Jump to content

పై డే

వికీపీడియా నుండి

గణితంలో వాడే గుర్తు పేరు "పై" (π). దీని విలువ 22/7 అంటే 3.14159. ఈ విలువ ఆధారంగా గణిత శాస్త్రవేత్తలు, మేధావులు ప్రతీ సంవత్సరం మూడవ నెల 14వ తేదిన "పై డే" గా జరుపుకుంటారు.[1][2]

చరిత్ర

[మార్చు]

1988లో పై డేను మొట్టమొదటిసారిగా పెద్ద వేడుకగా శాన్ ఫ్రాన్సిస్కో ఎక్స్‌ప్లోరేటోరియంలో లారీ షా నిర్వహించాడు.[3] అక్కడ షా భౌతిక శాస్త్రవేత్తగా పనిచేసేవాడు.[4] ఈ వేడుక కోసం అక్కడి పనిచేస్తున్న సిబ్బంది, ప్రజలు అక్కడి వృత్తాకార ప్రదేశాలలో ఒకదాని చుట్టూ కవాతు చేస్తూ, ఆపై పండ్లతో చేసిన "పై" (pie)లు తిన్నారు.[5] ఎక్స్‌ప్లోరేటోరియంలో పై డే వేడుకలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి.[6]

2009 మార్చి 12 న అమెరికా ప్రతినిధుల సభలో 2009 మార్చి 14 ని జాతీయ పై దినోత్సవంగా గుర్తిస్తూ తప్పనిసరి కాని తీర్మానానికి (111 H. Res. 224) ఆమోదం లభించింది.[7] 2010లో పై దినోత్సవం సందర్భంగా గూగుల్ ఒక ప్రత్యేకమైన డూడుల్‌ను ప్రదర్శించింది, ఇందులో "GOOGLE" అనే పదం వృత్తాలు, పై చిహ్నాల చిత్రాలపై ఉంచబడింది. గణిత స్థిరాంకం పై కి (π) గౌరవ సూచకంగా దీనిని రూపొందించారు. మార్చి 14న గూగుల్ హోమ్‌పేజీలో కనిపించిన ఈ డూడుల్‌ను గూగుల్ డూడుల్స్ (doodles.google.com)లో చూడవచ్చు

కొందరు 2014 మార్చి (3/14) మొత్తాన్ని "పై నెల"గా పాటించారు. [8] [9] 2015 సంవత్సరంలో, మార్చి 14ను "సూపర్ పై డే"గా జరుపుకున్నారు. [10] దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ తేదీని అమెరికన్ ఫార్మాట్ (నెల/రోజు/సంవత్సరం) లో 3/14గా రాస్తారు, ఇది π (పై) విలువ 3.14ను సూచిస్తుంది. ఇంకా ప్రత్యేకంగా, 3/14/15 నాడు, ఉదయం 9:26:53 గంటలకు, తేదీ, సమయం కలిసి 3.141592653 అనే π మొదటి పది అంకెలను సరిగ్గా సూచిస్తాయి.[11] ఈ రెండవ సంఖ్య, "పై ఇన్‌స్టంట్" π అన్ని అంకెలను సూచిస్తుంది.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Bellos, Alex (March 14, 2015). "Pi Day 2015: a sweet treat for maths fans". theguardian.com. Retrieved March 14, 2016.
  2. Program on Sveriges Radio – Swedish national radio company Read March 14, 2015
  3. Berton, Justin (March 11, 2009). "Any way you slice it, pi's transcendental". San Francisco Chronicle. Retrieved March 18, 2011.
  4. Borwein, Jonathan (March 10, 2011). "The infinite appeal of pi". Australian Broadcasting Corporation. Retrieved March 13, 2011.
  5. Apollo, Adrian (March 10, 2007). "A place where learning pi is a piece of cake" (PDF). The Fresno Bee. Archived from the original (PDF) on 2014-02-28. Retrieved 2025-12-09.
  6. "Exploratorium 22nd Annual Pi Day". Exploratorium. Archived from the original on March 14, 2011. Retrieved January 31, 2011.
  7. Berton, Justin (March 11, 2009). "Any way you slice it, pi's transcendental". San Francisco Chronicle. Retrieved March 18, 2011.
  8. Berton, Justin (March 11, 2009). "Any way you slice it, pi's transcendental". San Francisco Chronicle. Retrieved March 18, 2011.
  9. Berton, Justin (March 11, 2009). "Any way you slice it, pi's transcendental". San Francisco Chronicle. Retrieved March 18, 2011.
  10. "30th Anniversary of Pi Day!". www.google.com (in ఇంగ్లీష్). Retrieved March 19, 2018.
  11. Ro, Sam (March 13, 2014). "March 14, 2015 Will Be A Once-In-A-Century Thrill For Math Geeks". Business Insider. Retrieved March 13, 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=పై_డే&oldid=4690400" నుండి వెలికితీశారు