పొట్లపల్లి కేశవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు
పొట్లపల్లి కేశవరావు


తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
21 సెప్టెంబర్‌ 2017 – 9 ఆగష్టు 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-29) 1961 మార్చి 29 (వయసు 63)
పెండ్యాల గ్రామం, వరంగల్ జిల్లా
మరణం 9 ఆగష్టు 2021
హబ్సిగూడ , హైదరాబాద్
తల్లిదండ్రులు పొట్లపల్లి ప్రకాశరావు, జయప్రద
జీవిత భాగస్వామి ఉష
సంతానం నిశాంత్‌, సిద్ధార్థ్‌
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి కాకతీయ విశ్వవిద్యాలయం
వృత్తి న్యాయమూర్తి

జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2017 సెప్టెంబర్‌ 21న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పొట్లపల్లి కేశవరావు 29 మార్చి 1961న వరంగల్ జిల్లా, పెండ్యాల గ్రామంలో పొట్లపల్లి ప్రకాశరావు, జయప్రద దంపతులకు జన్మించాడు. ఆయన వరంగల్‌ కాకతీయ డిగ్రీ కళాశాలలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి 1986లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి లా పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

పొట్లపల్లి కేశవరావు 1986లో ఏప్రిల్‌లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని మొదట వరంగల్‌లో న్యాయవాది పింగళి సాంబశివరావు దగ్గర జూనియర్‌గా చేరి ఆ తరువాత 1991లో హైదరాబాద్‌ లో హైకోర్టు న్యాయవాది ఎంవీ రమణారెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1996 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.

పొట్లపల్లి కేశవరావు 1998 అక్టోబరు నుంచి 2001 అక్టోబరు వరకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశాడు.ఆయన 2010-16 మధ్యకాలంలో సీబీఐ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నాడు. పొట్లపల్లి కేశవరావు 2015లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ (జీహెచ్‌ఎంసీ) ,కులీ కుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఉన్నాడు.ఆయన 2017 సెప్టెంబరు 21న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[1]

మరణం

[మార్చు]

జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 ఆగష్టు 2021న మరణించాడు. ఆయనకు భార్య ఉష, ఇద్దరు కుమారులు నిశాంత్‌, సిద్ధార్థ్‌లు ఉన్నారు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Deccan Chronicle (19 September 2017). "Hyderabad High Court gets six new judges" (in ఇంగ్లీష్). Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  2. Namasthe Telangana (9 August 2021). "జస్టిస్‌ కేశవరావు కన్నుమూత". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  3. Eenadu (10 August 2021). "హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేశవరావు కన్నుమూత". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  4. Andrajyothy (10 August 2021). "హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.కేశవరావు మృతి". andhrajyothy. Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.