పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| రకం | ప్రభుత్వ |
|---|---|
| స్థాపితం | 2025 |
| ఛాన్సలర్ | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ |
| వైస్ ఛాన్సలర్ | డి.మునిరత్నంనాయుడు (ఇన్‌ఛార్జి) |
| స్థానం | రాజమహేంద్రవరం, భారతదేశం |
| కాంపస్ | పట్టణ ప్రాంత |
| అనుబంధాలు | యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ |
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది.[1]
నేపధ్యం
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు హైదరాబాదు కేంద్రంగా 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాడు. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆ విశ్వవిద్యాలయం సేవలందించింది. దానికి అనుబంధంగా శ్రీశైలం, రాజమహేంద్రవరం, కూచిపూడిలలో పీఠాలూ కొనసాగాయి. 2025 మార్చి 18న తెలంగాణ ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది.[2] దాని పీఠాల పరిధిలోని కోర్సులకు విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది..
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు వైభవం.. విశ్వ వ్యాపితం". EENADU. Retrieved 2025-10-25.
- ↑ "తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు". Eenadu. 18 March 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.