పొన్నూరు పురపాలక సంఘం
పొన్నూరు | |
స్థాపన | 1964 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
పొన్నూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరుజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, పొన్నూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]పొన్నూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోని మునిసిపాలిటీ. పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, పొన్నూరు (పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది.[1].రాష్ట్ర రాజధానికి అమరావతికి 67 కి.మీ దూరంలో ఉంది.1964 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 59,913, జనాభా ఉండగా అందులో పురుషులు 29,486, మహిళలు 30,427 మంది ఉన్నారు.అక్షరాస్యత 78.33% ఉంది.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5507 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 16,138 గృహాలు ఉన్నాయి.[2]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సజ్జ హేమలత, [3] వైస్ చైర్మన్‌గా ఆకుల సాంబశివరావు పనిచేస్తున్నారు.[3]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- వినాయకస్వామి దేవాలయం
- సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణస్వామివారి దేవాలయం
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 29.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.16 రెవెన్యూ వార్డులు,31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 25 మురికివాడలు ఉండగా అందులో జనాభా 13107 ఉన్నాయి.30 ప్రభుత్వ ఆసుపత్రులు,1 కూరగాయల మార్కెట్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Madras, Manual (1883). A MANUAL OF KISTNA DISTRICT IN THE PRESIDENCY OF MADRAS. Madras: Asylum Press. p. 204.
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
- ↑ 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.