పే పర్ క్లిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పే పర్ క్లిక్ (Pay Per Click or PPC ) అనేది ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లలో ఉపయోగించే ప్రకటనల నమూనా, ఇక్కడ ప్రకటనదారులు, వారి హోస్ట్‌కు కేవలం తమ ప్రకటనను ఎవరైనా క్లిక్‌ చేసినప్పుడు మాత్రమే డబ్బు చెల్లిస్తారు. ప్రకటనదారులు తమ లక్ష్య మార్కెట్‌కు దగ్గరగా ఉండే కీలకమైన పదబంధాల కోసం సెర్చ్‌ ఇంజిన్ల వద్ద బిడ్లు దాఖలు చేస్తుంటారు. కంటెంట్‌ సైట్లు మాత్రం ఇలాంటి బిడ్డింగుకు బదులు సాధారణంగా ప్రతి క్లిక్‌కూ స్థిర ధర వసూలు చేస్తుంటాయి.

కాస్ట్‌ పర్‌ క్లిక్‌ (CPC) అంటే సందర్శకున‌కు తన వెబ్‌సైట్‌కు దిశా నిర్దేశం చేసే తన ప్రకటన పై పడే ప్రతి క్లిక్‌కు సెర్చ్ఇంజన్లకు, లేదా ఇతర ఇంటర్నెట్‌ పబ్లిషర్లకు ప్రకటనదారు చెల్లించే మొత్తం.

ఒకే సైట్‌లో హెచ్చు పరిమాణంలో ట్రాఫిక్‌ను పంపజేసే జనరలైజ్డ్‌ పోర్టల్‌కు విరుద్ధంగా అనుబంధమైనది‌గా పిలిచే పద్ధతిని PPC అమలు చేస్తుంది. నెటిజన్లు ఎక్కడ సర్ఫింగ్‌ చేస్తున్నా వారికి కొనుగోలు అవకాశాలను ఈ పద్ధతి కల్పిస్తుంది. అనుబంధ భాగస్వామ్య సైట్లకు శాతం, లేదా రెవెన్యూ రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాలను ఆఫర్‌ చేయడం ద్వారా అది దీన్ని అమలు చేస్తుంది. బదులుగా వ్యాపారి దాకా కొనుగోలు పాయింట్‌ క్లిక్‌ను సదరు అనుబంధ సైట్లు అందుబాటులో ఉంచుతాయి. ఇది పనితీరుకు చెల్లింపు పద్ధతి: ఒకవేళ ఏదైనా అనుబంధ సైట్‌ అమ్మకాలను సృష్టించలేకపోతే వ్యాపారికి అదేమీ ఖర్చులను చూపదు. బ్యానర్‌ ఎక్స్‌చేంజ్‌, పే పర్‌ క్లిక్‌, ఆదాయ పంపక కార్యక్రమాల వంటి మార్పులు వీటిలో ఉంటాయి.

PPC ప్రకటనలను ఉపయోగించుకునే వెబ్‌సైట్లు ఆ ప్రకటనలను కీప్యాడ్‌ ప్రశ్న ప్రకటనదారు కీవర్డ్‌ పదాల జాబితాతో సరిపోలుతూనే తెరపై ప్రదర్శిస్తాయి. లేదంటే కంటెంట్‌ సైట్‌ సంబంధిత సమాచారాన్ని చూపించినా అదే పని చేస్తాయి. అలాంటి ప్రకటనలను స్పాన్సర్డ్‌ లింక్స్‌, లేదా స్పాన్సర్డ్‌ యాడ్స్ ‌గా పిలుస్తారు. ఇవి సెర్చ్‌ ఇంజన్‌ ఫలితాల పేజీల్లో పై వరుసలో ఆర్గానిక్‌ ఫలితాల రూపంలో కన్పిస్తాయి లేదంటే వెబ్‌ డెవలపర్‌ వాటికోసం కేటాయించిన ఏ ప్రాంతంలో అయినా కన్పిస్తాయి.[1]

PPC ప్రొవైడర్లలో గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, యాహూ సెర్చ్‌ మార్కెటింగ్‌, మైక్రోసాఫ్ట్‌ యాడ్‌సెంటర్‌ మూడు అతి పెద్ద నెట్‌వర్కు ఆపరేటర్లు. ఈ మూడూ బిడ్‌ ఆధారిత పద్ధతిలోనే పని చేస్థాయి. క్లిక్‌కు ఖర్చు (CPC) సెర్చ్‌ ఇంజన్‌పై, సంబంధిత ముఖ్య పదానికి ఉన్న పోటీ పై ఆధారపడి ఉంటుంది.[1]

PPC ప్రకటనల పద్ధతి క్లిక్‌ మోసాలకు అనువుగా ఉంటుంది. పోటీదారులు, కరప్టెడ్‌ వెబ్‌ డెవలపర్ల నుంచి ఇలాంటి మోసపూరిత క్లిక్‌లను అడ్డుకునేందుకు గూగుల్‌ తదితరాలు[2] ఇప్పటికే ఆటోమేటెడ్‌ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి.[3]

క్లిక్‌కు ఖర్చును నిర్ధారించడం[మార్చు]

క్లిక్‌కు ఖర్చును నిర్ధారించేందుకు రెండు ప్రాథమిక పద్ధతులున్నాయి. అవి ఫ్లాట్‌ రేట్‌, బిడ్‌ ఆధారితం. రెండు విధానాల్లోనూ ప్రకటనదారు సంబంధిత మూలం నుంచి వచ్చే ఒక్కో క్లిక్‌ తాలూకు విలువను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనదారు తన వెబ్‌సైట్‌కు రావాలని ఆశిస్తున్న వ్యక్తి ఎవరో, అతని సందర్శన నుంచి తనకు వచ్చే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లబ్ధి ఏమిటో (ఇది సాధారణంగా ఆదాయమే అయ్యుంటుంది) ఆలోచించుకోవాలి. ఇక ప్రకటనలకు సంబంధించిన ఇతర తరహాల్లో టార్గెటింగే కీలకం. ఇక PPC ప్రచారాల్లో తరచూ కీలక పాత్ర పోషించే కారకాల్లో టార్గెట్‌ ప్రయోజనాలు (తరచూ సెర్చ్‌ ఇంజన్లలో వారు టైప్‌ చేసేకీ పదాలు, లేదా వారు బ్రౌజ్‌ చేసే పేజీలోని కంటెంట్‌), ఉద్దేశం (ఉదాహరణకు కొనలా, వద్దా అన్నది), ప్రాంతం (భౌగోళిక లక్ష్యం కోసం), వారు బ్రౌజ్‌ చేస్తున్న రోజు, సమయం వంటివి వస్తాయి.

ఫ్లాట్‌ రేట్‌ PPC[మార్చు]

ఫ్లాట్‌ రేట్‌ పద్ధతిలో ప్రతి క్లిక్‌కు చెల్లించాల్సిన నిర్ధారిత మొత్తానికి ప్రకటనదారు, ప్రచురణ కర్త అంగీకరిస్తారు. చాలాసార్లు ప్రచురణకర్త వద్ద ఒక రేట్‌ కార్డు ఉంటుంది. తమ వెబ్‌సైట్‌; లేదా నెట్‌వర్క్‌ పరిధిలోని పలు విభిన్న ప్రాంతాల జాబితా అందులో ఉంటుంది. పలు రకాల ధరలు తరచూ పేజీల్లోని విషయం పై ఆధారపడి ఉంటాయి. ఎక్కువ విలువైన బ్రౌజర్‌ను ఆకర్షించే విషయానికి సహజంగానే తక్కువ విలువైన బ్రౌజర్‌ను ఆకర్షించే దానికంటే ఎక్కువ CPC ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ముఖ్యంగా దీర్ఘకాలిక, హెచ్చు విలువతో కూడిన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రకటనదారులు తక్కువ ధరలకే సర్దుకుపోతారు.

షాపింగ్‌ ఇంజన్లతో పోలిస్తే ఫ్లాట్‌ రేట్‌ పద్ధతి మరీ సాధారణంగా అమలవుతుంటుంది. అవి రేట్‌ కార్డులను ప్రచురిస్తుంటాయి.[4] అయితే ఈ ధరలు కొన్నిసార్లు మరీ నామమాత్రంగా ఉంటాయి. దాంతోపాటు ప్రకటనదారులు హెచ్చు సాదృశ్యత కోసం ఎక్కువ మొత్తం కూడా చెల్లించవచ్చు. ఈ సైట్లు సాధారణంగా ఉత్పత్తి లేదా సేవలను విభాగాల వారీగా శుభ్రంగా సర్ది ఉంటాయి. తద్వారా ప్రకటనదారులను ఆకర్షించే అవకాశాలను మెరుగు పరుచుకుంటాయి. చాలా కేసుల్లో ఇలాంటి సైట్ల ప్రధాన విషయమంతా పెయిడ్‌ ప్రకటనలుగానే ఉంటుంది!

బిడ్‌ ఆధారిత PPC[మార్చు]

ఈ బిడ్‌ ఆధారిత పద్ధతిలో ప్రకటనదారు, ప్రచురణదారు లేదా సాధారణంగా ప్రకటనల నెట్‌వర్క్‌ జరిపే ప్రైవేటు వేలంపాటలో ఇతర ప్రకటనదారులతో పోటీ పడేందుకు వీలు కల్పించే ఒప్పందంపై సంతకం చేస్తాడు. ప్రతి ప్రకటనదారు కూడా నిర్ధారిత యాడ్‌ స్పాట్‌ (సాధారణంగా కీవర్డ్‌ అయ్యుంటుంది) కు తాను చెల్లించదలచిన గరిష్ఠ మొత్తాన్ని కోట్‌ చేస్తాడు. ఇందుకోసం సాధారణంగా ఆన్‌లైన్‌ పనిముట్ల‌నే వాడుతుంటారు. సందర్శకుడు యాడ్‌ స్పాట్‌ దగ్గరున్న ట్రిగ్గర్‌ను నొక్కిన ప్రతిసారీ ఆటోమేటిక్‌ పద్ధతిన వేలం జరిగిపోతుంది.

ఈ యాడ్‌ స్పాట్‌ సెర్చ్‌ ఇంజన్‌ ఫలితాల పేజీ (ఎస్‌ఈఆర్‌పీ) లో భాగమైతే, బిడ్‌ దాఖలు చేసిన ప్రతి కీవర్డ్‌ కోసం శోధన జరిగినపుపడల్లా ఆటోమేటిక్‌ వేలం జరుగుతుంది. కీవర్డ్ కోసం జరిగే బిడ్లన్నీ శోధకుని భౌగోళిక ప్రాంతం, శోధన తేదీ, సమయం తదితరాలను లక్ష్యం చేసుకుంటాయి. వాటిని పోల్చిన తర్వాత విజేతను నిర్ణయిస్తారు. ఒకటికి మించిన యాడ్‌ స్పాట్లు ఉంటే (ఇది SERPs తరచూ జరుగుతుంటుంది) విజేతలు కూడా ఎక్కువ మంది ఉండేందుకు ఆస్కారముంది. పేజీలో కన్పించే వారి స్థానాలు వారు దాఖలు చేసిన బిడ్‌ను బట్టి ఉంటాయి. అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన ప్రకటన ముందుగా కన్పిస్తుంది. అయితే ప్రకటన నాణ్యత, సమకాలీనత వంటివి కూడా కొన్నిసార్లు ఈ విషయంలో పరిగణనలోకి వస్తాయి (నాణ్యత మార్కులను చూడండి).

SERPల్లో యాడ్‌ స్పాట్లకు తోడు అంశానికి సంబంధమున్న ప్రకటనలను కూడా తాము భాగస్వామ్యం కుదుర్చుకున్న మూడో పార్టీ ఆస్తుల పై ప్రదర్శించేందుకు నెట్‌వర్కులు అనుమతిస్తాయి. ఈ ప్రచురణకర్తలు నెట్‌వర్క్‌ తరఫున హోస్ట్‌ ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంటారు. అందుకు ప్రతిగా నెట్‌వర్క్‌కు లభించే ప్రకటన ఆదాయంలో కొంత మొత్తాన్ని అందుకుంటాయి. అది ప్రకటనదారులు చెల్లించే మొత్తం ఆదాయంలో 50 నుంచి 80శాతానికి పైన ఎంతైనా ఉండవచ్చు. ఈ ఆస్తులను తరచూ కంటెంట్‌ నెట్‌వర్క్‌గా పిలుస్తారు. వాటిలో వచ్చే ప్రకటనలను కంటెక్స్టువల్‌ యాడ్స్ ‌ అంటారు. ఎందుకంటే ఈ యాడ్‌స్పాట్లు అవి కన్పించే పేజీకి సంబంధించిన అంశం పై ఆధారపడ్డ ముఖ్య పదాలకు‌ సంబంధించినవి అయ్యుంటాయి. సాధారణంగా కంటెంట్‌ నెట్‌వర్కుల్లోని ప్రకటనలకు SERPల్లో కన్పించే ప్రకటనలతో పోలిస్తే తక్కువ క్లిక్‌ త్రూ శాతం (CTR), కనర్షన్‌ శాతం (CR‌) ఉంటాయి. అదే మోతాదులో వాటి విలువ కూడా తక్కువే ఉంటుంది. వెబ్‌సైట్లు, న్యూస్‌లెటర్లు, ఇ-మెయిళ్ల వంటివన్నీ కంటెంట్‌ నెట్‌వర్క్‌ ఆస్తుల కిందికే వస్తాయి.[5]

ప్రకటనదారులు తమకందే ప్రతి క్లిక్‌కూ డబ్బు చెల్లిస్తారు. బిడ్‌ మొత్తం ఆధారంగా వాస్తవ చెల్లింపులుంటాయి. రెండో అత్యధిక బిడ్డర్‌ లేదా వాస్తవ మొత్తం బిడ్‌లలో ఏది తక్కువైతే దానికంటే కాస్త (ఉదాహరణకు ఒక పెన్నీ) ఎక్కువగా మొత్తాన్ని చార్జ్‌ చేయడం వేలం నిర్వహించే హోస్ట్‌లకు సర్వసాధారణం.[6] బిడ్డర్లు తాము ఎలాగైనా బిడ్‌ను గెలుచుకోవాలనే ప్రయత్నంలో తమ బిడ్లను నిరంతరం అతి తక్కువ మొత్తాల్లో పెంచడం, తగ్గించడం, క్లిక్‌లకు మాత్రం అంతకంటే కాస్త తక్కువ మొత్తాన్ని చెల్లించడం వంటి పరిస్థితులను నివారించేందుకు ఇది తోడ్పడుతుంది.

విజయాన్ని గరిష్ఠం చేసేందుకు, స్కేల్‌ను సాధించేందుకు ఆటోమేటెడ్‌ బిడ్‌ నిర్వహణ వ్యవస్థలను అమలు చేస్తుంటారు. ఈ వ్యవస్థలను నేరుగా ప్రకటనదారే అమలు చేయవచ్చు. అయితే సాధారణంగా PPC బిడ్‌ మేనేజ్‌మెంట్‌ను ఓ సేవగా అందించే ప్రకటన ఏజెన్సీలే వీటిని వాడుతుంటాయి. బిడ్‌ నిర్వహణను ఒక స్కేల్‌ వద్ద వేలు, లేదా ఒక్కోసారి లక్షలాది PPC బిడ్లను పూర్తి ఆటోమేటెడ్‌ వ్యవస్థ ద్వారా నిర్వహించేందుకు ఈ పనిముట్లు వీలు కల్పిస్తాయి. ప్రతి బిడ్‌ దానికి నిర్ధారించిన లక్ష్యం (అంటే లాభాన్ని గరిష్ఠం చేయడం, లేదా బ్రేక్‌ఈవెన్‌ వద్ద ట్రాఫిక్‌ను గరిష్ఠం చేయడం) పై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ సాధారణంగా ప్రకటనదారు వెబ్‌సైట్‌తో అనుసంధానమై ఉంటుంది. ప్రతి క్లిక్‌కూ ఫలితాలను ప్రదర్శిస్తుంది. తద్వారా అది బిడ్లను నిర్ధరించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థ ప్రభావశీలత అవి పని చేయాల్సిన పనితీరు గణాంకాల పై నేరుగా ఆధారపడుతుంది. అలాగేలో ట్రాఫిక్‌ ప్రకటనలు డేటా కొరత సమస్యకు దారి తీయవచ్చు. ఇది పలు బిడ్‌ నిర్వహణ పనిముట్ల‌ను మహా అయితే పనికిరానివిగా, అత్యధిక స్థాయిలో అయితే అసమర్థంగా మారుస్తుంది.

చరిత్ర[మార్చు]

1998 ఫిబ్రవరిలో 25 మంది ఉద్యోగులతో మొదలైన Goto.com‌ (తర్వాత ఓవర్చుర్‌గా మారింది. ఇప్పుడు యాహూలో భాగం) కు చెందిన జెఫ్రీ బ్రూవర్‌ ఒక క్లిక్‌కు చెల్లింపు సెర్చ్‌ ఇంజన్‌ ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్టును గురించి కాలిఫోర్నియాలో TED సదస్సులో వివరించాడు.[7] ఇది, తర్వాతి సంఘటనలు PPC ప్రకటన వ్యవస్థ ఏర్పాటుకు దారి తీశాయి. ఈ PPC పద్ధతి ఆవిష్కర్తగా సాధారణంగా ఐడియాలాబ్‌, Goto.com‌ వ్యవస్థాపకుడు బిల్‌ గ్రాస్‌లను చెబుతారు.

గూగుల్‌ 1999లో సెర్చ్‌ ఇంజన్‌ ప్రకటనలను మొదలు పెట్టింది. కానీ 2000 అక్టోబర్‌కు గానీ యాడ్‌వర్డ్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టలేదు. ఈ వ్యవస్థ ప్రకటనదారులు గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో ఉంచేందుకు టెక్ట్స్‌ ప్రకటనలను తయారు చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే PPC పద్ధతిని 2002లో మాత్రమే ప్రవేశపెట్టారు. అప్పటిదాకా ప్రకటనలకు ప్రతి 1,000 క్లిక్‌లకు ఇంత అనే పద్ధతిన వసూలు చేసేవారు.

GoTo.com (తర్వాత ఓవర్చుర్‌) 1998లో PPCని మొదలు పెట్టినా 2001 నవంబర్‌ దాకా యాహూ GoTo.comతో సిండికేట్‌ కావడానికి ప్రయత్నించలేదు.[8] అంతకు ముందు యాహూ ప్రాథమిక మూలమైన SERPS‌ ప్రకటన వ్యవస్థలో కాంటెక్స్టువల్‌ IAB ప్రకటన యూనిట్ల (ప్రధానంగా 4 68I60 డిస్‌ప్లే ప్రకనటలు) తో కూడి ఉంది. యాహూతో 2003లో సిండికేషన్‌ ఒప్పందం రెన్యువల్‌కు వచ్చిన సందర్భంగా, సంస్థను 163 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయాలన్న ఆకాంక్షను యాహూ వెల్లడించింది.[9]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రకటనల సర్వింగ్‌
 • క్లిక్‌ ఫామ్‌
 • రేట్‌ ద్వారా క్లిక్‌
 • కంటెక్ట్సువల్‌ ప్రకటనలు
 • కన్వర్షన్‌ (మార్కెటింగ్‌)
 • ఒక్కో చర్యకు రేటు
 • ఒక్కో ఎంగేజ్‌మెంట్‌కు రేటు
 • ఒక్కో వెయ్యికి రేటు
 • టెక్ట్స్‌లో ప్రకటనలు
 • ఇన్-టెక్స్ట్ ప్రకటన
 • ప్లేస్‌మెంట్‌ కొరకు చెల్లింపు
 • పిపిసి కాపీ రైటింగ్‌
 • సెర్చ్‌ ప్రకటన విధానం
 • శోధనా యంత్రాలు అమ్మడం
 • శోధనా యంత్ర నిఘా/సెర్చ్ ఇంజన్ వాచ్
 • SEO కాపీ రైటింగ్
 • ఎస్‌ఇఓ కాపీ రైటింగ్‌

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 ప్రస్తుత కస్టమర్స్‌ డేవిడ్‌ సెజెటెలా, 2009
 2. Shuman Ghosemajumder (March 18, 2008). "Using data to help prevent fraud". Google Blog. Retrieved May 18, 2010. Cite web requires |website= (help)
 3. అవసరం లేని క్లిక్‌లను ప్రభావాలను మీరు ఎలా అడ్డుకోగలరు? గూగుల్‌ యాడ్‌ సెన్స్‌ హెల్ప్‌ సెంటర్‌, 2008 జనవరి 9న వినియోగించబడింది.
 4. Shopping.com Merchant Enrollment Archived 2012-03-26 at the Wayback Machine. Shopping.com, 2007 జూన్‌ 12న యాక్సెస్‌ చేయబడింది.
 5. Yahoo! Search Marketing (May 18, 2010). "Sponsored Search". Website Traffic Yahoo! Search Marketing (formerly Overture). Retrieved May 18, 2010. Cite web requires |website= (help)
 6. యాడ్‌ వర్డ్స్‌ డిస్కౌంటర్‌[permanent dead link], గూగుల్‌ యాడ్‌ వర్డ్స్‌ సహాయం, 2009 ఫిబ్రవరి 23న యాక్సెస్‌ చేయబడింది.
 7. ఓవర్చర్‌ మరియు గూగుల్‌: ఇంటర్నెట్‌ పే పర్‌ క్లిక్‌ (పిపిసి) ప్రకటన వేలం, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, 2007,జూన్‌ 12న యాక్సెస్‌ చేయబడింది
 8. Yahoo! Inc. (2002). "Yahoo! and Overture Extend Pay-for-Performance Search Agreement". Yahoo! Press Release. మూలం నుండి 2007-06-09 న ఆర్కైవు చేసారు. Retrieved May 18, 2010. Cite web requires |website= (help)
 9. Stefanie Olsen (July 14, 2003). "Yahoo to buy Overture for $1.63 billion". CNET. Retrieved May 18, 2010. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Blog topics