Coordinates: 18°49′52″N 78°57′19″E / 18.8311087°N 78.9551997°E / 18.8311087; 78.9551997

పొలాస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొలస, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల గ్రామీణ మండలంలోని గ్రామం.[1]

పొలాస
—  రెవిన్యూ గ్రామం  —
పొలాస is located in తెలంగాణ
పొలాస
పొలాస
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°49′52″N 78°57′19″E / 18.8311087°N 78.9551997°E / 18.8311087; 78.9551997
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల
మండలం జగిత్యాల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,149
 - పురుషుల సంఖ్య 2,568
 - స్త్రీల సంఖ్య 2,581
 - గృహాల సంఖ్య 1,192
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన జగిత్యాల గ్రామీణ నుండి 7 కి. మీ. దూరంలో ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని జగిత్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జగిత్యాల గ్రామీణ మండలం లోకి చేర్చారు.[2] 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1192 ఇళ్లతో, 5149 జనాభాతో 1482 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2568, ఆడవారి సంఖ్య 2581. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 825 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 17. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572072[3].పిన్ కోడ్: 505529.

చరిత్ర[మార్చు]

రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల శాసనాలలో పౌలస్త్యాశ్రమ పట్టణంగానూ, పొలవాసదేశంగాను, పౌలస్త్యేశ్వరపురం గాను ప్రముఖంగా పేర్కొనబడిన చారిత్రాత్మకమైన స్థలం ఇది. పొలాస సంస్కృత పండితులకు నిలయంగా, వేదాధ్యయన కేంద్రంగా విలసిల్లినట్టుగా కూడా ఆధారాలున్నాయి.

స్థల నామ వ్యుత్పత్తి[మార్చు]

ఈ గ్రామంలో వెలసిన పౌలస్త్యేశ్వర స్వామి పేరు ఆధారంగా పొలాస అన్న పేరు స్థిరపడిందన్న నమ్మకం ఈ ప్రాంతంలో ప్రచురంగా ఉంది. కాని, ఇది జానపద వ్యుత్పత్తిగా, ఆ రోజుల్లో సర్వ సాధారణమైన సంస్కృతీకరణకు దృష్టాంతంగా చూపవచ్చు. అదీకాక, పట్టణం, స్థలము అన్న అర్థాలున్న పోళ-, పొల-, ప్రోల- మొదలైన మూల ద్రావిడ ధాతువుల ద్వారా ఈ స్థలనామ వ్యుత్పత్తిని ఆవిష్కరించడం తేలిక.

నైసర్గిక స్వరూపం[మార్చు]

పొలాస 18.9° ఉత్తర అక్షాంశ రేఖ, 79.03° తూర్పు రేఖాంశ రేఖల వద్ద విస్తరించి సముద్ర మట్టానికి 264 మీటర్ల ఎత్తులో ఉంది.

చరిత్ర[మార్చు]

పొలాస రాజధానిగా మేడరాజు (1080-1110) పొలవాసదేశాన్ని పాలించే వాడని 12వ శతాబ్దపు శాసనాల వల్ల మనకు తెలుస్తోంది. 1108లో రాయించిన ఒక శాసనంలో మేడరాజును మహామండలేశ్వర-మేడ-క్ష్మాపతిగా వర్ణిస్తూ లత్తలూరు-పుర-వరాధీశ్వర, సువర్ణ గరుడధ్వజ మొదలగునవి ఇతని బిరుదులుగా పేర్కొనడం రాష్ట్రకూటులతో ఇతని అనుబంధాన్ని తెలుపుతుంది. ఈ ప్రాంతాన్ని ఇతని కొడుకు జగ్గదేవుడు 1110-1116 సం. మధ్య పరిపాలించాడు. జగ్గదేవుని మరణానంతరం రాజైన మేడరాజు II ఆనాటి కాకతీయ ప్రభువైన ప్రోల II (1083 - 1158) కు సామంతునిగా ఉండేవాడు. కానీ 1158లో రాజ్యాభిషిక్తుడైన కాకతీయ యువరాజు రుద్రునిపై మేడరాజుII తిరగుబాటు చెయ్యడంతో ఉగ్రుడైన రుద్రుడు, తన సైన్యంతో తరలివచ్చి మేడరాజుని ఓడించాడు. ఆ యుద్ధానంతరం రుద్రుడు పొలాస నగరాన్ని తగులబెట్టించాడట. 1159 నుండి పొలవాసదేశం కాకతీయుల ఆధీనంలో ఉంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

1980లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఒక వ్యవసాయ పరిశోధనా సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసారుగ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పొలసలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పొలసలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

పొలసలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 109 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 21 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 124 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 320 హెక్టార్లు
 • బంజరు భూమి: 445 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 462 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 815 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 412 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పొలసలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 404 హెక్టార్లు* చెరువులు: 8 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పొలసలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మొక్కజొన్న

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

పౌలస్త్యేశ్వరాలయం[మార్చు]

కాకతీయుల కళావైభవాన్ని చాటిచెప్పే త్రికూటాకారపు పౌలస్త్యేశ్వరాలయం 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి కాలంలో కట్టినట్టు శాసనాధారాలు ఉన్నాయి. చెరువు గట్టు క్రింద గల ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం పేరు మీదుగానే పొలాసగా పిలుస్తారని ప్రతీతి.

మరికొన్ని వివరాలు[మార్చు]

పొలాస జగిత్యాలకు 9 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. ఈ ఊరిలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయ కళాశాల ఉన్నాయి. ఈ ఊరిలో ముఖ్య పంట వరి.ఈ ఊరిలో అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలసి మెలసి స్నేహభావంతో నివసిస్తారు. ఈ ఊరిలో అన్ని మతాల వారి దేవాలయాలు ఉన్నాయి. మసీదు, చర్చి, హిందూ దేవాలయం ఉన్నాయి. ఈ ఊరిలో ప్రశాంతమయిన చెరువు ఉంది. ఈ ఊరు కొన్ని సంవత్సరాలు జగిత్యాలకు తాలుకాగా ఉండేది. ప్రశాంతమయిన వాతావరణంతో గుడి, ప్రభుత్వ బడి ఉంటాయి. చుట్టు పక్కల ఊళ్ల వారు ఇక్కడకు వచ్చి చదువుకుంటుంటారు. ఈ ఊరిలో రోజూ ఉదయాన్నే గ్రామ పంచాయతీ దగ్గర ప్రజలతో, వారి వ్యాపార సంభాషణలతో ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది. ఈ పొలాస గ్రామం జాతీయ రహదారి నం-7 ప్రక్కన ఉంటుంది. ఈ ఊరు చుట్టుప్రక్కల గ్రామాలలో చాలా పేరు పొందిన గ్రామం. ఈ ఊరిలో వేద పాఠశాల ఉంది. ఈ ఊరిలో పల్లెటూరు వాతావరణం ఉట్టిపడుతుంది. ఈ ఊరికి పడమర దిశ న తెల్ల గుట్ట, ఉత్తర దిశ న అడ్డ గుట్ట ఉన్నాయి.ఈ ఊరు చుట్టు పంట పొలాలతో, చెఱువుతో ఎప్పుడూ ఎంతో అహ్లాదకరంగాను, ప్రశాంతంగాను ఉంటుంది. చెరువు ప్రక్కన జాలర్లతో ఎంతో అందంగా వుంటుంది.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2018-03-14.
 2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పొలాస&oldid=3635328" నుండి వెలికితీశారు