Jump to content

పోట్స్‌డామ్ కాన్ఫరెన్స్

వికీపీడియా నుండి
పాట్స్‌డామ్ కాన్ఫరెన్స్
పాట్స్‌డామ్ కాన్ఫరెన్సులో క్లెమెంట్ అట్లీ, హారిస్ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్
నిర్వహించు దేశంమిత్రరాజ్యాల ఆక్రమణలోని జర్మనీ
తేది1945 జూలై 17 – ఆగస్టు 2
వేదిక(లు)సెసిలియన్‌హాఫ్
నగరాలుపాట్స్‌డామ్
సభ్యులుజోసెఫ్ స్టాలిన్ (సోవియట్ యూనియన్) విన్‌స్టన్ చర్చిల్ క్లెమెంట్ అట్లీ (యునైటెడ్ కింగ్ డమ్)
హారీ ఎస్. ట్రూమన్ (అమెరికా సంయుక్త రాజ్యాలు)
పంథాయల్టా కాన్ఫరెన్స్
సమావేశాల్లో క్లెమెంట్ అట్లీ, ఎర్నెస్ట్ బెవిన్, జోసెఫ్ స్టాలిన్, వ్యాచెస్లావ్ మోలోటోవ్, విలియం డి. లేహీ, జోసెప్ ఇ. డేవిస్, జేమ్స్ ఎఫ్. బైర్న్స్ హ్యారీ ఎస్. ట్రూమాన్
ఎడమ నుండి కుడికి, మొదటి వరుస: సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ జోసెఫ్ స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్, అమెరికాకు సోవియట్ రాయబారి ఆండ్రీ గ్రోమికో, అమెరికా విదేశాంగ కార్యదర్శి జేమ్స్ ఎఫ్. బైర్న్స్, సోవియట్ విదేశాంగ మంత్రి వ్యాచెస్లావ్ మోలోటోవ్. రెండవ వరుస: బ్రిగేడియర్ జనరల్ హ్యారీ హెచ్. వాన్, ట్రూమన్ సైనిక సహాయకుడు, రష్యన్ వ్యాఖ్యాత చార్లెస్ బోహ్లెన్, ట్రూమాన్ నావికా సహాయకుడు జేమ్స్ కె. వర్డుమన్ జూనియర్, (పాక్షికంగా అస్పష్టంగా) చార్లెస్ గ్రిఫిత్ రాస్
కూర్చున్నవారిలో (ఎడమ నుండి): క్లెమెంట్ అట్లీ, హ్యారీ ఎస్. ట్రూమాన్, జోసెఫ్ స్టాలిన్, వెనుక నించున్నవారిలో ఎడమ నుంచి: ఫ్లీట్ అడ్మిరల్ విలియం డేనియల్ లేహీ, విదేశాంగ కార్యదర్శి ఎర్నెస్ట్ బెవిన్, విదేశాంగ కార్యదర్శి జేమ్స్ ఎఫ్. బైర్న్స్, విదేశాంగ మంత్రి వ్యాచెస్లావ్ మోలోటోవ్

పోట్స్‌డామ్ సమావేశం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమి అనంతరం సోవియట్ ఆక్రమణ జోన్‌లోని జర్మనీలోని పోట్స్‌డామ్‌లో 1945 జూలై 17 నుండి ఆగస్టు 2 వరకు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాకా 1919 నాటి పారిస్ శాంతి సమావేశంలో జరిగిన పొరబాట్లను నివారిస్తూ, మూడు ప్రముఖ మిత్రరాజ్యాలు యుద్ధానంతర శాంతిని ప్లాన్ చేయడానికి ఇది ఉద్దేశించింది. దీనిలో సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ పాల్గొన్నాయి. ఈ దేశాలకు వరుసగా జనరల్ సెక్రటరీ జోసెఫ్ స్టాలిన్, ప్రధాన మంత్రులు విన్స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీ, అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమాన్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది వారాల ముందు బేషరతుగా లొంగిపోవడానికి అంగీకరించిన జర్మనీని ఎలా పరిపాలించాలో నిర్ణయించుకోవడానికి వారు సమావేశమయ్యారు. యుద్ధం తరువాత ప్రపంచం సాగే విధానాన్ని ఏర్పాటు చేయడం, శాంతి ఒప్పందంపై సమస్యలను పరిష్కరించడం, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడం కూడా ఈ సమావేశ లక్ష్యాలలో ఉన్నాయి.