పొగాకుగింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొగాకు మొక్కలను ముఖ్యంగా పొగాకుమొక్క ఆకుల ఉత్పత్తికై సాగుచేయుదురు. ఈ పొగాకు మొక్క సొలనేసి కుటుంబానికి చెందినది[1]. వృక్షశాస్త్రనామం:నికొటిన టబకం.లిన్న్ (Nicotina tabacum Linn). దీనినే 'విర్జీనియా టొబాకొ ' (virginia tobaco) అంటారు. సిగరెట్, బీడిల తయారికి ఈచెట్టు ఆకులనే వాడెదరు. పొగాకులో మరొక జాతి నికొటిన రస్టిక.లిన్నే (Nicotina rustica.linn). పొగాకు సాగులో విత్తనాలు ఒక విధంగా ఉప ఉత్పత్తి అని చెప్పవచ్చు.

మొక్క
పూలు
గింజలు

భారతదేశంలో ఇతర భాషల్లో పేరు[మార్చు]

 • అస్సాం: ధూపత్ (Dhupat)
 • బెంగాలి: తమక్ (Tamak)
 • ఒరియా: ఉయన్‍పత్ర (uan patra)
 • తమిళం: పుగయిలై (pugayilai
 • మలయాళం: పుకయిల (pukayila)
 • కన్నడ: హొగెసొప్పు (Hoge soppu)
 • గుజరాతి: తమకు (Tamaku)
 • మరఠి, హింది, పంజాబి: తంబాకు (Tambaku)

భారతదేశంలో సాగులో వున్న రాష్ట్రాలు[మార్చు]

అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, పశ్చిమ బెంగాల్, బీహరు, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, తమిళనాడు[2].

ప్రపంచంలో పొగాకు సాగుచేస్తున్న దేశాలు[మార్చు]

పొగాకును ఉత్పత్తిచేస్తున్న దేశాలలో (2008-2009) అగ్రగామి చైనా (58%) [3], అతరువాత అగ్రగామి బ్రెజిల్, ఇండియా, అమెరికాదేశాలు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో 40% ఒక చైనా దేశమే ఉత్పత్తి చేస్తున్నది. ఆ తరువాత అర్జెంటినా, బ్రెజిల్, బల్గేరియా, గ్రీసు, ఇండోనేషియా, కొరియా, పాకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, అమెరికా సంయుక్తరాష్ట్రాలు, జింబాంబ్వే. భారతదేశంలో వుత్పత్తి ప్రపంచ పొగాకు ఉత్పత్తిలో 7-8% సాగుచేస్తున్నారు.

మొక్క-గింజలు[మార్చు]

మొక్క : ఏకవార్షిక మొక్క. గట్టి కాండం కల్గివుండును. 1-3 మీటర్లఎత్తు పెరుగును. నిటారుగా వున్న కాండానికి తక్కువ కొమ్మలుండును. ఉష్ణమండలాలో పెరుగు పంట. నల్లరేగడి నేలలు అనుకూలం. వర్షపాతం కనీసం500-100మి.మీ .పంటకాల మంతా వుండాలి.

పొగాకు గింజలు : బ్రౌన్‍రంగులో ఆవాల కన్న కొంచెంపెద్దగా, గోళాకారంలో 0.5మి.మీ పొడవుండును. గింజ గట్టిగావుండును. గింజలో పొగాకులో వుండే నికొటిన్ వుండదు. గింజలో 38% వరకు నూనె ఉంది. గింజలో 26% వరకు మాంసకృత్తు (ప్రోటిన్లు) వున్నాయి.

పొగాకు గింజలలోని సమ్మేళన పదార్దాల పట్టిక

సమ్మేళన పదార్దం విలువ
మాంసకృత్తులు 25.0-26.0%
నూనె 38.0-42.0%
పీచు పదార్ధము 20-22%
అన్‌సఫొనిపియబుల్ నూనె పదార్థం 1.2-1.5%
తేమశాతం 3.3-5.1% గరిష్ఠం
బూడిద 3.2-3.6%
నత్రజని 0.6-2.7%

గింజల నుండి నూనెను సంగ్రహించు పద్ధతులు[మార్చు]

పొగాకు గింజలనుండి నూనెతీయు ఎక్సుపెల్లర్లు అను యంత్రాలద్వారా, సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్‍ ప్లాంట్ ద్వారా నూనెను ఉత్పత్తి చేస్తారు[4]

పొగాకు నూనె భౌతికలక్షణాలు -, కొవ్వు ఆమ్లాల శాతం[మార్చు]

గింజల నుండి తీసిన నూనె పసుపు, గ్రీన్‍ రంగుల కలయికతో లేదా ముదురు భ్రౌన్‍ రంగులోవుంది, కొద్దిగా పొగాకు వాసనకల్గి వుందును. నూనెను రిపైనరి చేసినప్పుడు ఈవాసన తొలగిపోవును. ఇది సెమి డ్రైయింగ్ ఆయిల్. రిఫైన్ చేసిన నూనె వర్ణరహితంగా వుండును.

పొగాకుగింజల నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[5]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటిక్‌ ఆమ్లం (C16:0) 15-16
స్టియరిక్ ఆమ్లం (C18:0) 4-5
ఒలిక్ ఆమ్లం (C18:1) 13-15
లినొలిక్ ఆమ్లం (C18:2) 64-67

పొగాకుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4673-1.4683
ఐయోడిన్ విలువ 130-145
సపనిఫికెసను విలువ 186-195
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.5-2.0% గరిష్ఠం
తేమశాతం 0.5% గరిష్ఠం (ముడినూనె)
రంగు 1/4"సెల్, (y+5R) 45 (ముడినూనె)

నూనె వినియోగం[మార్చు]

 • రిఫైండ్ చేసిన నూనెను వనస్పతి తయారిలో వాడవచ్చును.
 • సబ్బుల తయారిలో వాడవచ్చును
 • బయోడిసెల్ తయారిలో వాడుటకు ఉపయుక్తం[6].

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]