పోఖ్రాన్
| ?పోఖ్రాన్ రాజస్థాన్ • భారతదేశం | |
| అక్షాంశరేఖాంశాలు: 26°55′N 71°55′E / 26.92°N 71.92°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 233 మీ (764 అడుగులు) |
| జిల్లా(లు) | జైసల్మేర్ జిల్లా జిల్లా |
| జనాభా | 19 (2001 నాటికి) |
పోఖ్రాన్ (ఆంగ్లం : Pokhran) లేదా పోకరాన్, రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా లోని, ఒక పట్టణం మరియు పురపాలిక సంఘము . ఇది థార్ ఎడారి ప్రాంతంలో ఉన్నది. భారత్ తన మొదటి అణుపరీక్ష ఇక్కడనే చేపట్టింది.
విషయ సూచిక
భూగోళికం[మార్చు]
పోఖ్రాన్ న యున్నది.[1] దీని సరాసరి ఎత్తు 233 మీటరులు (764 అడుగులు).
రాళ్ళతో చుట్టబడిన ఇసుక ప్రాంతము. పోఖ్రాన్ అనగా 'ఐదు ఎండమావులు'. జోధ్‌పూరు నుండి జైసల్మేరు మరియు బికనేరు నుండి జైసల్మేరు పోయే మార్గం మధ్యన పోఖ్రాన్ గలదు.
జనగణన[మార్చు]
2001 గణాంకాల ప్రకారం[2], పోఖ్రాన్ యందు, 19,186 జనాభా గలదు. పురుషులు 55% మరియు స్త్రీలు 45%. అక్షరాస్యత సరాసరి 56%, జాతీయ సరాసరి 59.5% కంటే తక్కువ : అక్షరాస్యత పురుషులలో 68%, మరియు స్త్రీలలో 41%. పోఖ్రాన్ లో 19% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారిది.
అణు పరీక్ష ప్రదేశం[మార్చు]
1972 సెప్టెంబరు 7 న, పోఖ్రాన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భాభా అణు పరిశోధనా సంస్థ (BARC) ట్రాంబే కు, భారత్ లో తయారైన అణు పరికరాన్ని పరీక్ష చేయడానికి అధికారాలను ఇచ్చింది. మే 18 1974 న భారత్ తన మొదటి అణుపరీక్ష చేపట్టింది. 1998 మే 11 నుండి మే 13 వరకు ఐదు అణుపరీక్షలు చేపట్టింది. ఆ తరువాత పరీక్షలకు నిషేధం ప్రకటించింది.
మూలాలు[మార్చు]
- ↑ "Falling Rain Genomics, Inc. - Map and weather data for Pokhran".
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.