పోచంపల్లి (భూదాన్)
బి.పోచంపల్లి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బి.పోచంపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం
భూదాన్ పోచంపల్లి[మార్చు]
1951 ఏప్రిల్ 18 న నల్గొండ జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు.మొట్టమొదటి సారి 'భూదాన్ ఉద్యమం ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి 'భూదాన్ పోచంపల్లి' అని పిలుస్తారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు.అతను గ్రహించింది ఏంటంటే 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల భూమిని అడిగారు, వీటిలో సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు కావాలని.అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే వేద్రే రామచంద్ర రెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో ఇది భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం అని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.[2][3]