ |
సమీప పట్టణం | దీమాపూర్ |
పెరెన్, నాగాలాండ్ రాష్ట్రంలోని పెరెన్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇక్కడ జెలియాంగు, రోంగ్మీలు, కుకిలు నివసిస్తున్నారు.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పెరెన్ పట్టణంలో 5,084 జనాభా ఉంది. ఇందులో 2,538 మంది పురుషులు, 2,546 మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 856 (16.84%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 88.25% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.55% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 93.28% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 83.22% గా ఉంది.[1]
మతాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 6.86% మంది హిందువులు, 0.77% మంది ముస్లింలు, 91.15% మంది క్రైస్తవులు, 0.37% మంది బౌద్ధులు, 0.85% మంది ఇతరులు ఉన్నారు.
పరిపాలన
[మార్చు]ఈ పట్టణాన్ని 9 వార్డులుగా విభజించారు. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ మొత్తం 1,027 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ అధ్వర్యలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందజేయబడుతోంది. పట్టణంలో రహదారులను నిర్మించడానికి, కమిటీ పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా పట్టణ అభివృద్ధి కమిటీకి అధికారం ఉంది.[1]
పరిధిలోని గ్రామాలు
[మార్చు]ఈ పట్టణం పరిధిలోని గ్రామాలు:[2]
- కిపుజాంగ్
- పెలెట్కీ
- న్డుంగ్ల్వా
- పెరెన్ నామ్డి
- పెరెన్
- న్యూ పుయిల్వా
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Peren Town Committee City Population Census 2011-2021 | Nagaland". www.census2011.co.in. Retrieved 2021-01-03.
- ↑ "Peren Village in Peren (Peren) Nagaland | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-03.