పెళ్లూరు (గ్రామీణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పెళ్లూరు
రెవిన్యూ గ్రామం
పెళ్లూరు is located in Andhra Pradesh
పెళ్లూరు
పెళ్లూరు
నిర్దేశాంకాలు: 15°26′46″N 80°02′13″E / 15.446°N 80.037°E / 15.446; 80.037Coordinates: 15°26′46″N 80°02′13″E / 15.446°N 80.037°E / 15.446; 80.037 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంఒంగోలు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,821 హె. (4,500 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,012
 • సాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523272 Edit this at Wikidata

పెళ్లూరు (గ్రామీణ), ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523272., ఎస్.టి.డి.కోడ్ = 08592.

మండలం పేరు ఒంగోలు మండలం
జిల్లా ప్రకాశం జిల్లా
రాష్ట్రం ఆంధ్రపదేశ్
భాష తెలుగు
ఎత్తు: సముద్రమట్టానికి 12మీటర్లు
పిన్‌కోడ్ 523272
తపాలా కార్యాలయం వల్లూరు

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

కారుమంచి 3.6 కి.మీ,చెరువుకొమ్ముపాలెం 3.9 కి.మీ,సర్వేరెడ్డిపాలెం 4.2 కి.మీ,జయవరం 4.4 కి.మీ,ఒంగోలు 6.4 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 6.4 కి.మీ,టంగుటూరు 11.5 కి.మీ,కొత్తపట్నం 13.1 కి.మీ,జరుగుమిల్లి 14.6 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సిండికేటు బ్యాంకు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గురునాధేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం ఒంగోలు-నెల్లూరు జాతీయ రహదారిపై, ఒంగోలుకు 3 కి.మీ.దూరంలో ఉంది.

చారిత్రిక కథనం[మార్చు]

ఒంగోలు రాజులకు వెంకటగిరిరాజులకు మధ్య జరిగిన యుద్ధంలో, పెళ్ళూరు సంస్థానానికి అంతరంగీకుడైన అద్దంకి రామచంద్రయ్య, ఒక మహా యఙాన్ని ప్రారంభిస్తాడు. ఆ సమయంలో ఉద్భవించిన శక్తులలో ఒక అమ్మవారు పెళ్ళూరు జ్వాలాముఖి అమ్మవారుగా వెలసినదని చారిత్రిక కథనం, భక్తుల విశ్వాసం.

చతుర్భుజ దర్శనం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారు భక్తులకు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. వేద శిల్పశాస్త్రం ప్రకారం, ప్రధృతో వరముద్రికా అంటే ఎడమచేయి క్రిందికి ఉంచిన అమ్మవారు, తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తుంది. తవ చరణ యుగ్నే అంటూ అమ్మ పాదాలను పట్టినవారికి కొంగు బంగారమై నిలుస్తుంది. కుడి చేతిలో శక్తిఖడ్గం, మిగిలిన రెండు చేతులూ ఊర్ధ్వముఖంగా ఉండి, త్రిశూలం, నాగాస్త్రంతో కూడిన ఢమరుకం పట్టి ఉంటవి. ఇవన్నీ అద్భుత తాత్విక చిహ్నాలు. శివశక్తులు ఒక్కటేనని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు చెప్పినట్లుగా, శ్రీచక్రంలోని నాలుగు చక్రాలు, ఐదు శక్తిచక్రాలు కలిపి మొత్తం తొమ్మిది చక్రాల భైరవ యామళం అనే అర్ధాన్ని ఇవి స్ఫురిస్తాయి. అందుకే అమ్మవారు జ్వాలా స్తంభ జనితమైన పరమేశ్వరునికి, ఆయనకు మూలమైన ఆదిపరాశక్తికి ప్రతీకగా ఇక్కడ పూజలందుకొనుచున్నది.

పరివారంతో సహా[మార్చు]

అమ్మ ఎక్కడుంటే తనయులు గూదా అక్కడ ఉండాల్సిందే. ఇది అమ్మలోని విశ్వమాతృక తత్వానికి నిదర్శనం. అందుకే ఆలయంలో మహా గణపతి, కుమారస్వామివారలతోపాటు గురునాధేశ్వరస్వామిగా శివయ్య అక్కడే వేంచేసియున్నారు. తాను ఎలాగైతే కుటుంబంతో సహా కొలువుదీరి భక్తులను కరుణిస్తున్నాడో, మీరు గూడా అలాగే సకుటుంబ సపరివారంగా సకాలం చల్లగా ఉండాలనే విషయాన్ని అమ్మ ప్రత్యక్షంగా తెలియజేయుచున్నది.

ఉత్సవాలకు నెలవు[మార్చు]

జగన్మాత వెలిస్తే జనసందడికి లోటా, చెప్పండి. అందుకే ఆలయం సంవత్సరం పొడవునా కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా కార్తీకమాసం, శరన్నవాత్రుల సమయంలో అయితే చెప్పనలవికాదు. గ్రామస్థులు సామూహికంగా కలశపూజలు, కుంకుమపూజలు చేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టేవారు, పొంగళ్ళు సమర్పిచే వారు, మొక్కుబడులు తీర్చుకునేవారు, ఇలా అందరూ అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.

అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘమాసం, శుక్లపక్షంలో ఐదురోజులపాటు వేదపండితుల ఆధ్వర్యంలో శతచండీ యాగం నిర్వహించెదరు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించు 108 కలశాలతో క్షీరాభిషేకం, 108 తామరపూలతో పుష్పార్చన, శ్రీవిద్యా, మహా విద్యా పారాయణం మొదలైన భక్తుల ధార్మికానందం కలిగించే కార్యక్రమాలు భక్తులకు ధార్మికానందం కలిగించుతవి. ఆఖరిరోజున శ్రీ గురునాథేశ్వరస్వామి, జ్వాలాముఖి అమ్మవారల వార్షిక కళ్యాణం నిర్వహించెదరు. [4]

ఈ ఆలయంలో సప్తమ వార్షికోత్సవాలు 2014,ఫిబ్రవరి-7,8,9 తేదీలలో అంగరంగ వైభవంగా జరిగినవి. ఆఖరి రోజైన 9వ తేదీ ఆదివారం, అమ్మవారి కళ్యాణం జరిగింది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. తరువాత ప్రధాన వీధులలో అమ్మవారి నగరోత్సవం నిర్వహించారు. [2]

శ్రీ గంగమ్మ,పోలేరమ్మతల్లి ఆలయం[మార్చు]

జాతీయ రహదారి ప్రక్కన నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,నవంబరు-26వ తేదీ గురువారంనాడు, గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి విగ్రహాలను, అర్చకుల వేదమంత్రల నడుమ, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెళ్ళూరు, తదితర గ్రామాలనుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్ని అమ్మవారల్లను దర్శించుకొని తీర్ధప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మందికి పైగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,012 - పురుషుల సంఖ్య 1,505 - స్త్రీల సంఖ్య 1,507 - గృహాల సంఖ్య 780

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,772.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,398, మహిళల సంఖ్య 1,374, గ్రామంలో నివాస గృహాలు 668 ఉన్నాయి.

  • గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,నవంబరు-27; 3వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016,ఫిబ్రవరి-13; 1వపేజీ.