పొన్నాడ సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ponnada Subba Rao in 1952

పొన్నాడ సుబ్బారావు భారత రాజకీయ నాయకుడు, న్యాయవాది. అతను భారతదేశ 1వ లోక్‌సభలో సభ్యునిగా నవరంగపూర్ నియోజకవర్గం నుండి 1952లో ఎన్నికై ప్రాతినిధ్యం వహించాడు.

ప్రారంభజీవితం

[మార్చు]

అతను విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో 1889 నవంబరు 7న జన్మించాడు. అతని తండ్రి పొన్నాడ రామయ్య. [1] అతను విశాఖపట్నంలోని లండన్ మిషన్ హైస్కూల్ లోనూ, పర్లాకిమిడి రాజా కళాశాలలోనూ, మద్రాసులోని పచైయప్పాస్ కళాశాలలోనూ, విజయనగరం మహారాజా కళాశాలలోనూ విద్యాభ్యాసం చేసాడు. అతను మద్రాసు న్యాయ కళాశాలలో చదివాడు. [1] అతను బి.ఎ, బి.ఎల్ డిగ్రీలను పొందాడు.[1] 1908లో శేషమ్మ ను వివాహమాడాడు. వారికి ఎనిమిదిమంది పిల్లలు(వారిలో ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు) కలరు.[1] అతను జూలై 1913 నుండి జూలై 1915 మధ్య కాలంలో సి.బి.మిషన్ స్కూలులో విద్యాబోధన చేసాడు.[1] అతను తెలుగు భాషలో రోం చరిత్ర గూర్చి పుస్తకాన్ని 1914లో రచించాడు. [1]

స్వాతంత్ర్యోద్యమంలో...

[మార్చు]

సుబ్బారావు 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా చేరాడు. [1] 1921-1922 కాలంలో అతను తన న్యాయవాద ప్రాక్టీసును విడిచిపెట్టి భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. [1] ఆ కాలంలో అతను విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా భాద్యతలను నిర్వహించాడు. [1]

పార్లమెంటు సభ్యునిగా...

[మార్చు]

అతను 1951లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వాన్ని పరిత్యజించాడు. [1] 1952లో అతను నవరంగపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్ పార్టీ తరపున పోటీచేసి మొదటి లోక్‌సభకు ఎన్నికైనాడు. అతను ఆ ఎన్నికలో 67,257 ఓట్లు (46.96%) సాధించాడు.[2] అతను మొదటి లోక్‌సభలో ఒడిశా నుండి ఎన్నికైన ఆరుగురు ఎ.ఐ.జి.పి సభ్యులలో ఒకడు.[2]

అతను భారత లోక్‌సభ అధికారికంగా వెలువరించిన సభ్యుల జీవిత చరిత్రల ప్రకారం అతనికి హిందూ, క్రిస్టియన్ సాహిత్యం పట్ల, రైల్వే, గణాంకాల పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. [1]

మూలాలు

[మార్చు]